మెరుగైన సమాజం కోసం అంటూ జర్నలిజంలో సరికొత్త ఒరవడి సృష్టించి వాడవాడలోకి దూసుకుపోయిన టీవీ9కి కొత్త కష్టమొచ్చింది. 16 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉంటూ తిరుగులేని ఛానల్ గా ఉన్న టీవీ9 ప్రస్తుతం రెండో స్థానంలోకి పడిపోయింది. ఇటీవల లాక్ డౌన్ సమయంలో టీఆర్పీ రేటింగ్స్ లో తామే టాప్ లో ఉన్నామని.. రెండో స్థానంలో ఉన్న ఛానల్ కనీసం తమ దరిదాపుల్లో కూడా లేదని గొప్పగా చెప్పుకుంది.
కానీ తాజాగా టీవీ9 రెండో స్థానంలోకి పడిపోవడం వారికే మింగుడుపడడంలేదు. మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న ఎన్టీవీ.. టీవీ9ని దాటి మొదటి స్థానంలోకి వచ్చింది. దీంతో టీవీ9లో దీనిపై అంతర్మథనం సాగుతోందని సమాచారం. నిజానికి టీవీ9 యాజమాన్యం మారడం.. ఆ ఛానల్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన రవిప్రకాష్ పై కేసులు నమోదు కావడం.. ఆయన్ను ఛానల్ నుంచి బయటకు పంపడం వంటి పలు పరిణామాలు ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయి.
అయినప్పటికీ మొదటినుంచీ టీవీ9కి అలవాటుపడిన జనం అలాగే ఆ ఛానల్ ని ఆదరించారు. గతంలో ప్రతి విషయంలోనూ ఎంతో దూకుడుగా వ్యవహరించే ఆ ఛానల్ లో ఇటీవల ఆ సత్తా తగ్గిందని.. యాజమాన్యం మారిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే ఇందుకు కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా పత్రిక అయినా వార్తా ఛానల్ అయినా ప్రజల తరఫున వకాల్తా తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ ప్రస్తుతం టీవీ9లో అలాంటిది లేదని అంటున్నారు. ఛానల్ యాజమాన్యానికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా వారిపై వ్యతిరేక కథనాలు లేదా తప్పుల్ని ఎత్తిచూపే ప్రయత్నాలు జరగడంలేదంటున్నారు. పైగా వార్తా కవరేజ్ లో సైతం వివిక్ష చూపిస్తోందనే విమర్శలున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లు చేసే ప్రకటనలు కనీసం స్క్రోలింగ్ లో కూడా ఇవ్వడంలేదని.. అదే సమయంలో టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ చోటానేతల మాత్రం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయా పార్టీల ప్రధాన ఆరోపణ. ఇది కూడా ఆ చానల్ టీఆర్పీ రేటింగ్ తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.
మరోవైపు టీవీ9 రేటింగులు ఎప్పుడో పడిపోయాయని.. కానీ టీఆర్పీలను తారుమారు చేసి తానే నెంబర్ వన్ అని ప్రచారం చేసుకుంటోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీఆర్పీల రేటింగ్ వ్యవహారాలు చూసే బార్క్ వద్ద దీనికి సంబంధించిన ఓ పంచాయతీ కూడా నడుస్తోంది. గత ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ పై టీవీ9 ఏకపక్షంగా రాజకీయ దాడి చేసింది. దీంతో లక్షలాది మంది పవన్ అభిమానులు టీవీ9 యాప్ ని తమ మొబైల్ నుంచి తొలగించడంతోపాటు ఆ ఛానల్ రేటింగ్ తగ్గిపోయేలా తీవ్రంగా కృషి చేశారు. అయినప్పటికీ టీవీ9 టాప్ లో ఉండటంపై అప్పట్లోనే అనుమానాలు వచ్చాయి.
ప్రస్తుతం ఆ చానల్ రేటింగ్ రెండో స్థానానికి పడిపోవడంతో అప్పుడు రేటింగులను తారుమారు చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో టీవీ9 కంటే వీ6 ఛానల్ దే పైచేయి. దీంతో ఆ ఛానల్ ను అధిగమించడానికి తీసుకొచ్చిన కార్యక్రమాల ఫలితంగా అటు ఏపీలో కూడా ఆదరణ కోల్పోతోందని విశ్లేషిస్తున్నారు.
376733 570449Water-resistant our wales in advance of when numerous planking. The particular wales surely are a selection of heavy duty snowboards that this height ones would be exactly the same in principle as a new shell planking having said that with a lot more height to assist you thrust outward in the evening planking. planking 746038
823496 112042This will probably be a terrific internet site, may well you be interested in doing an interview about how you developed it? If so e-mail me! 765304
428218 17930I found your weblog web site on google and check a couple of of your early posts. Continue to sustain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Looking for forward to studying extra from you in a even though! 417754