Switch to English

అమెరికాపై కరోనా పంజా: అతి భయానకం.!

ప్రపంచంలోనే ఒకే రోజు అత్యధికంగా ‘కరోనా మరణాలు’ సంభవించింది అమెరికాలోనే. మొత్తం 1480 మంది నిన్న అమెరికాలో కరోనా మహమ్మారికి బలైపోయారు. అక్కడ కరోనా మరణాల సంఖ్య మొత్తంగా 10 వేలకు చేరుకుంటోంది. దాదాపు 3 లక్షల మంది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకూ అమెరికాలో. అగ్ర రాజ్యం అమెరికా, కరోనా దెబ్బకు ఎంతగా విలవిల్లాడుతుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు.

‘అమెరికాని కరోనా ఏమీ చేయలేదు.. అమెరికాని చూసి కరోనా పారిపోవాల్సిందే.. అసలు అమెరికాకి కరోనా వచ్చే ప్రసక్తే లేదు..’ అని ఈ మధ్యనే డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితమే జరిగింది ఈ హడావిడి. కానీ, కేవలం రోజుల వ్యవధిలోనే అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన దేశం ప్రస్తుతం అమెరికానే. 2 లక్షల మందికి పైగా అమెరికాలో కరోనా కారణంగా చనిపోతారన్నది ఓ అంచనా. పరిస్థితి తీవ్రత ఇప్పుడిప్పుడే అమెరికాకి అర్థమవుతోంది. కానీ, మేకపోతు గాంభీర్యం మాత్రం అమెరికా కొనసాగిస్తోంది.

ఇదిలా వుంటే, అమెరికాలోని భారతీయులు కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్నారు. విద్యనభ్యసించేందుకు వెళ్ళి కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయినవారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఎవరూ ఇళ్ళల్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో కరోనా తీవ్రత చూస్తోంటే, ఇంకో ఆరు నెలలైనా పరిస్థితి అదుపులోకి వస్తుందా.? రాదా.? అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.

‘ప్రపంచానికే పోలీస్‌..’ అనే అహంకారం అమెరికాలో అణువణువునా కన్పిస్తుంది. ‘పెద్దన్న’ అనే ట్యాగ్‌ వేసుకుని, ప్రపంచంపై పెత్తనం చేయడం అమెరికాకి కొత్తేమీ కాదు. కానీ, కరోనా వైరస్‌ ముందు అమెరికా ఓడిపోయినట్లే కన్పిస్తోంది. అదీ, చైనా నుంచి పుట్టుకొచ్చిన వైరస్‌, అమెరికాని అతలాకుతలం చేయడమంటే.. ఇదేదో ‘బయోవార్‌’ అనే అనుమానం కలగకమానదు.

అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఈ చైనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. ఆ మాటకొస్తే, మానవాళికే ముప్పులా పరిణమించింది ఈ చైనా వైరస్‌ కోవిడ్‌ 19.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...