మాజీ మంత్రి.. అయ్యో, అలాగంటే ఆయన ఫీలవుతారు. ప్రస్తుతానికి ఆయన గుడివాడ ఎమ్మెల్యే మాత్రమే.! మంత్రిగా పనిచేసిన సమయంలో ‘బూతుల మంత్రి’ అనే ఘనమైన బిరుదు సంపాదించుకున్నారు. ఇప్పుడు బూతుల ఎమ్మెల్యే అనాలా.? అంటే, ఆయనలానే చాలామంది ప్రజా ప్రతినిథులు బూతులు మాట్లాడుతున్న దరిమిలా.. ఆయన్ని మాత్రమే అలా అనడం సబబు కాదేమో.!
సరే, అసలు విషయానికొస్తే.. చెత్త మీద పన్నేంటి.? అంటూ జనం ఛీత్కరించుకుంటున్న వేళ, ఈ మాజీ మంత్రిగారిలో.. అదేనండీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిగారికి జ్ఞానోదయం కలిగింది. ఎంత వసూలవుతోంది.? అని అధికారుల్ని అడిగి మరీ, ‘చెత్త మీద పన్ను వేయొద్దన్నాను కదా..’ అంటూ ప్రజల సమక్షంలో అధికారుల్ని నిలదీసేశారు.
సాటి ఎమ్మెల్యే, పైగా మాజీ మంత్రి కూడా అయిన పేర్ని నానితో అక్కడినుంచే ఫోన్లో మాట్లాడేశారు కొడాలి నాని. ఈ నానీలందర్నీ కలిపి ‘బోడి లింగాలు’ అంటూ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారనుకోండి.. అది వేరే విషయం.
‘నానీ, ముఖ్యమంత్రిగారితో మాట్లాడదాం.. చెత్త పన్ను విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..’ అంటూ పేర్ని నానితో ఫోన్లో చెప్పారట కొడాలి నాని. అదిరింది కదూ.! కొడాలి నాని అంటే మాజీ మంత్రి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. కొడాలి నాని నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి, తన నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పలేరా.?
ఎన్నికల వేళ ఓట్ల కోసం ఓటుకు రెండు వేల నుంచి పది వేలదాకా రాజకీయ పార్టీలు ఖర్చు చేయడం కొత్తేమీ కాదు. ఇక, చెత్త పన్ను.. నెలకి ఓ కుటుంబానికి 90 రూపాయలు అనుకుంటే, ఆ కుటుంబంలో రెండు ఓట్లు వుంటాయనుకుంటే.. ఓటుకు ఐదు వేలు ఇచ్చారనుకుంటే.. రికవరీ చెత్తపన్ను నుంచే అయిపోయిందా.? అన్న లెక్కలు జనం కడుతున్నారు మరి.!
కరెన్సీ నోట్ల కోసం ఓట్లు అమ్ముకుంటే, ప్రజల జీవితాలిలాగే చెత్త చెత్తగా తయారవుతాయ్.. అన్నది జనం నుంచే వస్తోన్నమాట.
230762 72002Spot lets start work on this write-up, I in fact believe this wonderful website requirements additional consideration. Ill a lot more likely be once again you just read additional, thank you that data. 254231
671514 71016An incredibly intriguing examine, I could possibly not concur entirely, but you do make some really valid points. 572592
260187 5979Would adore to always get updated fantastic website ! . 879227