Switch to English

జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు:  సందీప్ మాధవ్, సత్య దేవ్, ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ తదితరులు
నిర్మాత: అప్పిరెడ్డి
దర్శకత్వం: జీవన్ రెడ్డి.
సినిమాటోగ్రఫీ: సుధాకర్ యెక్కంటి
మ్యూజిక్:  సురేష్ బొబ్బిలి
ఎడిటర్‌: ప్రతాప్ కుమార్
విడుదల తేదీ: నవంబర్ 22, 2019
రేటింగ్: 3/5

టాలీవుడ్ టాప్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రీసెంట్ సెన్సేషన్ విశ్వక్ సేన్ వరకూ అందరూ ప్రేక్షకులంతా తప్పక చూడాలి అని చెప్పిన సినిమా ‘జార్జ్ రెడ్డి’ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ గా అప్పటి రాజకీయ వ్యవస్థకే  వణుకు పుట్టించిన ‘‘జార్జ్ రెడ్డి’’ని తన 25 ఏళ్ళ వయసులో మర్డర్ చేశారు. ఈ రియల్ లైఫ్ స్టోరీతో, భారీ అంచనాల నడుమ నవంబర్ 22న రిలీజ్ అయినా ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏ రేంజ్ లో సంతృప్తి పరిచిందో చూద్దాం.

కథ: 

‘‘జార్జ్ రెడ్డి’’ – 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో స్టూడెంట్ గా మొదలై, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ బయోపిక్ ఇది.

చిన్ననాటి నుంచి తెలివితేటలు, ధైర్యం మరియు తెగింపు లక్షణాలతో పెరిగిన జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్ ) తన పోస్ట్ గ్రాడ్యువేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. అప్పటికే అక్కడ పేద – ధనిక, తక్కువ కులం – ఎక్కువ కులం అనే పేరుతో అరాచకాలు జరుగుతుంటాయి. ఆ అరాచకల్ని సహించని జార్జ్ రెడ్డి, మొదటి నుంచే అందరినీ ఎదిరిస్తూ స్టూడెంట్స్ అందరినీ తనవైపు తిప్పుకుంటూ ఉంటాడు. అప్పటికే స్టూడెంట్ లీడర్స్ గా ఉన్న సత్య(సత్యదేవ్) – కౌశిక్(చైతన్య కృష్ణ) లు అతనిని ఎదుర్కోవడానికి పలు ప్రయత్నాలు చేస్తారు. ఆ ఎదురు దెబ్బలను జార్జ్ రెడ్డి ఎలా ఎదుర్కొన్నాడు? స్టూడెంట్స్ లో  ఎలాంటి పోరాట పటిమని నింపాడు? తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం వెళ్ళాడు? ఎవరి వల్ల తను చనిపోవాల్సి వచ్చింది? అనే అంశాలను చూపించిన కథే ఈ ‘జార్జ్ రెడ్డి’.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

జార్జ్ రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్ నటించాడు అనడం కంటే జీవించాడు అంటేనే పర్ఫెక్ట్. ఎందుకంటే తన మాట, చేత, యాటిట్యూడ్, మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ జార్జ్ రెడ్డి ఇలానే చేసాడేమో అనేంత పర్ఫెక్ట్ గా చేసాడు. అలాగే తనలోని నటుణ్ని పూర్తిగా ఆవిష్కరించుకునే ఛాన్స్ ఈ సినిమాతో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆన్ స్క్రీన్ నటుల పరంగా అయితే సందీప్ మాధవ్ బిగ్గెస్ట్ హైలైట్. సత్యదేవ్ చేసిన దానిలో మేజర్ సీన్ ఒక్కటే అయినప్పటికీ అందులో సూపర్ చేసాడు. డబుల్ రోల్లో కనిపించిన ముస్కాన్ కాలేజ్ ఎపిసోడ్స్ లో చాలా క్యూట్ గా ఉంటుంది. అలాగే తన పాత్రతో కాసిన్ని నవ్వులు కూడా పంచింది. ఇక ముఖ్య పాత్రలు చేసిన పోషించిన చైతన్య కృష్ణ, మనోజ్ నందం, అభినవ్ బేతగంటి, యాదమ్మరాజు, లక్షణ్, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్,అభయ్,మహాతిలు చాలా బాగా చేశారు.

ఆన్ స్క్రీన్ చూస్తున్న ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ విషయానికి వస్తే.. చైల్డ్ హుడ్ ఎపిసోడ్, జార్జ్ రెడ్డి ఇంట్రడక్షన్ సీన్, కాలేజ్ మెస్ లో జరిగే యాక్షన్ బ్లాక్, నైట్ ఎఫెక్ట్ లో జరిగే ఫైర్ ఎపిసోడ్, పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చే ఇంటర్వల్ బ్లాక్ మరియు సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్, రెయిన్ ఫైట్ సీన్స్ మాత్రం ఆడియన్స్ చేత పక్కాగా ఈలలు వేయిస్తాయి. క్లైమాక్స్ ఎమోషనల్ టచ్ కూడా పరవాలేధనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం జెట్ స్పీడ్ తో వెళ్తూ సూపర్బ్ ఫీలింగ్ ఇస్తుంది.

ఆఫ్ స్క్రీన్:  

వీరు తెరవెనుక పని చేసినా తెరపై మొదటగా మనకి కనిపించేది బొమ్మ తాలూకు పనిమాత్రం వీళ్ళదే.. ఆ కదిలే బొమ్మలను చూపించిన సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యెక్కంటి విజువల్ మేకింగ్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. స్టూడెంట్స్ గొడవలు, కాలేజ్ ఎపిసోడ్స్ మరియు అప్పటి లుక్ ని తన కెమెరాతో మనకి చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా చాలా చోట్ల కంటిన్యూ షాట్స్ తో తీసిన చాలా సీన్స్ సూపర్బ్ గా వచ్చాయి. అలా కంటిన్యూగా తీయడం వలన ఆ సీన్ లోని కంటెంట్ చాలా బాగా రీచ్ అయ్యింది. ఇక ఈయన విజువల్స్ కి మన కళ్ళు పెద్దవి అవుతుంటే, ఆ ఫీల్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లి, మన రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది మాత్రం హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతమనే చెప్పాలి. ప్రతి ఎలివేషన్ సీన్ లోనూ మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఆడియన్స్ అరవకుండా ఉండలేరు అంటే మీరే అర్థం చేస్కోవచ్చు ఏ రేంజ్ లో మ్యూజిక్ కొట్టాడనేది. గాంధీ నడికుడికార్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. జీవన్ రెడ్డి డైలాగ్స్ చాలా సీన్స్ లో బాగా రాశారు. ముఖ్యంగా కాలేజ్ స్పీచ్ లు, లక్షణ్ కి రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సురేష్ బొబ్బిలి సాంగ్స్ డీసెంట్ అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఆన్ స్క్రీన్ పరంగా.. సినిమా అంతా అయిపోయాక సినిమా బాగుంది కానీ సంపూర్ణంగా లేదు అనే ఫీలింగ్ వలన కొంత సంతృప్తి ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ అలా అలా డ్రాప్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సడన్ గా ఫినిష్ చేసేసినట్టు ఉంటుంది. అలాగే ఫినిషింగ్ లో ఎమోషనల్ గా కూడా కంప్లీట్ గా మనల్ని కనెక్ట్ చేయలేదు. సెకండాఫ్ ఫ్లో పరంగా చూసుకుంటే బ్లేడ్ ఫైట్, తర్వాత మదర్ సాంగ్ తర్వాత సినిమా ఫ్లో డ్రాప్ అవుతూ వస్తుంది. ఒకటి అరా సీన్స్ బాగున్నప్పటికీ మంచి బ్లాక్స్ లేక క్లైమాక్స్ వరకూ డ్రాగ్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ కథలో ఎమోషన్స్ పరంగా చాలా ఉన్నాయి, జార్జ్ రెడ్డి – మదర్ ఎమోషన్, జార్జ్ రెడ్డి చనిపోవడం, ఫ్రెండ్స్ తో అతనికి ఉన్న అనుబంధం ఇలా చాలానే ఉన్నాయి. కానీ వేటినీ పూర్తిగా చూపించలేదు. అలాగే లవ్ ట్రాక్ ని ఫిక్షనల్ పాయింట్ లో జత చేసినా దానికి ఒక కంప్లీట్ నెస్ ఇవ్వలేదు. అలాగే విలనిజం కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు.

ఆఫ్ స్క్రీన్:  

ముందుగా కథ విషయానికి వస్తే.. ఇదొక బయోపిక్.. ఇలాంటి సినిమాలు తీస్తప్పుడు జనాలకు తెలిసిన వాటికంటే తెలియని విషయాలను చెప్పినప్పుడు ఆ కథకి ఆడియన్స్ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. కానీ ఇక్కడ అది మిస్ అయ్యింది. బేసిక్ గా జార్జ్ రెడ్డి అనగానే ఏమి కథ తెలుసో వాటినే కమర్షియల్ గా తీశారు తప్ప, తెలియని ఎన్నో విషయాలను చెప్పలేదు. ముఖ్యంగా హీరో పాత్రలోని మోమెంట్స్ వలన నచ్చుతుంది కానీ చిన్నప్పటి నుంచీ జార్జ్ రెడ్డి ఎందుకు రెబల్ లా పెరిగాడు, ఎవరు మోటివేషన్, స్టూడెంట్ లీడర్ గా మారిన తన ఐడియాలజీ ఏంటి, ఎందుకోసం ముంబై యూనివర్సిటీకి వెళ్లకుండా కాన్సల్ చేసుకున్నాడు, ఎవరి వల్ల నిజంగా అతనికి థ్రెట్, పొలిటికల్ పార్టీస్ పరంగా అతనికి ఎదురైన సంఘటనలను, తను జైల్లో గడిపిన రోజులు ఇలా చాలా అంశాలను అసలు ప్రస్తావించకుండానే డైరెక్టర్ జీవన్ రెడ్డి తనకి కథలో హై అనిపించే మోమెంట్స్ ని మాత్రమే తీసాడు.

ఇలా కథ పరంగా చెప్పాల్సిన చాలా పాయింట్స్ మరియు ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చెప్పలేదు. ముఖ్యంగా అతను ఏయే విషయాలపై పోరాడి అందరిలోనూ భయాన్ని, స్టూడెంట్స్ లో ప్రేమను సంపాదించాడు అనే విషయాలను చెప్పలేదు. ఇక కథనం పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బ్లాక్స్ అండ్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. కానీ సెకండాఫ్ మాత్రం కంప్లీట్ డ్రాప్ అయ్యేలా డిజైన్ చేశారు. తను సెలక్ట్ చేసుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే వలన కథని వేరేలా చెప్పి సెకండాఫ్ ని ఇంకా హైలైట్ చేసి ఉండచ్చు కానీ ఆయన పూర్తి లైఫ్ స్టోరీని చెప్పకుండా బ్లాక్స్ మాత్రమే చూపించడం వలన సెకండాఫ్ స్ట్రాంగ్ గా లేకుండా పోయింది. ఇక డైరెక్టర్ గా చాలా సీన్స్ లో ప్రేక్షకులకి కావాల్సిన కిక్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.

ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ బాగుంది, కానీ సెకండాఫ్ పరంగా కాస్త కట్ చేసేసి, ఒకవేళ వీరిదగ్గర ట్రిమ్ చేసిన సీన్స్ లో ఏదన్నా బాగుండి ఉంటే అది యాడ్ చేసున్నా బాగుండేది. కొన్ని చోట్ల రిపీటెడ్ షాట్స్ ఉంటాయి.

విశ్లేషణ: 

‘జార్జ్ రెడ్డి’ సినిమా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకి మినిమమ్ 6 సీన్స్ లో అయినా మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి మీరు ఓ హై రేంజ్ కమర్షియల్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ని మాత్రం పక్కాగా కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేసే ఆడియన్స్ సెకండాఫ్ ని ఆ రేంజ్ లో ఎంజాయ్ చేయలేరు. ఇందులోని రెబల్ మోమెంట్స్ కి ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. జార్జ్ రెడ్డి బయోపిక్ అని చెప్పి ఆయన పూర్తి కథని తెరపై పూర్తిగా ఆవిష్కరించకుండా, కేవలం నచ్చిన అంశాలనే చూపించడం మైనస్. కంప్లీట్ నవ్వుకునే సినిమా కావాలి, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా పెద్దగా నచ్చక పోవచ్చు. కానీ యూత్ కి పక్కా నచ్చే సినిమా ‘జార్జ్ రెడ్డి’. అలాగే గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మంచి సినిమా లేక ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులని మరికొద్ది రోజులు ఈ ‘జార్జ్ రెడ్డి’ ఎంటర్టైన్ చేస్తుంది.

ఫైనల్ పంచ్: జార్జ్ రెడ్డి – రెడ్డీ.. బొమ్మ హిట్టు..!

62 COMMENTS

  1. 483754 24624The when I just read a blog, Im hoping that this doesnt disappoint me approximately this 1. Get real, Yes, it was my method to read, but When i thought youd have something fascinating to state. All I hear is actually a number of whining about something which you could fix should you werent too busy trying to discover attention. 650251

  2. Покупайте на авто форуме [URL=https://saabclub.xf2.site/forums/shiny-i-diski.46/]nankang[/URL] – большой выбор для легковых, грузовых и коммерческих автомобилей, также приобретайте [URL=https://saabclub.xf2.site/forums/shiny-i-diski.46/]авто диски[/URL] с гарантией от производителя

  3. [B]Форум владельцев авто[/B] [URL=https://avtotalk.xf2.site/]Интернет магазин автозапчастей – авто форум[/URL] Требуются водители на постоянную работу на авто компании Водители. [URL=https://avtotalk.xf2.site/forums/zapchasti-i-aksessuary.39/]Запчасти и аксессуары[/URL]

  4. Наша бригада искусных исполнителей предоставлена предложить вам прогрессивные приемы, которые не только предоставят надежную защиту от заморозков, но и подарят вашему жилищу современный вид.
    Мы функционируем с новыми строительными материалами, гарантируя продолжительный термин службы и прекрасные решения. Изолирование наружных поверхностей – это не только экономия на отоплении, но и заботливость о природной среде. Энергоэффективные инновации, какие мы внедряем, способствуют не только зданию, но и поддержанию природных ресурсов.
    Самое главное: [url=https://ppu-prof.ru/]Утепление фасада цена за 1м2[/url] у нас составляет всего от 1250 рублей за м²! Это доступное решение, которое превратит ваш хаус в истинный комфортный уголок с минимальными затратами.
    Наши достижения – это не исключительно утепление, это созидание поля, в котором каждый элемент выражает ваш уникальный моду. Мы рассмотрим все все ваши требования, чтобы осуществить ваш дом еще еще более уютным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]официальном сайте[/url]
    Не откладывайте занятия о своем доме на потом! Обращайтесь к специалистам, и мы сделаем ваш жилище не только тепличным, но и изысканнее. Заинтересовались? Подробнее о наших трудах вы можете узнать на интернет-портале. Добро пожаловать в пределы уюта и качества.

  5. Мы команда специалистов по SEO-оптимизации, занимающихся увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Мы получили заметные достижения и предлагаем вам воспользоваться нашим опытом и знаниями.
    Какими преимуществами вы сможете воспользоваться:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]продвижение веб сайта в поисковых[/url]
    • Анализ всех аспектов вашего сайта и разработка уникальной стратегии продвижения.
    • Усовершенствование контента и технических особенностей вашего сайта для достижения максимальной производительности.
    • Ежемесячный мониторинг и анализ данных для постоянного совершенствования вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Результаты наших клиентов уже видны: повышение посещаемости, улучшение позиций в поисковых запросах и, конечно же, рост бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для обсуждения ваших потребностей и разработки стратегии продвижения, соответствующей вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои результаты в интернете. Свяжитесь с нами сегодня же.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...
నటీనటులు:  సందీప్ మాధవ్, సత్య దేవ్, ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ తదితరులు నిర్మాత: అప్పిరెడ్డి దర్శకత్వం: జీవన్ రెడ్డి. సినిమాటోగ్రఫీ: సుధాకర్ యెక్కంటి మ్యూజిక్:  సురేష్ బొబ్బిలి ఎడిటర్‌: ప్రతాప్ కుమార్ విడుదల తేదీ: నవంబర్ 22, 2019 రేటింగ్: 3/5 టాలీవుడ్ టాప్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రీసెంట్ సెన్సేషన్ విశ్వక్ సేన్ వరకూ అందరూ ప్రేక్షకులంతా తప్పక చూడాలి అని...జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్