Switch to English

సినిమా రివ్యూ: విజిల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు: విజయ్, నయనతార, వివేక్, జాకీ ష్రాఫ్, కథిర్, యోగిబాబు, ఇందుజ తదితరులు.
నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు
దర్శకత్వం: అట్లీ
సినిమాటోగ్రఫీ: జికె విష్ణు
మ్యూజిక్: ఏఆర్ రెహమాన్
ఎడిటర్‌: రూబెన్
విడుదల తేదీ: అక్టోబర్ 25, 2019

‘తుపాకి’, ‘పోలీసోడు’, ‘అదిరింది’, ‘సర్కార్’ లాంటి సినిమాలతో తెలుగు మార్కెట్ పెంచుకున్న తమిళ హీరో విజయ్ హీరోగా, ‘రాజా రాణి’తో తెలుగువారికి బాగా గుర్తున్న అట్లీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విజిల్’. కమర్షియల్ అంశాలని మిక్స్ చేసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విజిల్’ మూవీ ప్రేక్షకుల చేత విజిల్ వేయించే రేంజ్ లో ఉందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

విజిల్ కథలో మనకు విజయ్ తండ్రి – కొడుకులుగా కనిపిస్తారు, కానీ కొడుకు పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. దీని ప్రకారం కథలోకి వెళితే.. రాజప్ప(విజయ్) సమాజంలో తక్కువ జాతి ప్రజలకు జరుగుతున్న చెడుని ఆపి, వారి మంచి కోసం పోరాడే ఒక గ్యాంగ్ స్టర్. క్రైమ్ లేని, అందరూ సమానం అనే సొసైటీని తదుపరి తరాలకు ఇవ్వాలనుకుంటాడు. తన వారసుడు మైఖేల్(విజయ్) మొదట ఫుట్ బాల్ ప్లేయర్ అయినప్పటికీ, తన ఫుట్ బాల్ గేమ్ ని వదిలి తను కూడా సొసైటీలో జరిగే అన్యాయానికి ఎదురు నిలుస్తాడు. కానీ అనుకోకుండా ఆంధ్ర ఫుట్ బాల్ టీం కోచ్ గా మారాల్సి వస్తుంది. అసలు ఈ సోషల్ కథకి, ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధం ఏమిటి? ఆ ఫుట్ బాల్ ని మైఖేల్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ ఏ కారణాల వాళ్ళ ఫుట్ బాల్ కోచ్ గా మారాల్సి వచ్చింది? ఇంతకీ ఆ లేడీ టీంని గెలిపించాడా? లేదా? అనేదే అసలైన కథ.

సీటీమార్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

  • విజయ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ సినిమాకి మెయిన్ హైలైట్. మైఖేల్ లాంటి పాత్రలు విజయ్ గతంలో చేసాడు కావున అది ఓకే, కానీ రాజప్ప పాత్రలో విజయ్ నటన అద్భుతః అనిపిస్తుంది. రాజప్ప పాత్ర సినిమాలో ఉండేది తక్కువ సేపే అయినప్పటికీ మాస్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే నత్తి ఉన్న దైలాగ్ డెలివరీ కూడా బాగుంది.

  • ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ ఇది వరకూ చూడని బ్యాక్ డ్రాప్.. కావున ఇది ఆన్ స్క్రీన్ మనకి ఓ మంచి ఫీల్ ఇస్తుంది. అంతే కాకుండా ఫుట్ బాల్ ఎపిసోడ్స్ లో వచ్చే ఎలివేషన్స్ కొన్ని సూపర్బ్ అనిపిస్తాయి.

  • ప్రతి యాక్షన్ ఎపిసోడ్ మరియు హీరో ఎలివేషన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి నచ్చుతాయి.

  • ఇద్దరి విజయ్ల్ మధ్య వచ్చే ఎమోషనల్ బ్లాక్, ఇంటర్వల్ యాక్షన్ సీన్, జాకీ ష్రాఫ్ – విజయ్ ఫ్లాష్ బ్యాక్ సీన్, విజయ్ – లేడీ టీం మధ్య బెట్ మ్యాచ్, శివంగి సాంగ్, క్లైమాక్స్ మ్యాచ్ లో పోచమ్మ ఎపిసోడ్.. ఈ ఎపిసోడ్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి.

  • మహిళల గురించి సెకండాఫ్ లో చెప్పే రెండు ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.

ఆఫ్ స్క్రీన్:

  • గ్రాండ్ అండ్ లావిష్ మేకింగ్ పరంగా ఏజిఎస్ ప్రొడక్షన్ హౌస్ కి గట్టిగా ఓ విజిల్ కొట్టాల్సిందే..

  • విజయ్ ని రాజప్ప పాత్రలో సరికొత్తగా ప్రెజంట్ చేయడంలో, ఓ సోషల్ మెసేజ్ కి కమర్షియల్ అంశాలను జోడించడంలో, విజయ్ మాస్ ఆడియన్స్ ని మెప్పించడంలో దర్శకుడిగా అట్లీ సక్సెస్ అయ్యాడు.

  • జికె విష్ణు విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి.. ఆ విజువల్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన క్రెడిట్ మన ఏఆర్ రెహమాన్ గారికే చెందుతుంది.. ఈ రెండు డిపార్ట్మెంట్స్ చూసే ఆడియన్స్ ని సినిమాకి మరింత చేరువ చేశాయని చెప్పాలి.

  • ముత్తురాజ్ సెట్స్ మరియు అనల్ అరసు యాక్షన్ బ్లాక్స్ కూడా మన చేత విజిల్ వేయిస్తాయి. 

ఓవరాల్ ప్లస్ పాయింట్స్:

  • విజయ్ కిల్లర్ పెర్ఫార్మన్స్

  • ఫాదర్ – సన్ మరియు మహిళల ఎమోషనల్ టచ్

  • ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్

  • మాస్ ని మెప్పించే కొన్ని కమర్షియల్ అంశాలు + యాక్షన్ ఎపిసోడ్స్

  • నేత్రానందాన్ని కలుగజేసే గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

  • సినిమా ప్రారంభం చాలా అంటే చాలా రొటీన్ గా ఉంది. మొదటి 30-40 నిమిషాలు ఆడియన్స్ కి మజా ఇచ్చే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి.

  • విజయ్ – నయనతార లవ్ ట్రాక్ కూడా అంత కనెక్ట్ కాలేదు, చాలా బోరింగ్ కూడాను.

  • వివేక్, యోగిబాబు లాంటి కమెడియన్స్ ఉన్నా కామెడీని సరిగా రాసుకోలేదు, ఉన్న కామెడీ మీకు నవ్వును తెప్పించదు.

  • ఫస్ట్ హాఫ్ లో అసలు కథ పెద్దగా ముందుకు వెళ్ళినట్టు అనిపించదు. సెకండాఫ్ లో కూడా చాలా స్లో మోమెంట్స్ ఉన్నాయి.

ఆఫ్ స్క్రీన్:

  • కథ: పరమ రొటీన్ బోరింగ్ కథ.. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సినిమాలైనా ‘భద్ర’, ‘దమ్ము’, ‘మిర్చి’ లాంటి స్టోరీ లైన్ కి ‘చెక్ దే ఇండియా’ లాంటి స్పోర్ట్స్ కథని మిక్స్ చేసి చెప్పాడు. సినిమా చూసాక ఈ మాత్రం కథకా ఈ రేంజ్ బిల్డప్ అనిపిస్తుంది. అలాగే మహిళల మీద జరుగుతున్నా అన్యాయాలని చూసి అదే స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ తీశాను అని అట్లీ చెప్పాడు కానీ ఇందులో అంత స్ట్రాంగ్ గా ఆ పాయింట్ చెప్పలేదు. కనీసం ‘చెక్ దే ఇండియా’లో లేడీ టీం ని చూపించినంత స్ట్రాంగ్ గా కూడా చూపించలేదు.

  • మరో మేజర్ మైనస్ గా చెప్పాల్సింది స్క్రీన్ ప్లే.. కథనం పరంగా ఆడియన్స్ కి అక్కడక్కడా హై ఫీల్ ని జెనరేట్ చేసే మోమెంట్స్ ఉన్నప్పటికీ, అన్నీ మనం అనుకుంటున్నట్లే, వచ్చే ప్రతి ట్విస్ట్ మనం ఊహించినట్లే కనపడుతుంది. కథ బాలేనప్పుడు కథనం అన్న అబాగుండాలి అలా లేకుండా ఓవరాల్ గా ఆడియన్స్ పూర్తి సంతృప్తి చెందకుండా పరవాలేదులే అనే ఫీలింగ్ కి ఫిక్స్ అవుతారు. విజిల్ విషయంలో అదే జరిగింది.

  • మాస్ ఆడియన్స్ కి చెక్ దే ఇండియా పెద్దగా పరిచయం లేకపోయినా మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ కి బాగా తెలుసు కావున ఈ కథ వారికి అస్సలు ఎక్కదు. హాకీ కాదు ఇందులో ఫుట్ బాల్ అనేది తీసేస్తే మిగతా చాలా వరకూ ‘చెక్ దే ఇండియా’ చూసినట్టేఉంటుంది.

  • క్లైమాక్స్ కూడా అందరూ ఊహించినట్లే ఉండడం వల్ల చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు నీరసంగా ఫీలవుతారు.

  • విజయ్ లాంటి స్టార్ హీరో తో కమర్షియల్ స్టోరీ అన్నప్పుడు విలన్ లేదా విలనిజం చాలా హై రేంజ్ లో ఉండాలి.. కానీ ఇందులో విలనిజం ఉప్పు కారం లేని పప్పులా చప్పగా ఉంటుంది.

  • అలాగే సినిమా నిడివిని ఇంకా తగ్గించి ఉండచ్చు.. చాలా రొటీన్ కథకి, అంతకన్నా రొటీన్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలకి రెండున్నర గంటలే చాలు కానీ 3 గంటలు అనేది చాలా చోట్ల బయటకి వెళ్ళొద్దాం లేదా కాసేపు మొబైల్ లో గేమ్ ఆడుకుందామా అనే ఫీలింగ్ ని కలుగజేస్తుంది. 

ఓవరాల్ నెగటివ్ పాయింట్స్:

  • కథలో కొత్తదనం లేకపోవడం

  • ఆడియన్ కి తెలిసిన కథనాన్నే మళ్ళీ చూపించడం.

  • వీక్ కామెడీ అండ్ లవ్ ట్రాక్

  • బాబోయ్.. అంత సేపా నావల్ల కాదు బాబోయ్.. అనిపించేంత మూవీ లెంగ్త్

  • ఫ్లో ని డిస్టర్బ్ చేసే పాటలు

  • తమిళ్ వారికి విజయ్ క్రేజ్ వర్కౌట్ అవ్వచ్చు కానీ తెలుగులో కష్టం

  • స్ట్రాంగ్ విలనిజం లేకపోవడం

  • మహిళల పాయింట్ ని ఇంకా బెటర్ గా చెప్పాల్సింది.

విశ్లేషణ:

విజయ్ నుంచి దీపావళి కానుకగా వచ్చిన ‘విజిల్’ అనే సినిమా అందరి చేత విజిల్స్ వేయిస్తుందని అనుకున్నారు, కానీ ఇది కేవలం రొటీన్ అయినా పర్లేదు, పక్కా మాస్ అంశాలు ఉంటే చాలు అనుకునే వారి చేత మాత్రమే విజిల్స్ వేయిస్తుంది. మిగతా వారి చేత రాజప్ప పెర్ఫార్మన్స్ కి మరియు ఒక మూడు, నాలుగు సీన్స్ లో విజిల్ వేయించేలా ఉంది. ఓవరాల్ గా ఈ దీపావళి కి లక్ష్మీ బాంబ్ లా పేలుతుందనుకున్న విజిల్, కేవలం చీమ టపాకాయ్ లా మాత్రమే పేలింది. విజయ్ ఫ్యాన్స్ మరియు ఒక తరహా మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చే ఈ విజిల్ సినిమా మిగిలిన ఆడియన్స్ కి పెద్దగా నచ్చదు. సినిమా అంతగా లేకపోయినప్పటికీ దీపావళి సీజన్, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడం వలన ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘విజిల్’ కి కాస్త పైసా వసూల్ అయ్యే అవకాశం ఉంది.

ఫైనల్ పంచ్: విజిల్ – ఈ విజిల్ సౌండ్ అంత స్ట్రాంగ్ గా లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...
నటీనటులు: విజయ్, నయనతార, వివేక్, జాకీ ష్రాఫ్, కథిర్, యోగిబాబు, ఇందుజ తదితరులు. నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: అట్లీ సినిమాటోగ్రఫీ: జికె విష్ణు మ్యూజిక్: ఏఆర్ రెహమాన్ ఎడిటర్‌: రూబెన్ విడుదల తేదీ: అక్టోబర్ 25, 2019 'తుపాకి', 'పోలీసోడు', 'అదిరింది', 'సర్కార్' లాంటి సినిమాలతో తెలుగు మార్కెట్ పెంచుకున్న తమిళ హీరో విజయ్ హీరోగా, 'రాజా రాణి'తో తెలుగువారికి బాగా గుర్తున్న అట్లీ దర్శకత్వంలో రూపొందిన సినిమా...సినిమా రివ్యూ: విజిల్