Switch to English

కల్వకుంట్ల తారకరాముడికి పట్టాభిషేకమెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఏమయ్యింది తెలంగాణలోని అధికార పార్టీ నేతలకి.? వున్నపళంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పట్ల అభిమానం ఎందుకు వెయ్యి రెట్లు పెరిగిపోతోంది గులాబీ ప్రజా ప్రతినిథులకి. త్వరలో, అతి త్వరలో కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి పీఠమెక్కబోతున్నారంటూ ఒకరితో ఒకరు పోటీ పడి ప్రజా ప్రతినిథులు ప్రకటనలు చేసేస్తున్నారు.

ఒకరా.? ఇద్దరా.? దాదాపుగా ప్రజా ప్రతినిథులందరిదీ ఇదే మాట. ‘కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నవారు కొందరు.. ‘కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతుంది’ అనేవారు ఇంకొందరు. కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత పెరగొచ్చని ఇంకొందరు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుండడం ఇంకాస్త ఆశ్చర్యకరం.

ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో ఏదో ఒక రోజున కేటీఆర్ పట్టాభిషేకం జరగవచ్చన్నది టీఆర్ఎస్ వర్గాల నుంచి మీడియాకి అందుతున్న లీకుల సారాంశం. తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్.. అని నినదించేశారు. కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిథులు సోషల్ మీడియా వేదికగా, అప్పుడే ‘శుభాకాంక్షలు’ కూడా చెప్పస్తున్నారు.

తెరవెనుక ఏదో జరుగుతోందిగానీ, అదేంటన్నదానిపై మీడియాకి అస్సలు ఉప్పందడంలేదు. కేటీఆర్ సమర్థుడే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, కేసీఆర్.. చాలా ఎనర్జిటిక్‌గానే కనిపిస్తున్నారు. ఆయనలో రాజకీయంగా అలసత్వం, నిస్సత్తువ అనేవి లేనే లేవు. కేసీఆర్ ఎప్పుడైనా మాటల తూటాలు పేల్చగలరు. ఆయన మాటకున్న క్రేజ్‌ని, కేటీఆర్ మాటలతో పోల్చలేం. పోనీ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేసేంత సానుకూల వాతావరణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వుందా.? అంటే, అదీ లేదాయె.

ఏ ఈక్వేషన్ ప్రకారం కేసీఆర్, తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారోగానీ.. ఆయన అనుమతి లేకుండా, తెలంగాణలో ప్రజా ప్రతినిథులు కేటీఆర్ భజనలో మునిగి తేలరు కదా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...