Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ డ్రామాతో ‘విజేత’గా నిలిచిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈతరహా సినిమాలకు మాస్ టచ్ ఇస్తే ఆ లెవల్ వేరుగా ఉంటుంది. కథకు మహిళా ప్రేక్షకులు.. హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. దీంతో సినిమా సక్సెస్ కావడమే కాకుండా కుటుంబ ప్రేక్షకులు ఆ హీరోను ఓన్ చేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇందుకు ఉదాహరణ. 80వ దశకంలో రచయితలు, దర్శకులు ఇలా చేసిన పలు సినిమాలు హిట్టయ్యాయి. అప్పటికి చిరంజీవికి మాస్ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతోంది. అడపాదడపా ఫ్యామిలీ డ్రామా సినిమాలతో కుటుంబ ప్రేక్షకులు ఆదరణా పెరుగుతుంది. అప్పటికే ఈ ఫార్ములాతో చేసిన శుభలేఖ, మగమహారాజు సూపర్ హిట్. ఆ తరహాలోనే చిరంజీవి మరో సినిమా చేసి సూపర్ హిట్ సాధించిన సినిమా ‘విజేత’.

భావోద్వేగ పాత్రలో మెప్పించి..

కుటుంబ బాధ్యతలు మోస్తూ.. చినబాబుగా బరువైన పాత్రలో జీవించారు చిరంజీవి. ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆడుతూపాడుతూ ఉంటూనే చెల్లి పెళ్లి కోసం కిడ్నీ దానం చేస్తాడు చినబాబు. కథలో కీలకమైన ఈ ట్విస్ట్ లో చిరంజీవి హావభావాలు, కుటుంబసభ్యుల మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఇదే సినిమా విజయానికి కారణమైంది. ‘చిరంజీవి కొడితే వంద మంది పడిపోతారంతే..’ అనేంత క్రేజ్ లో ఉండి హాస్పిటల్ బెడ్ పై కుటుంబం కోసం త్యాగం చేసే పాత్రలో చిరంజీవి ప్రేక్షకుల్ని మెప్పించడం సామాన్యమైన విషయం కాదు. ఇదే చిరంజీవిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవడానికి.. కెరీర్లో మరిన్ని ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు చేయడానికి విజేత కారణమైంది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ డ్రామాతో ‘విజేత’గా నిలిచిన చిరంజీవి

చిరంజీవి ఆలోచనే కొత్తగా..

గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. చిరంజీవితో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారు. కీలకమైన సన్నివేశాలను రక్తి కట్టించారు. సంగీతపరంగా చక్రవర్తి మరోసారి మ్యాజిక్ చేశారు. సెంటిమెంట్ పాట సైతం ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేసింది. హీరోయిన్ భానుప్రియకు చిరంజీవితో ఇదే తొలి సినిమా. చిరంజీవికి మరో కొత్త జోడీగా వీరిద్దరి జంట ఆకట్టుకుంటుంది. పాటల్లో వీరిద్దరి డ్యాన్సులు అలరించాయి. అప్రతిహత క్రేజ్ తో దూసుకుపోతున్న చిరంజీవి ఎలాంటి కథలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మెప్పించవచ్చో తెలుసుకోవడమే ఆయన ఎదుగుదలకు కారణమైంది. ఆకోవలోకే విజేత వస్తుంది.

మొదట అనుకున్న టైటిల్..

మొదట సినిమాకు ‘చినబాబు’ టైటిల్ అనుకున్నారు. కానీ.. చిరంజీవి సూచనతో సినీ వారపత్రిక జ్యోతిచిత్రలో టైటిల్ గురించి కాంటెస్ట్ నిర్వహించారు. ఎక్కువ ఓట్లు ‘విజేత’కే దక్కడంతో అదే పెట్టారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్టై చిరంజీవి కెరీర్ లో ఒక క్లాసిక్ గా నిలిచింది. 1985 అక్బోబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. విజయవాడలో సినిమా శతదినోత్సవ వేడుక నిర్వహించారు. సినిమాలో చిరంజీవి నటనకు కెరీర్లో రెండోసారి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు చిరంజీవి. టైటిల్ కార్డ్స్ లోనే ‘ఈ తరహా సినిమాలను మీరు ఆదరిస్తే.. నేను మరిన్ని మంచి పాత్రలు పోషించేందుకు ప్రోత్సాహమవుతుంద’ని చిరంజీవి అంటారు. సినిమాలో బాల నటులుగా అల్లు బాబి, అల్లు అర్జున్ కనిపిస్తారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...