Switch to English

కరోనా: తెలంగాణ ‘బెస్ట్‌’ నుంచి.. ‘ఫెయిల్డ్‌ తెలంగాణ’ దాకా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

తెలంగాణలో రోజువారీ కరోనా టెస్టుల సంఖ్య 10 వేలకి ఇంకా చేరుకోలేదు. రోజుకి ఐదు వేల టెస్టులు చేయడానికే పరిస్థితులు అనుకూలించడంలేదిక్కడ. కానీ, పొరుగు రాష్ట్రాల్లో 30 వేల మార్క్‌ కూడా దాటేసింది. ఎందుకిలా.? నిన్నటికి నిన్న 3 వేల లోపే కరోనా టెస్టులు జరిగితే, 975 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే, ఆంధ్రప్రదేశ్‌లో నిన్న సుమారు 30 వేల టెస్టులు జరిగితే 800 లోపు పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్‌ ల్యాబ్స్‌ని వినియోగిస్తున్నారు. ఎక్కడన్నా పాజిటివ్‌ కేసు నమోదైతే, ఆ వెంటనే.. ఆ ప్రాంతంలో ర్యాండమ్ గా పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం, కరోనా టెస్టులు చేయించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు జనం. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తోంది సాధారణ ప్రజానీకానికి. ప్రభుత్వాసుపత్రుల సంగతి సరే సరి. దానికి తోడు, ప్రైవేటు ల్యాబులు నిబంధనల్ని పాటించడంలేదంటూ ఆయా ల్యాబ్‌లలో కరోనా టెస్టులను ప్రభుత్వం నిలిపివేయడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.

సీజన్‌ మారింది.. వర్షాకాలం కావడంతో సాధారణంగానే సాధారణ జలుబు, సీజనల్‌ వైరల్‌ ఫీవర్స్‌ వస్తుంటాయి. వీటిని కరోనాగా భావించి జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ‘కరోనా బూచి’ని అడ్డంపెట్టుకుని సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసేస్తోన్న వైనం గురించి నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం. కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రిగా హైద్రాబాద్‌లో పిలవబడ్తోన్న చెస్ట్‌ హాస్పిటల్‌లో ఇద్దరు కరోనా బాధితులు.. అత్యంత దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనంగా మారిన విషయం విదితమే.

అవసరమైన అన్ని సౌకర్యాలూ అక్కడ వున్నాయని ప్రభుత్వం చెబుతోంటే, ‘మేం చచ్చిపోతున్నాం..’ అంటూ సెల్పీ వీడియోలు తీసుకుని మరీ రోగులు చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అసలు కరోనా లక్షణాలేమిటి.? కరోనా వస్తే ఏం చేయాలి.? పరీక్షలు ఎలా చేయించుకోవాలి.? వంటి విషయాలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. అది సరిపోవడంలేదు. కరోనా నుంచి కోలుకున్నవారితో కరోనా గురించి మాట్లాడించడం ద్వారా సాధారణ ప్రజల్లో ‘భయాందోళనలు’ కొంత మేర తగ్గుతాయి. దేశంలో ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. తెలంగాణలో అసలు ఆ పరిస్థితే కన్పించడంలేదు.

పోలీస్‌ శాఖలో కొందరు కరోనా బారిన పడి కోలుకోగా.. వారు తిరిగి విధుల్లో చేరడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి కరోనా విజయగాధల పట్ల ప్రచారం చేయగలగాలి. ఇక, అనుమానిత లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం మొబైల్‌ ల్యాబ్స్‌ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ పెద్దయెత్తున తెలంగాణ ప్రజల నుంచి వస్తోంది. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని చెబుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కరోనా టెస్టులు జరగాల్సిన సంఖ్యలో జరగకపోవడంపై పెదవి విప్పాలి.

మొదట్లో కేసీఆర్‌, తెలంగాణ ప్రజలకు కరోనా విషయంలో ‘భరోసా’గా నిలిచారు. అప్పట్లో ఆయన వీలు చిక్కినప్పుడల్లా మీడియా ముందుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితి ఏంటి.? అన్నదానిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నిటికీ మించి, కరోనా టెస్టుల కోసం ‘క్యూ లైన్లలో’ నిల్చుంటున్నవారు, టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా.. ఆ టెస్టుల కోసం వెళ్ళి కరోనా అటించుకుని రావాల్సి వస్తుందేమోనన్న ఆందోళన చెందే పరిస్థితి రాకుండా.. వీలైనంత ఎక్కువగా శాంపిల్స్‌ కలెక్షన్స్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయకపోతే.. సుమారు కోటి మంది జనాభా వున్న హైద్రాబాద్‌, కరోనా విషయంలో ముంబై, చెన్నయ్‌, ఢిల్లీ తదితర నగరాల్ని మించిపోయినా ఆశ్చర్యమేమీ వుండకపోవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...