Switch to English

చంద్రబాబు, జగన్‌, పవన్‌.. ఎవరి పరిస్థితేంటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల పోలింగ్‌ ముగిశాక, ఫలితాల కోసం వేచి చూసే క్రమంలో ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన పని తాను చేసుకుపోతున్నారు.. కోడ్‌ సంగతిని సైతం పట్టించుకోవడం లేదాయన. ఆపద్ధర్మ ముఖ్యమంత్రినని తెలిసీ, చంద్రబాబు ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం అధికారుల్ని ఇరకాటంలో పడేస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం ఎన్నికల్లో తమదే గెలుపు.. అంటూ పోలింగ్‌ రోజునే ఓ ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. ఆ తర్వాత వ్యవహారమంతా పార్టీ నేతలు చూసుకుంటున్నారు. ఇక, జనసేన విషయానికొస్తే.. నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు జనసేనాని పవన్‌కళ్యాణ్‌.

మూడు ప్రధాన పార్టీల అధినేతల వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పోలింగ్‌ ముగిసింది కాబట్టి, చంద్రబాబు తిరిగి పాలనపై దృష్టి పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. జూన్‌ 8, 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు టర్మ్‌ ముగిసేది మళ్ళీ 2019 జూన్‌ 8నే అన్నది టీడీపీ నేతల గట్టి నమ్మకం. అయితే, ఎన్నికల కోడ్‌ ఇంకోలా చెబుతోంది. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారంలో వున్నవారికి సబబు కాదు. కానీ, ‘ఫలితాలు వచ్చేదాకా పాలనను పక్కన పడేయలేను కదా’ అని చంద్రబాబు చెబుతున్నారు.

సీనియర్‌ పొలిటీషియన్‌ అయిన చంద్రబాబు, ఎన్నికల కోడ్‌ని గౌరవించాలి. కానీ, ఆయన అలా చేయడంలేదు. ఈ క్రమంలో చంద్రబాబు అత్యుత్సాహంతో తీసుకుంటున్న నిర్ణయాలకు అధికారులు బలిపశువులైపోతున్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై వేటు పడింది.. దానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబే. ఇంకోపక్క, చంద్రబాబు ఏం చేసినా తప్పుపట్టడమే రాజకీయం అన్నట్లు వ్యవహరిస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. చిన్న విషయానికీ ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రం పరువుని ఢిల్లీ స్థాయిలో బజారుకీడ్చేస్తోంది ప్రతిపక్షం. టీడీపీ అత్యుత్సాహానికి వైఎస్సార్సీపీ ఓవరాక్షన్‌ తోడై.. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతున్నాయి.

ఇదిలా వుంటే, ఓటరు ఇచ్చే తీర్పు పట్ల గట్టి నమ్మకంతో వున్న జనసేన పార్టీ, పోలింగ్‌ పూర్తవగానే జనంలోకి వెళ్ళడం మొదలు పెట్టింది. సమస్యలపై తమ పోరాటం కొనసాగుతూనే వుంటుందని పవన్‌ గతంలో చెప్పినట్లుగానే జనసేన నేతలు జనంలోనే వుంటున్నారు. పవన్‌కళ్యాణ్‌ మాత్రం, మీడియా ముందుకు రావడంలేదు. వస్తే, ఆయన జరుగుతున్న పరిణామాలపై స్పందించాలి. అలా స్పందించే క్రమంలో ఆయన్నుంచి పొరపాటు మాటలు దొర్లినా దొర్లకున్నా వివాదం చేయడానికి ఎలాగూ రాజకీయ ప్రత్యర్థులు సిద్ధంగానే వుంటారు. అందుకే, ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌ హుందాగా వ్యవహరిస్తున్నారు.

పవన్‌కళ్యాణ్‌, పార్టీ నేతలతో అంతర్గత సమీక్షల్లో మునిగి తేలుతుంటే, అభ్యర్థులు, జనసైనికులు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితుల్ని అధినేతకు తెలియజేస్తున్నారు, అదే సమయంలో ప్రజలకు అండదండలు అందిస్తున్నారు. ‘మేం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తాం..’ అని జనసేన నేతలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ చెబుతున్నట్లు 150 లెక్కలు జనసేన చెప్పడంలేదు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను సుతిమెత్తగా తిప్పికొడుతూనే వున్నారు జనసైనికులు.

పాతికేళ్ళ రాజకీయానికి ముందస్తుగానే సరైన వ్యూహరచన చేసుకోవడమే తమ బలమని జనసేన చెబుతోంది. గెలిచినా ఓడినా తమది ప్రజల పక్షమేనన్నది జనసేన వాదన. ఒకటి రెండు సీట్లు కూడా కష్టమేనని జనసేనను వెటకారం చేస్తూ, ఆ పార్టీ జపం చేయకుండా వుండలేకపోతున్న టీడీపీ కావొచ్చు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కావొచ్చు.. మే 23న వచ్చే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తాయి? జనసేనలా స్థిమితంగా వుండగలుగుతాయా? కష్టమే.! ఎందుకంటే, వాటికి అధికారమే పరామవధి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...