నాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు మనం హీరోగా, మన పక్కింటి అబ్బాయి పాత్రల్లో చూసాం .. కానీ మొదటి సారి అయన భిన్నమైన పాత్రలో నటిస్తున్న చిత్రం వి. నానితో పాటు సుధీర్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న సుధీర్ బాబు పోస్టర్ ని రక్షకుడు అంటూ విడుదల చేసిన టీమ్ నేడు నాని పోస్టర్ ని రాక్షసుడు అంటూ విడుదల చేసింది. పోస్టర్ లో నాని గెటప్ చాలా కొత్తగా ఉంది.. అంతే కాదు చేతిలో కత్తెర .. బ్లడ్ ఇవన్నీ చూస్తుంటే నాని నిజంగా రాక్షసుడిగా కనిపిస్తున్నాడు.
ఈ రెండు పోస్టర్స్ తో సినిమా పై అంచనాలు మాత్రం బాగా పెరిగిపోయాయి. యాక్షన్, థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్హ్ 25న విడుదల చేస్తారట. నివేద థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శివలెంక ప్రసాద్ నిర్మిస్తుండగా .. దిల్ రాజు విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఉగాది కానుకంగా ఓ ఆసక్తికర సినిమా రాబోతుందని అర్థం అవుతొంది.
ఈ మధ్య వరుసగా మళ్ళీ పరాజయాలు ఎదురు కావడంతో నాని హిట్ కోసం చేస్తున్న కొత్త ప్రయోగమే ఇది. కృషార్జున యుద్ధం, గ్యాంగ్ లీడర్ ఇలా వరుస పరాజయాల తరువాత చేస్తున్న వి పై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి నాని నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూద్దాం !!
400523 893101Hi. Thank you for producing this internet site . I m working on betting online niche and have found this website using search on bing . Will probably be positive to look far more of your content material . Gracias , see ya. :S 763977
707403 455251I visited a lot of website but I believe this one contains something extra in it in it 621028
700517 674823Excellent information numerous thanks sharing and reaching us your subscriber list. 374466