మాస్ మహారాజా రవితేజ పూర్తి డార్క్ రోల్ లో నటించిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో పేరొందిన బందిపోటు టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి ప్రమోలతో ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
ఇది 1980లలో జరిగే కథ. ముందుగానే చెప్పుకున్నట్లు స్టువర్టుపురం అనే ఊర్లో టైగర్ నాగేశ్వర రావు జీవితం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. బందిపోట్లతో ఆ ప్రాంతంలో పేరు సంపాదించుకున్న నాగేశ్వర రావును పోలీసులు తీసుకెళ్లి టార్చర్ చూపించడం, ఆ తర్వాత బయటకు వచ్చాక టైగర్ నాగేశ్వర రావుగా ఎలా మారాడు? తనకే సొంతమైన దొంగతనాలతో దేశవ్యాప్తంగా పేరు ఎలా సంపాదించుకున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
యాక్షన్ సీక్వెన్స్ లలో ఎనర్జిటిక్ గా, ఎమోషనల్ సీన్స్ లో సటిల్ గానూ చేసాడు రవితేజ. పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రకు తన వంద శాతం ఇచ్చాడు రవితేజ. గత కొన్ని చిత్రాలతో రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్లిన రవితేజకు, తన ఫ్యాన్స్ కు ఇది కొత్తగా అనిపిస్తుంది.
నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ లు తమకు ఇచ్చిన లిమిటెడ్ బట్ ప్రధాన పాత్రల్లో రాణించారు. నాజర్, జిషు సేన్ గుప్తా తమ పాత్రల్లో రాణించారు. రవితేజ గ్యాంగ్ లో కనిపించే వారు కూడా ఇంప్రెస్ చేస్తారు.
రేణు దేశాయ్ కు స్పెషల్ రోల్ లాంటి పాత్రలో మెప్పించింది. అనుపమ్ ఖేర్ పాత్ర కూడా ఓకే. మిగతా వాళ్ళు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
సాంకేతిక నిపుణులు:
మధి అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. లావిష్ ఫ్రేమింగ్ స్క్రీన్ లో ప్రతీ చోటా కనిపిస్తుంది. రామ్-లక్ష్మణ్ అందించిన ఫైట్స్ కూడా సూపర్బ్. జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా బాగుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఇంప్రెసివ్ అనే చెప్పాలి.
దర్శకుడు వంశీ తనకిచ్చిన వనరులతో మంచి ఔట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. తన కెరీర్ లోనే హై బడ్జెట్ చిత్రాన్ని డీసెంట్ గానే హ్యాండిల్ చేసాడు. ముఖ్యంగా రైటింగ్ డిపార్ట్మెంట్ ఇంప్రెసివ్ వర్క్ అందించింది. అక్కడే ఈ చిత్రం సగం విజయం సాధించింది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అనవసరం అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో మొదట్లోనే భారీ హై కి వెళ్ళిపోతుంది చిత్రం. అయితే ఆ తర్వాత ఫ్లాట్ అయ్యి మళ్ళీ క్లైమాక్స్ వద్ద కానీ రికవర్ అవ్వదు.
ప్లస్ పాయింట్స్:
- రవితేజ పాత్ర, యాక్టింగ్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- రన్ టైం
- ఫస్ట్ హాఫ్ లో స్లో నరేషన్
విశ్లేషణ:
స్టువర్టుపురంలోని పేరొందిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా చోట్ల మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బెటర్ గా అనిపిస్తుంది. చిత్రంలో అక్కడక్కడా ఉన్న లోపాలను పక్కనపెడితే టైగర్ నాగేశ్వర రావు ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఈ ఫెస్టివల్ కు టైగర్ నాగేశ్వర రావును విన్నర్ అనుకోవచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5