అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ రావట్లేదు. జులై 8న చిత్రాన్ని విడుదల చేయనున్నారన్న అప్డేట్ మినహా పెద్దగా సమాచారం లేకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.
దీంతో థాంక్యూ బృందం ఇప్పుడు టీజర్ అప్డేట్ తో మన ముందుకు వచ్చారు. మే 25న ఈ సినిమా టీజర్ విడుదలవుతోందని తెలిపారు. ఈ అనౌన్స్మెంట్ కొంత క్రియేటివ్ గా ఇచ్చారని చెప్పాలి.
నాగ చైతన్య డబ్బింగ్ చెబుతుండగా ఒక వ్యక్తి దాన్ని రికార్డ్ చేస్తుంటే చైతన్య ఆశ్చర్యపోయి ఏంటి విక్రమ్, ఎందుకు రికార్డింగ్ అంటే, దానికి దర్శకుడు టీజర్ అప్డేట్ అంటాడు.
చైతన్య మళ్ళీ ఆశ్చర్యంగా నిజమేనా? నేను అనౌన్స్ చేసేయొచ్చా అంటాడు. రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.