కొందరు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక జాబ్ నుండి మరో జాబ్ కి మారెప్పుడు జీతం ఎక్కువ అవ్వాలని, పొజిషన్ కూడా ఎక్కువ అవ్వాలని కోరుకుంటారు. కానీ శీతల్ మాత్రం రివర్స్ ఆలోచించింది.
మహారాష్ట్ర పూణేకి చెందిన శీతల్ 2014 నుండి యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తోంది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బ్యాంకు మేనేజర్ గా విధులు నిర్వహించిన ఆమె కొత్తగా ఏమైనా చేయాలని ఉద్దేశంతో మహారాష్ట్ర ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ కు అప్లై చేసింది.
2019 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి ఆర్టీసీలో మహిళ డ్రైవర్లకు అవకాశం కల్పించింది. ఆ సమయంలో మొత్తం 194 మంది ఎంపికయ్యారు. కరోనా కారణంగా వీరి ట్రైనింగ్ ఆలస్యమైంది. అంతే కాకుండా పలు కారణాల వల్ల ఇన్నాళ్లు ఆ నోటిఫికేషన్ పక్కన పెడుతూ వచ్చారు.
చివరకు 17 మంది మహిళ డ్రైవర్లకు శిక్షణ ప్రారంభించారు. ఆ 17 మందిలో శీతల్ ఒకరు. మార్చి నెలలో శీతల్ యొక్క డ్రైవింగ్ శిక్షణ పూర్తయి మహారాష్ట్ర ఆర్టీసీలో తొలి బ్యాచ్ మహిళ డ్రైవర్ గా విధుల్లో చేరబోతుంది. హాయిగా ఏసీ గదిలో బ్యాంకు మేనేజర్ గా విధులు నిర్వహించకుండా ఆర్టీసీ బస్సులో డ్రైవర్ గా విధులు నిర్వహించాలని ఆమెకు ఎందుకనిపించిందో కదా..!
841897 208349Ive applied the valuable points from this page and I can surely tell that it gives a lot of assistance with my present jobs. I would be very pleased to maintain acquiring back in this web page. Thank you. 710037
204782 565778I dugg some of you post as I thought they were extremely helpful handy 706245
534728 705741Plenty of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 848196