Switch to English

వైసీపీ సర్వే వర్సెస్ టీడీపీ సర్వే: ఇంతకీ జనసేన అసలు బలమెంత.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వేలో, ఆ పార్టీకి 2019 ఎన్నికల తరహాలోనే బంపర్ విక్టరీ ఇంకోసారి వచ్చి పడుతుందని తేలిందట. టీడీపీ అనుకూల సర్వే ఒకటి తాజాగా బయటపడితే, అందులోనూ వైసీపీకే మెజార్టీ కనిపిస్తోంది. కానీ, టీడీపీ బలం బాగా పెరిగిందట. జనసేనతో కలుపుకుంటే, టీడీపీ బలం ఇంకా బాగా పెరిగిపోతుందట. ఇదీ రెండు సర్వేలు చెబుతున్న లెక్కల జిమ్మిక్కు.!

ఏ సర్వే ఎక్కడ ఎప్పుడు జరిగింది.? ఎన్ని శాంపిళ్ళను తీసుకున్నారు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అయితే, అసలు సర్వేల ఫలితాల వేరు, ప్రచారం చేసుకుంటున్నవి వేరనే విషయం కాస్త తీరిగ్గా బయటపడింది. ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే వుంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత సరదా మేరకు చేసే సర్వేల దగ్గర్నుంచి, రాజకీయ పార్టీలు లక్షలు, కోట్లు వెచ్చించి చేసే సర్వేలదాకా.. ఇదొక నిరంతర ప్రక్రియ.

కొన్నాళ్ళ క్రితం అధికార పార్టీ చేయించుకున్న సర్వేలో 60 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని తేలిందనే విషయం బయటకు పొక్కింది. అందుకు అనుగుణంగానే, పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చేశారు. ఇదీ వాస్తవ పరిస్థితి.

ఇక, టీడీపీ విషయానికొస్తే.. గడచిన మూడేళ్ళలో ఆ పార్టీ దారుణంగా దెబ్బ తిన్న మాట వాస్తవం. కాకపోతే, ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. సో, మరీ ఆ పార్టీని తీసికట్టులా చూడలేం. జనసేన పరిస్థితేంటి.? వైసీపీ అలాగే టీడీపీ దాస్తున్న సర్వేల్లో వెల్లడయ్యిందంటేంటే, జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకుందని.

స్థానిక ఎన్నికల్లోనే జనసేనకు పెరిగిన బలమేంటో అందరికీ బాగా తెలిసొచ్చింది. అందుకే, ఆ తర్వాతి నుంచీ జనసేనను అటు వైసీపీ, ఇటు టీడీపీ టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. 17 శాతం వరకు జనసేనకు ఓటు బ్యాంకు ప్రస్తుతం వుందన్నది వైసీపీ, టీడీపీ సర్వేల్లో వెల్లడయినప్పటికీ, ఆ విషయాన్ని ఆ రెండు పార్టీలూ దాచేస్తున్నాయ్.

ఈ 17 శాతం బలం విషయమై జనసేన ఏమనుకుంటోంది.? అంటే, జనసేన లెక్కలు వేరే వున్నాయ్. 25 శాతం పైబడి ఓటు బ్యాంకు తమకు స్థానిక ఎన్నికల్లోనే లభించిందన్నది ఆ పార్టీ వాదన. జనసేన ఎంతలా బలం పుంజుకోకపోతే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత చంద్రబాబుని పక్కన పెట్టి, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద రాజకీయ యుద్ధం ప్రకటిస్తారు.?

సో, ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరిగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ జనసేన.. హోరా హోరీగా పోటీ జరగబోతోందన్నమాట. మరి, టీడీపీ సంగతేంటి.? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

‘నా చేతిపై ఉన్న టాటూను ఫ్యాన్స్ వేయించుకోవద్దు..’ కారణం చెప్పిన నాగచైతన్య

తన చేతిపై ఉన్న టాటూను అభిమానులు ఎవరూ వేయించుకోవద్దని టాలీవుడ్ హీరో నాగ చైతన్య కోరారు. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు....

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: కౌబాయ్ పాత్రలో చిరంజీవి స్టయిలిష్ మూవీ ‘కొదమసింహం’

కెరీర్లో రెగ్యులర్ మాస్, కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేశారు చిరంజీవి. దర్శకుడు బాపు మాటల్లో.. ‘చిరంజీవి మాస్ సినిమాలకు ఎడిక్ట్ అయిపోయాడు. అది ఆయన తప్పు కాదు. చిరంజీవి సాధించిన ఇమేజ్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన చిరంజీవి ‘రౌడీ అల్లుడు’

మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ అయిన చిరంజీవి.. అందుకు పడ్డ శ్రమ, కష్టం, నటనపై ఉన్న మక్కువ, సినిమాపై ఆసక్తి ప్రధాన కారణం. తెరపై చిరంజీవి మాస్ పవర్ చూసేందుకు...

బ్రహ్మాస్త్ర నుండి దేవ దేవ…

రణ్బీర్‌ కపూర్‌ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అమితాబచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా నుండి ఇటీవల వచ్చిన కుంకుమల పాట సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే....

బిగ్ బాస్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. సీజన్...