Switch to English

సినిమా రివ్యూ: ఖైదీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు: కార్తీ, నరైన్, తదితరులు..
నిర్మాత: కెకె రాధామోహన్
దర్శకత్వం: లోకేష్ కానగరాజ్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
మ్యూజిక్: సామ్ సిఎస్
ఎడిటర్‌: ఫిలోమిన్ రాజ్
విడుదల తేదీ: అక్టోబర్ 25
రేటింగ్: 3/5

తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న కార్తీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో డిఫరెంట్ ఫిల్మ్ ‘ఖైదీ’. ఫాదర్ – డాటర్ ఎమోషన్ ని కీలకంగా చేసుకొని కంప్లీట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాకి ‘నగరం’ సినిమాతో మెప్పించిన లోకేష్ కానగరాజ్ దర్శకుడు. దీపావళి కానుకగా నేను విడుదలైన ఈ ‘ఖైదీ’ అలనాటి చిరు ‘ఖైదీ’ రేంజ్ లో మెప్పించిందో లేదో చూద్దాం..

కథ:

పోలీస్ ఆఫీసర్ విజయ్(నరేన్ కుమార్), తన టీంతో కలిసి 900 కిలోల డ్రగ్స్ అనగా 840 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుకుంటారు. ఆ డ్రగ్స్ ని పోలీస్ స్టేషన్ లో భద్ర పరుస్తారు. కానీ డ్రగ్స్ పట్టుకున్నారన్న కారణంతో ఆ పోలీసుల్ని స్టేషన్ లోనే చంపి ఆ డ్రగ్స్ తీసుకెళ్ళాలని మెయిన్ విలన్ ప్లాన్ చేసి, తన పోలీస్ అనుచరుడి చేత వారు తినే ఫుడ్ లో ఒక డ్రగ్ కలిపిస్తాడు. అది తిన్న 5 గంటల్లో అందరూ చనిపోతారు. ఈ విషయం విజయ్ కి తెలిసి ఎవరైనా వారిని హాస్పిటల్ వరకూ తీసుకెళ్తే బాగుండు అని ట్రై చేస్తున్న టైంలో అప్పుడే రిలీజ్ కావడానికి రెడీ గా ఉన్న ‘ఖైదీ’ ఢిల్లీ(కార్తీ) ని విజయ్ సాయం అడుగుతాడు. అలా వారిని తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరతాడు ఢిల్లీ. ఇక అక్కడి నుంచి ఢిల్లీ మీద జరిగిన అటాక్స్ ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు? ఫైనల్ గా వీళ్ళని ఢిల్లీ సేవ్ చేసాడా?లేదా? అలాగే పట్టుకున్న డ్రగ్స్ పోలీస్ స్టేషన్ లో సేఫ్ గా ఉన్నాయా? లేదా? అనేదే కథ.

సీటీమార్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

  • కార్తీ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. తనలా స్టార్డం ఉన్న హీరోలు డిఫరెంట్ సినిమాలు చేయడానికి వెనుకంజ వేస్తుంటే, తాను మాత్రం ఇలాంటి కథనం ఉన్న సినిమాలతో చేయడమే కాదు, ప్రేక్షకులని మెప్పిస్తున్నందుకు తనకి మా హ్యాట్సాప్. తన నటనే ఈ సినిమాని 50% నిలబెట్టింది చెప్పాలి.

  • కార్తీ కూతురుగా చేసిన పాప నటన బాగుండడమే కాకుండా అందరినీ ఎమోషనల్ గా సినిమాకి కనెక్ట్ చేస్తుంది.

  • జార్జ్ మరియన్ ట్రాక్ మరియు నటన అందరినీ ఆకట్టుకుంటుంది.

  • హైలైట్ ఎపిసోడ్స్ పరంగా చెప్పుకుంటే – పోలీసుల్ని తీసుకెళ్లే ఛేజింగ్ సీన్, ట్రైలర్ లో చూపించిన ఫైట్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ గన్ ఫైట్ లు ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్ ఫీల్ ని ఇస్తాయి.

  • ఫాదర్ అండ్ డాటర్ మధ్య మొదటి నుంచి చూపించే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.

ఆఫ్ స్క్రీన్:

  • స్క్రీన్ ప్లే: మూడు డిఫరెంట్ సబ్ ప్లాట్స్ తో, సూపర్బ్ సీన్స్ తో చాలా ఆసక్తి కలిగించేలా రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాని ఆడియన్స్ కనెక్ట్ చేయడంలో మేజర్ మార్క్స్ కొట్టేసింది.

  • డైరెక్టర్ అనుకున్న దృశ్యాలకి సత్యన్ సూర్యన్ విజువల్స్ ప్రాణం పోయడమే కాదు సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.

  • సామ్ సిఎస్ మ్యూజిక్ ఆడియన్స్ ని ప్రతి సీన్, ప్రతి షాట్ కి కనెక్ట్ అయ్యేలాచేసింది . సినిమాటోగ్రఫీ – మ్యూజిక్ టాప్ నాచ్ లెవల్ లో ఉండడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొట్టదు.

  • ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ కూడా సూపర్ స్పీడ్ గా ఉంది.

  • యాక్షన్ ఎపిసోడ్స్ అందరికీ హై ఫీల్ ని ఇస్తాయి.

  • ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ది బెస్ట్ అనేలా ఉన్నాయి. 

ఓవరాల్ ప్లస్ పాయింట్స్:

  • కార్తీ అదిరిపోయే పెర్ఫార్మన్స్

  • ఫాదర్ – డాటర్ ఎమోషన్

  • ఫెంటాస్టిక్ అనిపించే నైట్ఎఫెక్ట్ విజువల్స్

  • ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ గన్ ఫైట్

  • ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వల్ ఛేజ్

  • మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

  • హరీష్ పేరడి చేసిన విలన్ పాత్ర చాలా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే హీరో – విలన్ వార్ ఇంకా రసవత్తరంగా ఉండేది.

  • పాత్ర పరంగా కార్తీని ఇంకాస్త మాస్ ఎలివేషన్స్ తో చూపించచ్చు, అలాగే నరేన్ కుమార్ పాత్రని కూడా పూర్తిగా వాడుకోలేదు.

  • రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే పాటలు, కామెడీ బిట్స్ లేకపోవడం.

ఆఫ్ స్క్రీన్:

  • ఓవరాల్ గా చూసుకుంటే చాలా సింపుల్ గా అనిపించే కథ..

  • ఓపెన్ ప్లే లో కాకుండా అక్కడక్కడా కొన్ని థ్రిల్స్ ఉండేలా ప్లాన్ చేసుకుని ఉంటె ఇంకా బాగుండేది.

 ఓవరాల్ నెగటివ్ పాయింట్స్:

  • స్ట్రాంగ్ విలన్ లేకపోవడం

  • సింపుల్ గా అనిపించే కథ

విశ్లేషణ:

కార్తీ ‘ఖైదీ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పిన మాట – ‘చిరంజీవి గారి ‘ఖైదీ’ సినిమా టైటిల్ ని తక్కువ చేయకుండా చేసేలా మా ‘ఖైదీ’ ఉంటుంది’ అన్నారు. సినిమా చూసాక ఆ మాట చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఆ ఖైదీ’కి ఏ మాత్రం తక్కువ కాకూండా ‘ఖైదీ’ సినిమా ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా చిన్నదే కావచ్చు, కానీ స్క్రీన్ ప్లే పరంగా ఆయన రాసుకున్న ఫాదర్ – డాటర్ ఎమోషన్, పోలీస్ స్టేషన్ ట్రాక్ మరియు కార్తీ ట్రాక్ అన్నీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని కొన్ని బ్లాక్స్ ఎమోషన్ పరంగా, టెక్నికల్ పరంగా ఆడియన్స్ ని హై లెవల్ కి తీసుకెళ్తాయి. ముఖ్యంగా టెక్నికల్ గా టాప్ నాచ్ లెవల్ మూవీ అని చెప్పాలి. ఓవరాల్ గా ఏ సెంటర్ ప్రేక్షకుడైనా టికెట్ తీసుకొని థియేటర్ లోకి వెళితే పూర్తయ్యే టైంకి పూర్తి సంతృప్తితో, తీసుకున్న టికెట్ కి, నా సమయానికి హీరో కార్తీ న్యాయం చేసాడు అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు. ఈ దీపావళికి హ్యాపీగా చూడదగిన సినిమా ‘ఖైదీ’.

ఫైనల్ పంచ్: ఖైదీ – కథనంతో ప్రేక్షకులని కట్టిపడేసే హిట్టు బొమ్మ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...
నటీనటులు: కార్తీ, నరైన్, తదితరులు.. నిర్మాత: కెకె రాధామోహన్ దర్శకత్వం: లోకేష్ కానగరాజ్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ మ్యూజిక్: సామ్ సిఎస్ ఎడిటర్‌: ఫిలోమిన్ రాజ్ విడుదల తేదీ: అక్టోబర్ 25 రేటింగ్: 3/5 తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న కార్తీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో డిఫరెంట్ ఫిల్మ్ 'ఖైదీ'. ఫాదర్ - డాటర్ ఎమోషన్ ని కీలకంగా చేసుకొని కంప్లీట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్...సినిమా రివ్యూ: ఖైదీ