Switch to English

Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి మూవీ రివ్యూ – బోరింగ్

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow
Movie భగవంత్ కేసరి
Star Cast నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్
Director అనిల్ రావిపూడి
Producer సాహు గారపాటి, హరీష్ పెద్ది
Music తమన్ ఎస్
Run Time 2గం 44 నిమిషాలు
Release 19 అక్టోబర్ 2023

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోలతో ఆసక్తికరంగా అనిపించిన భగవంత్ కేసరి మరి సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంది?

కథ:

భగవంత్ కేసరి (బాలకృష్ణ) ఆదిలాబాద్ లో నివసించే ఆదర్శభావాలున్న వ్యక్తి. విజ్జి (శ్రీ లీల)కు కేర్ టేకర్ గా ఉంటాడు భగవంత్. మరోవైపు సంగ్వి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడి కొడుకు. దేశంలోనే నెం. 1 కావాలనేది సంగ్వి లక్ష్యం. అలాంటి సంగ్వి, డిప్యూటీ సీఎం మధ్య జరిగే ఒక ఇన్సిడెంట్ లో విజ్జి కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది.

మరి విజ్జిని కేసరి రక్షించుకోగలిగాడా? కేసరి గతం ఏంటి? విజ్జిని కేసరి ఎలా తీర్చిదిద్దాడు వంటివి ఈ చిత్రం చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

భగవంత్ కేసరిలో బాలకృష్ణ తన వయసున్న పాత్రనే చేసాడు. ఈమధ్య కాలంలో సీనియర్ హీరోలు కూడా హీరోయిన్ల వెనక పడటం వంటివి చిరాకు తెప్పిస్తున్న నేపథ్యంలో ఇది ఒక మంచి మార్పు. బాలకృష్ణ లుక్స్ ను కూడా నీట్ గా డిజైన్ చేసారు. తను సంరక్షకుడిగా ఉన్న అమ్మాయి జీవితంలో పైకి రావాలి అని తపనపడే ఒక పాత్ర అది. బాలకృష్ణ ఎప్పటిలానే పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

ఇక శ్రీలీల రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాకుండా తన కెరీర్ లో డిఫెరెంట్ గా నిలిచిపోయే పాత్ర చేసింది. తన పెర్ఫార్మన్స్ బాగానే ఉంది. ఇక తన డ్యాన్స్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. కాజల్ కు చిన్న పాత్రే దక్కింది. ఆమె పర్వాలేదు.

అర్జున్ రాంపాల్ రెగ్యులర్ విలనీ చేసాడు. తన పాత్రలో కొత్తదనం లేదు. ఒక ముఖ్యమైన సీరియస్ పాత్రకు కామెడీ ఇమేజ్ ఉన్న మురళీధర్ గౌడ్ ను తీసుకోవడం వల్ల పాత్ర అనుకున్నట్లుగా ప్రోజెక్ట్ అవ్వలేదు.

సాంకేతిక నిపుణులు:

ఒక అత్యంత పల్చనైన స్క్రిప్ట్ ను తీసుకుని దానికి మాస్ ఎలిమెంట్స్, మహిళా సాధికారితను జత చేసాడు. అయితే ఇటు బాలకృష్ణ అభిమానులను, అటు సాధారణ ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఒక తీరుగా ఉండదు. అనవసరమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే స్కూల్ లెక్చర్ సీన్ దీనికి ఉదాహరణ. ఒక మాస్ స్టార్ ను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు రావిపూడి.

థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలకు తగినట్లు సాగలేదు. ఒక్కోసారి చాలా లౌడ్ గా అనిపిస్తుంది. ఇక పాటలు కూడా వీక్ గా అనిపిస్తాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా యావరేజ్ అనే చెప్పాలి. చాలా సీన్లు అనవసరం అనిపిస్తాయి. హరీష్, రామ్ ప్రసాద్ విజువల్స్ పర్వాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ చీప్ గా అనిపిస్తాయి. షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్
  • మహిళా సాధికారిత కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్:

  • ఒక తీరుగా సాగని స్క్రీన్ ప్లే
  • ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
  • ఫైట్స్
  • సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • రన్ టైమ్

విశ్లేషణ:

మొత్తంగా చూసుకుంటే భగవంత్ కేసరి ఒక రొటీన్ మాస్ మూవీ. అటు బాలకృష్ణ అభిమానులను మెప్పించలేక, అటు రెగ్యులర్ ఆడియన్స్ కు నచ్చక మధ్యలోనే ఆగిపోయింది. అటు కథ బలంగా లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా పూర్తిగా మెప్పించలేదు. బాలకృష్ణ వరకూ ఇంప్రెస్ చేసినా కానీ బలమైన స్టోరీ లేకపోవడం, రొటీన్ ట్రీట్మెంట్, కామెడీ లేకపోవడం, బోరింగ్ సీన్స్, ఫైట్స్, సాంగ్స్… ఇలా మైనస్ లతో భగవంత్ కేసరి ఒక బిలో యావరేజ్ మూవీగా మిగిలిపోతుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్ మెటీరియల్ అయినా సరే అమ్మడికి ఎందుకో...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...