Switch to English

అమరావతికి వైసీపీ ఫ్రీ పబ్లిసిటీ.! వైఎస్ జగన్‌ని నిండా ముంచేస్తున్నారే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమవుతుందో లేదోగానీ.. వైసీపీ ముఖ్య నేతలు, అందునా మంత్రులు సైతం, రాజధాని అమరావతికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు. పాజిటివ్ పబ్లిసిటీ అయినా, నెగెటివ్ పబ్లిసిటీ అయినా.. పబ్లిసిటీ అంటే పబ్లిసిటీనే.! ఒకరకంగా నెగెటివ్ పబ్లిసిటీనే ఈ మధ్య బాగా వర్కువట్ అవుతోంది.

‘సర్కారు వారి పాట’ సినిమాకి తొలి రోజు విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.. కానీ, ఆ సినిమా నిలబడింది. ఆ నెగెటివ్ పబ్లిసిటీ వల్లనే, మహేష్ అభిమానుల్లో ‘కసి’ పెరిగింది.. సినిమాని హిట్ చేసి పడేశారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. నార్త్ ఆడియన్స్ ఇప్పుడీ సినిమాని సీరియస్‌గా తీసుకున్నారు.

అమరావతి విషయంలోనూ అదే జరుగుతుందా.? అంటే, అదే జరిగే అవకాశాలెక్కువగా వున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రని అసమర్థుల శవ యాత్ర.. అంటూ వైసీపీ నేతలు కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అత్యంత జుగు్సాకరమైన వ్యాఖ్యలు కొందరు మంత్రులు, కీలక పదవుల్లో వున్న నాయకులు చేస్తున్న విషయం విదితమే.

అసలంటూ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిచ్చేసి వుంటే, ఆ పాదయాత్రని ఎవరూ పట్టించుకునేవారే కాదు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలున్నాయ్.. అందులో అమరావతి ఒకటి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా.? రైల్వే జోన్ గురించి గొంతు విప్పుతున్నారా.? నాశనమైన రోడ్ల గురించి నినదిస్తున్నారా.? ప్రైవేటు పరం కానున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా.? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేని గురించీ ఆలోచించడంలేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందన్నదానిపై వారికి ఖచ్చితమైన అభిప్రాయమంటూ ఏమీ లేదు.

ఇలాంటి సమయంలో, ప్రభుత్వం తరఫున అమరావతి రైతుల్ని రెచ్చగొట్టే చర్యలెందుకు.? మంత్రులు రంగంలోకి దిగి, అమరావతిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడమెందుకు.? తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి వుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పాక.. అందులో ఒకటైన అమరావతి విషయంలో మాత్రం మంత్రెలెందుకు ఇంతలా ‘అతి’ చేస్తున్నట్టు.?

అంటే, అధినేత నిర్ణయం మీద మంత్రులకు గౌరవం లేదన్నమాట. వైసీపీ ముఖ్య నాయకులెవరికీ తమ ముఖ్యమంత్రి విషయమై బాధ్యత లేదన్నమాట. ఇలా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.

అమరావతి రైతుల ఉద్యమానికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడమంటే కొరివితో తలగోక్కున్నట్లే.! ఔను, వైసీపీకి వేరే శతృవులే అవసరం లేదన్నట్టు తయారైంది పరిస్థితి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...