న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రోమోలకు, సాంగ్స్ కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చిత్రంలో నాని క్యారెక్టర్ ప్రధానమైన హైలైట్ గా నిలుస్తుందని అర్ధమవుతోంది.
ఈరోజు అంటే సుందరానికి మూడో సాంగ్ రంగో రంగ విడుదలైంది. చిత్రానికి తగ్గట్లుగానే ఈ సాంగ్ కూడా ఎంటర్టైనింగ్ వే లోనే సాగింది. కారుణ్య ఈ సాంగ్ ను ఆలపించగా సానపాటి భరద్వాజ్ పాత్రుడు ఫన్నీ లిరిక్స్ క్యాచిగా ఉన్నాయి. ఇక వివేక్ సాగర్ మరోసారి డీసెంట్ ట్యూన్ తో ఆకట్టుకున్నాడు.
వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగానే నజ్రీయ హీరోయిన్ గా చేసింది. అంటే సుందరానికి చిత్రంపై డీసెంట్ బజ్ ఉంది.