Switch to English

రాజస్థాన్ లో రాజుకున్న రగడ.. మరో మధ్యప్రదేశ్ కానుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాజస్థాన్ లో రాజకీయ రగడ రాజుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు తెలుస్తోంది. తనకు మద్దతిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ హస్తిన వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిది ఎమ్మెల్యేలు పైలట్ ఉన్నట్టు సమాచారం.

పార్టీలో నెలకొన్న పరిస్థితుల గురించి సోనియా, రాహుల్ గాంధీలకు వివరించడానికి పైలట్ ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపణలు చేసిన మరుసటి రోజు పైలట్ హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కీలకమైన విషయాల్లో తనను గెహ్లాట్ పక్కనపెడుతున్నారంటూ సచిన్ పైలట్ ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి తొలి నుంచీ ఇరువురి మధ్య అంత సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ తరహాలో రాజస్థాన్ లోని గెహ్లాట్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకు సచిన్ ను పావుగా వినియోగించుకుంటోందని గెహ్లాట్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొన్న బీజేపీ.. కమల్ నాథ్ సర్కారును కూలగొట్టి, తాను పగ్గాలు చేపట్టింది. ఇక్కడ కూడా అదే తరహా రాజకీయాలు ప్రదర్శిస్తోందని గెహ్లాట్ వర్గం వాదిస్తోంది. అయితే, అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, దానిని వారే పరిష్కరించుకోవాలని బీజేపీ స్పష్టంచేసింది. అంతకుముందు గెహ్లాట్ సర్కారును కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్ల బృందం కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను విచారించింది.

అనంతరం సీఎం గెహ్లాట్ తోపాటు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు నోటీసులు జారీచేసింది. విచారణకు తమ ముందు హాజరు కావాల్సిందిగా పైలట్ ను కోరింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. ఇదంతా గెహ్లాట్ కుట్రేనని భావించిన ఆయన.. వెంటనే పార్టలోని పరిస్థితులను అధిష్టానానికి నివేదించేందుకు ఆదివారం ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ ను మరో మధ్యప్రదేశ్ కానీయబోమని.. ఈ అంశాన్ని పరిష్కరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...