Switch to English

టిక్‌టాక్‌ బ్యాన్‌తో నష్టం చైనాకే కాదు.. వాళ్ళక్కూడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

టిక్‌టాక్‌ ఒక్కటే కాదు, టిక్‌టాక్‌తో కలిపి మొత్తం 59 మొబైల్‌ యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇంకో బలమైన కారణం కూడా వుంది టిక్‌టాక్‌ సహా మొత్తం 59 యాప్స్‌ని కేంద్రం రద్దు చేయడం వెనుక. అసలు విషయమేంటంటే, చైనాకి చెందిన చాలా యాప్స్‌, స్మార్ట్‌ ఫోన్లలోని సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. దాంతో చాలాకాలంగా ఈ యాప్స్‌పై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా ఆయా యాప్స్‌పై బ్యాన్‌ విధించడం జరిగిందన్నమాట.

ఇక, టిక్‌టాక్‌ బ్యాన్‌తో చైనాకి పెద్ద నష్టమే వాటిల్లనుంది. టిక్‌టాక్‌, షేర్‌ ఇట్‌, హలో యాప్స్‌తో చైనాకి వాటిల్లే నష్టంతోపాటు.. భారతదేశం కూడా ఎంతో కొంత నష్టపోవాల్సి వుంటుంది. ప్రధానంగా టిక్‌టాక్‌.. ఇండియాలో చాలామంది స్టార్స్‌ని తయారు చేసింది. ‘టిక్‌ టాక్‌ స్టార్‌’ అనే గుర్తింపు దక్కించుకున్న చాలామంది సినిమాల్లోనూ, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. వారిని రోల్‌ మోడల్స్‌గా తీసుకుంటూ మరికొందరు టిక్‌టాక్‌లో తమ ‘క్రియేటివిటీ’కి సానపడుతున్న విషయం విదితమే.

టిక్‌టాక్‌కి ప్రత్యామ్నాయంగా రోపోసో వంటి ఇండియన్‌ యాప్స్‌ అందుబాటులో వున్నా.. టిక్‌టాక్‌కి వున్నంత క్రేజ్‌ మరే ఇతర యాప్‌కీ లేదన్నది నిర్వివాదాంశం. తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా ఈ యాప్స్‌ ఉపయోగిస్తుంటాం. వాట్సాప్‌ వంటివి వున్నా.. హలో, షేర్‌ ఇట్‌ లాంటి యాప్స్‌కి వున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు వాటన్నిటినీ బ్యాన్‌ చేయడంతో ఒక్కసారిగా ఆయా యాప్స్‌ని వినియోగిస్తోన్నవారంతా షాక్‌కి గురయ్యారు.

అన్నట్టు, టిక్‌టాక్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ విషయంలో ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అసభ్యకరమైన కంటెంట్‌ మాత్రమే కాదు.. వివాదాస్పద కంటెంట్‌ కూడా టిక్‌టాక్‌లో కన్పిస్తుంటుంది. వాటన్నిటికీ ఇప్పుడు చెక్‌ పడటం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ‘టిక్‌టాక్‌’ బానిసలు మాత్రం, జరుగుతున్న పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా వుంటే, చైనా మన దేశానికి చెందిన చాలా వెబ్‌సైట్స్‌ మీద బ్యాన్‌ విధించినట్లు తెలుస్తోంది. న్యూస్‌ ఛానల్స్‌ ప్రసారాలు కూడా అక్కడ మనదేశానికి సంబంధించినవి కన్పించడంలేదట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...