Switch to English

చైనా.. కరోనా.. మోడీజీ ఈ ప్రశ్నలకు సమాధానమిస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కాస్సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. మరోపక్క, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంటోంది. కరోనా మరణాల సంఖ్య కూడా 17 వేలకు చేరువవుతోంది. ‘అన్‌ లాక్‌ 2’ రేపట్నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో, దేశ ప్రజలు.. దేశ ప్రధాని నుంచి ఓ భరోసాని ఆశిస్తున్నారు. చాలా అంశాలపై స్పష్టతను కోరుతున్నారు.

విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు.. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ దేశ ప్రధాని, జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడతారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చైనా, కరోనా.. ఈ రెండిటిదీ విడదీయరాని బంధం. ఇప్పుడు ఈ రెండూ దేశానికి ప్రమాదకారిగా మారాయి. సరిహద్దుల్లో చైనా బలగాలతో మన సైన్యం పోరాడాల్సిన పరిస్థితి. దేశంలో ‘చైనా వైరస్‌ – కరోనా’తో దేశ ప్రజలంతా పోరాడుతున్నారు. సరిహద్దు వివాదం విషయానికొస్తే, ‘చైనా బలగాలు మన భూభాగంలోకి రాలేదు’ అని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. పైగా, ఆయుధాలు ఉపయోగించలేదనీ కేంద్రం తేల్చి చెప్పింది. అలాంటప్పుడు, సరిహద్దుల్లో గొడవ ఎలా జరిగింది.? మనమెందుకు జవాన్లను కోల్పోయాం.? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ కేంద్రం నుంచి సమాధానం లేదు.

అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు, లడఖ్‌ కూడా తమదేనని చైనా వాదిస్తోంది. ప్రస్తుతానికైతే గల్వామా ప్రాంతంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పలేం. ‘తప్పంతా భారతదేశానిదే..’ అని చైనా అంటోంది. మరోపక్క, అమెరికా.. భారత్‌కి మద్దతుగా సైనిక బలగాలతో మద్దతిస్తామని చెబుతుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. కానీ, ఇది ఇంకో రకంగా భారత్‌కి నెగెటివ్‌గా మారే అవకాశముంది. చైనాకీ, భారత్‌కీ ఉమ్మడి మిత్రుడైన రష్యా.. భారత – చైనా మధ్య వివాదంలో అమెరికా జోక్యాన్ని అస్సలు సహించే పరిస్థితి వుండదు.

ఇదిలా వుంటే, చైనా యాప్స్‌ని కేంద్రం నిషేధించడంపై భిన్నాభిప్రాయాల వ్యక్తమవుతున్నాయి. టిక్‌టాక్‌ అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేయడమే కాదు, ‘డేటా చోరీ’ ఆరోపణల్ని తిప్పి కొడుతోంది. మరి, ఇలాంటి విషయాలపై మోడీ తన ప్రసంగంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరమే. అన్నిటికీ మించి, లాక్‌డౌన్‌తో ఏం సాధించాం.? అన్నదానిపై మోడీ వివరణ ఇవ్వాల్సి వుంది. ‘ఇలా చేయండి.. అలా చేయండి.. దేశం చాలా గొప్పది..’ అంటూ షరామామూలు ప్రసంగాన్ని దేశ ప్రజానీకం కోరుకోవడంలేదు. కరోనా కట్టడికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోంది.? రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సాయం చేస్తోంది ఈ విషయంలో.? ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సగటు భారతీయుడ్ని కేంద్రం ఎలా ఆదుకుంటుంది.? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం మోడీ ప్రసంగంలో వుంటుందని ఆశిద్దాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...