Switch to English

సీతా రామమ్ రివ్యూ: ఎంగేజింగ్ పీరియాడిక్ డ్రామా

Critic Rating
( 2.75 )
User Rating
( 2.80 )

No votes so far! Be the first to rate this post.

91,319FansLike
57,014FollowersFollow
Movie సీతా రామం
Star Cast దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్
Director హను రాఘవపూడి
Producer అశ్విని దత్
Music విశాల్ చంద్రశేఖర్
Run Time 2 గం 43 నిమిషాలు
Release 5 ఆగస్టు 2022

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి తెరకెక్కించిన సీతా రామమ్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

రామ్ (దుల్కర్ సల్మాన్) రాసిన ఒక ప్రేమలేఖను సీత (మృణాల్ ఠాకూర్)కు ఇవ్వడానికి సీతను వెతకడం మొదలుపెడుతుంది అఫ్రీన్ (రష్మిక). కట్ చేస్తే కథ 1965కి వెళుతుంది. లెఫ్టినెంట్ రామ్ కు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వద్ద పోస్టింగ్ వస్తుంది. అనాథ అయిన రామ్ కు సీత నుండి ఉత్తరాలు వస్తాయి. కొన్ని ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత ఇద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది.

అయితే పాకిస్తాన్ కు ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్లిన రామ్ అక్కడి సైనికులకు పట్టుబడతారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ విషయంలో సహాయం చేసింది ఎవరు? రామ్ ప్రేమ కథ ఏమవుతుంది? అఫ్రీన్ తాను అనుకున్న మిషన్ ను పూర్తి చేస్తుందా? ఈ కథలో విష్ణు శర్మ (సుమంత్)కు ఉన్న ప్రాధాన్యం ఏంటి?

నటీనటులు:

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్… ఇద్దరూ కూడా ఈ సినిమాకు బెస్ట్ అనిపించుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. సినిమా దాదాపుగా వీళ్ళ మీదే నడుస్తుంది. ఆ క్రమంలో ఇద్దరూ తమ నటనతో ఇంప్రెస్ చేస్తారు. దుల్కర్ స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతం. మృణాల్ తన ముఖకవళికలతో, నటనతో సర్ప్రైజ్ చేస్తుంది.

వీరిద్దరి తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్ర రష్మికకు దక్కింది. అఫ్రీన్ గా ఆమె నటన ఓకే. తరుణ్ భాస్కర్ కూడా పర్వాలేదు. సుమంత్ కు ఇందులో ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కింది. తను మెప్పిస్తాడు. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. మిగిలిన వారు మామూలే.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా సీతా రామమ్ ఉన్నతంగా తెరకెక్కింది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అటు పాటలు కానీ ఇటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్బ్ అంతే. పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ అబ్బురపరుస్తాయి. కాశ్మీర్ వాలీను బాగా చూపిస్తారు. ఆర్ట్ వర్క్ ను కూడా మెచ్చుకోవాలి.

ఎడిటింగ్ పర్వాలేదు కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకా క్రిస్పీగా ఉండొచ్చు అనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. నిర్మాతల గట్స్ కు మెచ్చుకోవాలి.

ఇక హను రాఘవపూడి విషయానికి వస్తే కచ్చితంగా సెకండ్ హాఫ్ ఇబ్బందులను అధిగమించాడు. సెకండ్ హాఫ్ పై ఎక్కువ దృష్టి పెట్టి ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ వచ్చినా పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఇంకాస్త రేసీగా ఫస్ట్ హాఫ్ ను తీర్చిదిద్ది ఉంటే సీతా రామమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.

పాజిటివ్ పాయింట్స్:

  • లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ
  • పాటలు

నెగటివ్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ, ల్యాగ్

చివరిగా:

సీతా రామమ్ పేరుకి తగ్గట్లే సీత, రామ్ మధ్య నడిచే పీరియాడిక్ లవ్ స్టోరీ. గత సినిమాల్లో చేసిన తప్పులను సరిదిద్దుకున్నాడు హను. చివరిదాకా సస్పెన్స్ ను క్యారీ చేయడంలో విజయం సాధించాడు. అయితే రన్ టైమ్ కనీసం మరో 15 నిముషాలు తగ్గించి ఉంటే కొన్ని ల్యాగ్ సీన్స్ పోయి సీతా రామమ్ మరింత ఎఫెక్టివ్ గా ఉండేది. ఏదేమైనా సీతా రామమ్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పీరియాడిక్ ప్రేమకథ.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఫైమాని సేవ్ చేసి.. రాజ్‌ని బలిపశువుగా మార్చేసి.!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ...

స్వామి మాల వేసినా ఆటిట్యూడ్ తగ్గించుకోని ప్రభాకర్ తనయుడు… మరోసారి ట్రోల్స్

ఈటివి ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేసిన ప్రెస్ మీట్ ట్రోలర్స్...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ఎక్కువ చదివినవి

తాడిపత్రిలో ఉద్రిక్తత..! టీడీపీ నేత అస్మిత్ రెడ్డిపై రాళ్లదాడి

అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్‌ రెడ్డిపై రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా అస్మిత్‌రెడ్డి తాడిపత్రిలోని కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఈ...

పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు మేజర్ అప్డేట్ ఇదిగో

ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తోన్న పవన్ కళ్యాణ్ జానపద ఫిక్షనల్ డ్రామా హరిహర వీర మల్లు షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైన విషయం తెల్సిందే. గత రెండేళ్ల నుండి ఈ చిత్రం షూటింగ్...

ఔను, విద్య, వైద్యమంటే వేల కోట్ల వ్యాపారం.!

విద్య, వైద్యం.. వీటిని లాభాపేక్షతో సంబంధం లేకుండా చూడాలి. కానీ, విద్య అలాగే వైద్యం.. ఈ రెండిటికి సంబంధించి వచ్చేంత లాభం.. ఇంకే రంగంలోనూ కనిపించదు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తక్కువే...

రాశి ఫలాలు: ఆదివారం 27 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.8:29 వరకు తదుపరి పంచమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాషాఢ సా.5:05 వరకు తదుపరి...

రాశి ఫలాలు: శనివారం 26 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ తదియ రా.10:49 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: మూల రా.6:42 వరకు...