టాలీవుడ్, బాలీవుడ్ హీరోలైతే బాగా తెలుసు కానీ .. హాలీవుడ్ హీరోల గురించి పెద్దగా తెలియదమ్మ.. ఒకరు ఇద్దరు తప్ప ? అంటారా .. అయితే మీరు ఈ ఫోటోపై సరిగ్గా లుక్కు వేయలేదన్నమాట !! ఎందుకంటే వాళ్ళు.. నిజంగా హాలీవుడ్ హీరోలు కాదండి బాబు .. మన హీరోలే .. నిన్న మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా పేస్ యాప్ ద్వారా రామ్ చరణ్, వరుణ్ కలిసి దిగిన ఫోటోను ఇలా మార్చేశారు. హాలీవుడ్ హీరోల్లా .. ఓల్డ్ ఏజ్ తో ఆకట్టుకునేలా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాలీవుడ్ లో హీరోలకు ఇంత వయసు ఉండాలన్న రూలేం లేదు .. ఏ వయసులో అయినా ఎలాంటి గట్స్ అయినా చేసే దమ్ముంటే చాలు.
నిన్న వరుణ్ పుట్టిన రోజు సందర్బంగా చరణ్ గ్రీటింగ్ తెలుపుతూ ఈ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. సో రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో మాత్రం ఓ రేంజ్ లో అందరికి షాక్ ఇస్తుంది. అన్నట్టు ఈ ఫోటో పెట్టి రామ్ చరణ్ ఏమని పోస్ట్ చేసాడో తెలుసా .. వయసు మళ్లుతుండడాన్ని ఆస్వాదించు .. వరుణ్ అంటూ కామెంట్ పెట్టాడు చరణ్. ఈ ఫోటో చుసిన మెగా ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మీరు కావాలంటే ఆ ఫోటోపై ఓ లుక్కేయండి.
724061 643125hello, your web site is really good. We do appreciate your give very good results 131041