Switch to English

సినిమా రివ్యూ: రాగల 24 గంటల్లో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్..
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
మ్యూజిక్: రఘు కుంచె
ఎడిటర్‌: తమ్మి రాజు
విడుదల తేదీ: నవంబర్ 22, 2019
రేటింగ్: 2/5

తెలుగు భామ ఈషా రెబ్బ తన కెరీర్లో తొలిసారి చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో నేడు రిలీజైన ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ‘డమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రల్లో నటించారు. మరి మన తెలుగు భామ మొదటిసారిగా చేసిన ఈ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ:

బంగాళాఖాతంలో ఏర్పడిన తూఫాన్ హెచ్చరికతో, మేఘన(ముస్కాన్ సేథీ) రేప్ అండ్ మర్డర్ కేసులో తప్పించుకున్న ముగ్గురు నిందితుల హెచ్చరికతో రాగల 24 గంటల్లో’ ఏదైనా జరగచ్చు అనే నోట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే..

ఇండియాలోనే టాప్ మోస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్స్ లో రాహుల్(సత్యదేవ్) ఒకరు. తన సక్సెస్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్దపడే రాహుల్ మొదటిసారి విద్య(ఈషా రెబ్బ)ని చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి చేసుకున్నాక తనలోని నెగటివ్ షేడ్స్, పొసెసివ్ నెస్, జాలిదయ లేకుండా తాను చేసే కొన్ని పనులు విద్యకి నచ్చవు. దాంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. అదే సమయంలో రాహుల్ అనుమానాస్పదంగా తన ఇంట్లోనే మర్డర్ కి గురవుతాడు. ఇంతకీ ఆ మర్డర్ భార్య అయిన విద్య చేసిందా? లేక ఇంకెవరైనా చేశారా? ఈ కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన ఎసిపి నరసింహా(శ్రీరామ్) ఎలా సాల్వ్ చేసాడు? మొదట్లో తప్పించుకున్న ముగ్గురు హంతకులు ఏమయ్యారు? అనేదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సిల్వర్ స్క్రీన్ పై కనపడే నటీనటుల విషయంలో వందకి వంద మార్కులు సంపాదించుకున్న నటుడు మాత్రం సత్యదేవ్ అని చెప్పాలి. ఇప్పటికే తను మంచి నటుడని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇందులో రకరకాల షేడ్స్ ఉన్న కంప్లీట్ నెగటివ్ పాత్రలో అద్భుతంగా చేసాడు. ఈ సినిమా రిజల్ట్ ఏదైనప్పటికీ నటుడిగా సత్యేదేవ్ కి నెక్స్ట్ లెవల్ ఆఫర్స్ వస్తాయి. ముఖ్యంగా సినిమాలో అతని పాత్ర మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది దాంతో అతని సీన్స్ మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తాం. ఇక లీడ్ రోల్ చేసిన ఈషా రెబ్బా కూడా మంచి నటనని కనబరిచి తన టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేసుకుంది. మొదటి సాంగ్ లోని రొమాంటిక్ అప్పియరెన్స్ కూడా ఈషా హెల్ప్ అయ్యింది.

ఇకపోతే ముఖ్య పాత్రలు చేసిన శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, శ్రీనివాస్ కానూరు, టెంపర్ వంశీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సెకండాఫ్ లో గ్లామర్ అట్రాక్షన్ పరంగా ముస్కాన్ సేథీ హెల్ప్ అయ్యింది. సినిమా పరంగా చూసుకుంటే సత్యదేవ్ – ఈషా రెబ్బా మధ్య వచ్చే ప్రెగ్నెన్సీ ఎమోషనల్ బ్లాక్ బాగుంది.

ఆఫ్ స్క్రీన్:

‘గరుడవేగ’ అంజి విజువల్స్ చాలా బాగున్నాయి. సన్నివేశాల్లోని ఎమోషన్స్ ని తన షాట్ మేకింగ్ ద్వారా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే రఘు కుంచె బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో సీన్స్ సరిగా లేకపోయినా ఆయన మ్యూజిక్ తో చాలా వరకూ మేనేజ్ చేయడానికి ట్రై చేసాడు. ఆర్ట్ వర్క్ బాగుంది. శ్రీనివాస్ కానూరు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

కథా పరంగా ఫస్ట్ హాఫ్ పరవాలేధనిపించినా, సెకండాఫ్ మాత్రం చాలా లాగ్ అనిపిస్తుంది. సెకండాఫ్ మొదట్లోనే కథని ఫినిష్ చేసిన ఫీలింగ్ కలిగించి మళ్ళీ కొత్తగా మలుపులు పెట్టి ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ రావడం అనేది వర్కౌట్ అవ్వలేదు. ఈషా రెబ్బా ఎందుకు తన సమస్య కంటే గణేష్ సమస్య కోసం ఇంత రిస్క్ చేసిందా అనే అంశం, వారిద్దరి రిలేషన్ షిప్ మీద ఇచ్చే క్లారిటీ సీన్ కూడా ఎమోషనల్ గా రీచ్ అవ్వలేదు. క్రిమినల్స్ పాత్రలని ఫస్ట్ హాఫ్ లో సరిగా ప్రెజంట్ చేయకపోవడం వలన సెకండాఫ్ లో ట్విస్ట్స్ మనం గెస్ చేసేయగలం. కృష్ణభగవాన్ పాత్రలో వచ్చే సీన్స్ అనవసరం.

ఆఫ్ స్క్రీన్:

ముందుగా ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలి. ఇదొక రివెంజ్ కథ. ఇదే కథల్ని మన వాళ్ళు హార్రర్ కామెడీ ఫార్మాట్ లో చెప్తుంటారు. కానీ ఇక్కడ కథా రచయిత శ్రీనివాస్ వర్మ కంప్లీట్ సీరియస్ థ్రిల్లర్ గా చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ అంత సీరియస్ గా చెప్పాలనుకున్నప్పుడు ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉండాలి, కానీ ఇక్కడ అలాంటి సీన్స్ ఒక నాలుగైదు మాత్రమే ఉంటాయి. రచయితగా ఈయన బెస్ట్ అనిపించుకున్నాడు అంటే అది సత్యదేవ్ కి రాసిన ఈగోయిస్టిక్ పాత్రలో మాత్రమే.. కానీ ఆ పాత్రని అన్ని పాత్రలకి లింక్ చేసి చెప్పడంలో అంతగా సక్సెస్ కాలేదు. ఓవరాల్ గా కథ కొత్తగా లేకపోగా ఎంగేజింగ్ ట్విస్ట్ లు కూడా లేవు. కథ కథనం పరంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కాస్త తడబాటుకు గురయ్యారు అని చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ మర్డర్ ని కవర్ చేయాలి అని ట్రై చేసిన హీరోయిన్ చాలా సింపుల్ గా నేరం ఒప్పేసుకుంటుంది. దాంతో ఆడియన్స్ తో ఓ కొత్త ప్లే నడిపించబోతుంది అనుకుంటారు కానీ కథని కంప్లీట్ గా మార్చేసి ఏటో తీసుకెళ్ళారు. సరే ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేయడం కోసం వేరేలా వెళ్లారు అనుకున్నా, అదైనా ఎఫెక్టివ్ గా ఉండాలి కదా కానీ ఆ రూట్ కథని ఇంకా తేల్చేసింది. ఎందుకంటే కథని మొదటి నుంచి ఈషా రెబ్బా పెయిన్ మీద చూపించి చివరికి ఇక్కడ పాయింట్ అది కాదని చెప్పడం నిరాశని కలిగిస్తుంది.

ఇక డైరెక్టర్ గా కూడా శ్రీనివాస్ రెడ్డి నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో బెస్ట్ అనిపించుకున్న, ఓవరాల్ సినిమాని మాత్రం యావరేజ్ అనేలా చేశారు. చాలా గ్యాప్ తీసుకుని ఆయన కంఫర్ట్ జోన్ అయిన కామెడీని వదిలి చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ఆయనకీ కాస్త నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఎడిటర్ తమ్మిరాజు ఫస్ట్ హాఫ్ ని కాస్త టైట్ గా కట్ చేసినప్పటికీ సెకండాఫ్ విషయంలో అది మిస్ అయ్యింది.

విశ్లేషణ:

డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తను బెస్ట్ అనిపించుకున్న కామెడీ జోన్ ని వదిలి, థ్రిల్లర్ జోన్ లో చేసిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా జస్ట్ యావరేజ్ అనే టాక్ ని సొంతం చేసుకుంది. అది కూడా సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్ లాంటి నటీనటుల పెర్ఫార్మన్స్ వల్లే తప్ప, కథ లేదా ఈ ఎలిమెంట్స్ హైలైట్ అని చెప్పుకునేలా సినిమాలో పెద్దగా ఏమీ లేవు. కంప్లీట్ థ్రిల్లర్ సినిమాలు మాత్రమే ఎంజాయ్ చేయగలం అనుకునే వారు మాత్రం ఒకసారి ట్రై చేయచ్చు. లేదు మాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఉండాలి అనుకునే వారికి పెద్దగా నచ్చదు.

ఫైనల్ పంచ్: రాగల 24 గంటల్లో – థ్రిల్ చేయలేకపోయిన థ్రిల్లర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...
నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్.. నిర్మాత: శ్రీనివాస్ కానూరు దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి మ్యూజిక్: రఘు కుంచె ఎడిటర్‌: తమ్మి రాజు విడుదల తేదీ: నవంబర్ 22, 2019 రేటింగ్: 2/5 తెలుగు భామ ఈషా రెబ్బ తన కెరీర్లో తొలిసారి చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమా 'రాగల 24 గంటల్లో'. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా...సినిమా రివ్యూ: రాగల 24 గంటల్లో