Switch to English

జనసేన జెండా అంటే అంత భయమెందుకు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

 

ఓ పత్రికాధినేత ‘జెండా పీకేద్దామా?’ అంటూ ప్రజారాజ్యం పార్టీపై విషం చిమ్మడం అప్పట్లో చాలా చర్చనీయాంశమయ్యింది. అయితే ఆనాటి రాజకీయ పరిస్థితులు, భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి నడపలేకపోయిన మాట వాస్తవం. రాజకీయాల్లో రంగులు ఎలా మారిపోతాయో, ఎవరి వెనుకాల ఎలాంటి కుట్రలు దాగి వుంటాయో రంగంలోకి దిగాకగానీ చిరంజీవి తెలుసుకోలేకపోయారు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ జెండాని ‘ఆ ఇద్దరు రాజకీయ ప్రముఖులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు’ పీకేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయిగానీ, ఇప్పుడు జనసేన విషయంలో అలా కుదరదు.

ఐదేళ్ళపాటు రాజకీయ పరిస్థితుల్ని పవన్‌కళ్యాణ్‌ క్షుణ్ణంగా పరిశీలించారు, అర్థం చేసుకున్నారు. ‘అవసరమైతే ఇంకా ఇంకా నేర్చుకుంటాను’ అని పవన్‌ చెబుతున్న మాటల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. అత్యంత పకడ్బందీగా ఐదేళ్ళ తర్వాత జనసేన పార్టీని ఎన్నికల బరిలోకి దింపారు. ఓ తప్పుడు మాటని పదిసార్లు చెబితే అదే నిజమవుతుందనే భావనలో వున్న కొందరు రాజకీయ నాయకులు, జనసేన పార్టీ 65 స్థానాల్లోనే పోటీ చేస్తోందంటూ పిచ్చి లెక్కలు తెరపైకి తెచ్చినా జనసేన వెరవలేదు. మొన్న తెలంగాణ పత్రికలో, ఆ తర్వాత జగన్‌కి చెందిన పత్రికలో ఇవే కథనాలు వచ్చాయి. ఆ పాత చెత్త కథనాల్ని ప్రస్తావించారు తాజాగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌ కూడా గట్టిగానే పడింది జనసేన ముఖ్య నేత లక్ష్మినారాయణ నుంచి.

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయిన విజయసాయిరెడ్డికి వయసు మళ్ళడం కారణంగా లెక్కలు అర్థం కావడంలేదేమోనని జనం నవ్వుకుంటున్నారు. అయితే ఇదంతా జనసేన మీద జరుగుతున్న కుట్ర అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క సీటు గెలిచినా, ప్రజలతోనే వుంటాం.. అని జనసేన తప్ప ఏ రాజకీయ పార్టీ ధైర్యంగా చెప్పగలిగింది ఇప్పటిదాకా? గుండె మీద చెయ్యేసుకుని జనసేన అభ్యర్థులు ‘మేం ఎన్నికల్లో డబ్బు పంచలేదు’ అని చెప్పగలరు.. ఆ ధైర్యం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు చెప్పగలరా? అవకాశమే లేదు.

ప్రజలు అధికారమివ్వలేదన్న అక్కసుతో అసెంబ్లీ వెళ్ళేందుకు ఇష్టపడని వైఎస్‌ జగన్‌, ఇంకోసారి అధికారమివ్వకపోతే నష్టపోతారంటూ బ్లాక్‌మెయిల్‌ చేసే చంద్రబాబు.. వీళ్ళిద్దరికీ వంత పాడే మీడియా సంస్థలు వెరసి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బాగోగులు మాత్రం ఎవరికీ పట్టడంలేదు. జనసేన అధికారంలోకి వస్తుందా? రెండు మూడు సీట్లకే పరిమితమవుతుందా.? లేదంటే కింగ్‌ మేకర్‌ పాత్ర పోషిస్తుందా? అనే అంశాలు జనం డిసైడ్‌ చేస్తారు. మార్పు కోసమంటూ ఓ ప్రయత్నం చేస్తున్న పవన్‌ని సమర్థించకపోయినా ఫర్వాలేదు, అలాంటి మార్పుకి మీడియా సంస్థలు అడ్డుపడకుండా వుండాలి.

జనం తిరస్కరిస్తే, జనసేనకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. అయినా, సినిమాల్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌, తిరిగి సినీ జీవితంలో రాణించడం పెద్ద కష్టం కాదు. అది అన్న చిరంజీవి చేసి చూపించారు. ఖరీదైన జీవితాన్ని వదిలేసి, జనం కోసం కష్టనష్టాల నడుమ మార్పు కోసం ప్రయత్నిస్తున్న పవన్‌కళ్యాణ్‌ని విమర్శించే నైతిక హక్కు, అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికెక్కడిది.? మార్పు మొదలైతే, ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలు తారుమారైపోతాయ్‌. అందుకే జనసేన జెండా చూస్తే అంత భయం. ఆ జెండా ఎగరకుండానే మట్టుబెట్టాలనే కుటిల ప్రయత్నాలు మానుకుని, ప్రజల కోసం ఆలోచిస్తే మంచిదేమో!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...