ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకున్నా ఇటీవలి ఎన్నికల్లో సంచలన విజయాన్ని అందుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పీఠమెక్కింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రెండున్నర నెలల్లో వైఎస్ జగన్ ఏం సాధించారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన ఏ వేదిక మీద మాట్లాడినా ‘అవినీతి’ గురించి ప్రస్తావిస్తున్నారు. అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి వుందంటున్నారు.
తాజాగా అమెరికా పర్యటనలోనూ వైఎస్ జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల విమర్శల సంగతి సరే సరి. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటిన్నది చాలామంది అభిప్రాయం. వారి అభిప్రాయాల్లోనూ వాస్తవం లేకపోలేదు.
అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎంతో కాలం కాలేదు గనుక, వైఎస్ జగన్ విషయంలో ఇప్పుడే ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు అనవసరం అనే భావన మరికొందరి నుంచి వ్యక్తమవుతోంది. ఓ ఆరు నెలల తర్వాత వైఎస్ జగన్ పనితీరుపై మాట్లాడితే మంచిదన్నది వారి అభిప్రాయం.
ఇదిలా వుంటే, రాష్ట్రంలో ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి, సొంత పార్టీ నేతలు ఇసుకతో కోట్లు దండుకునేలా వైఎస్ జగన్ చేస్తున్నారన్న విమర్శ ఒకటి గట్టిగా విన్పిస్తోంది. మరోపక్క, గ్రామ వాలంటీర్ల పోస్టుల్ని అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా అమ్మేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో ఇంతవరకు వైఎస్ జగన్, తమ పార్టీ నేతల్ని మందలించిన దాఖలాల్లేవు.
సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే ‘ఇసుక కుంభకోణం’పై పరస్పర ఆరోపణలు చేసకుంటున్నా, వారి విషయమై వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పింది లేదు. ప్రజా వేదికను కూల్చేయడంలో వున్న శ్రద్ధ, అధికార పార్టీ నేతలకు చెందిన ఆస్తులపై దాడులు చేయించడంలో చూపుతున్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధి విషయమై జగన్ చూపడంలేదన్న విమర్శలున్నాయి.
అటు పోలవరం, ఇటు అమరావతి.. రెండూ అటకెక్కేశాయ్. ఇదిలా వుంటే, స్థానికత అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయం, పెట్టుబడిదారుల్లో అసహనం పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్, విదేశాలకు వెళ్ళి అవినీతి రహిత పాలన అందిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో రండి.. అని చెప్పడం ఎంతవరకు సబబు.?
120144 809142bless you with regard to the certain weblog post ive genuinely been looking regarding this kind of details on the internet for sum time appropriate now as a result cheers 408252
707911 695349This internet internet site is my breathing in, quite great pattern and perfect content . 324835