బులుగు బాగోతం బయటపడినట్లేనా.? ఇంకా మార్ఫింగ్ బుకాయింపు కొనసాగుతుందా.? ‘అది ఫేక్’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారాన్ని వైసీపీ నాన్చబోతోందా.? ‘కఠిన చర్యలు’ అంటూ మీడియాకి లీకులు పంపి, తెరవెనుకాల విషయాన్ని తప్పుదోవ పట్టించే చర్యలు జరుగుతున్నాయా.?
అసలు ఎవర్ని చట్ట సభలకు పంపుతున్నాం.? అన్న చర్చ ప్రజల్లో జరగాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే అక్రమాస్తుల కేసులున్నాయ్. ఆయనకు రాజకీయంగా ప్రజామోదం లభించింది గనుక, అలాంటోళ్ళనే చట్ట సభలకు పంపాలని అధికార పార్టీ అనుకుంటే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?
మొన్నీమధ్యనే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మల్సీ తన వద్ద కారు డ్రైవరుగా పని చేసిన ఓ దళిత వ్యక్తిని చంపేసి, డెడ్ బాడీని బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన విషయం విదితమే. వైసీపీ పాలనలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఉదంతం ఇంతలా ఎందుకు హాట్ టాపిక్ అవుతోంది.? అధికార పార్టీకి చెందిన అను‘కుల’ మీడియానే, గోరంట్ల మాధవ్ తప్పు చేశాడని చెబుతోందంటే.. ఇక్కడ మేటర్ క్లియర్.! అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలే గోరంట్ల మాధవ్ వీడియో లీక్ అవడానికి కారణంగా చెప్పుకోవచ్చేమో.
ఈ వీడియోలో వున్న మహిళ ఎవరు.? ఈ ప్రశ్నకు మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకే చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్త.. అనే ప్రచారం జరుగుతోంది. ‘తూచ్ నేను కాదు’ అంటోందామె.! ఇంతకీ, ఏది నిజం.?
ప్రత్యర్థి పార్టీలపై అడ్డగోలు ట్వీట్లతో తాను మహిళలనన్న విచక్షణను మర్చిపోయే ఆ వైసీపీ సోషల్ విభాగం కార్యకర్త నిజంగానే గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్‌లో వుందా.? అన్నదానిపైనా అధికార పార్టీ స్పష్టతనివ్వాల్సి వుంది. తూచ్.. ఇదంతా విపక్షాల కుట్రే.. అంటూ బుకాయించే పరిస్థితి కూడా లేకపోయిందంటే, ఈ ఘటనలో అధికార పార్టీ ఎంతలా ఇరుక్కుపోయిందో అర్థం చేసుకోవచ్చు.