టాలీవుడ్ లో ఇటీవల వరుసగా పెళ్లిలు జరుగుతున్నాయి. నిఖిల్.. రానా.. నితిన్.. నిహారిక.. సుజీత్ ఇంకా పలువురు పెళ్లి పీఠలు ఎక్కారు. త్వరలో మరి కొందరు స్టార్స్ కూడా పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే నందమూరి వారి ఇంట కూడా పెళ్లి జరిగింది. నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి జరిగింది. సినిమాల్లో నటించాలని ఈయన ప్రయత్నించాడు కాని సఫలం కాలేదు. దాంతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. వ్యాపారాలు చూసుకుంటున్న చైతన్య కృష్ణ ఈరోజు రేఖ రాణితో ఒక్కటయ్యాడు.
ఈ నందమూరి వారి వివాహ మహోత్సవంలో కుటుంబ సభ్యులు అంతా హాజరు అవ్వడంతో పాటు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. కరోనా కారణంగా ముఖ్యులకు మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. నందమూరి చైతన్య కృష్ణ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి ఎన్టీఆర్ కుటుంబం హాజరు అయ్యిందా అనేది క్లారిటీ లేదు.
145496 103734Produced to measure curtains […]check out the sites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 312717