TDP Mahanadu: టీడీపీ (Tdp) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహనాడు (TDP Mahanadu) రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో నగరం పసుపుమయం అయింది. తొలిరోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి 35వేల మంది వరకూ వస్తారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు (NT Rama rao) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నో మహానాడులు చూశా. ఈ మహానాడు ప్రత్యేకమైనది. క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది. ఎనర్జీ వచ్చింది. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోదాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఎన్టీఆర్ శత జయంతిని గొప్పగా చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుంది. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామం వంటివి. కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దాం. సంపద సృష్టించడం తెలుసు.. అభివృద్ధి చేయడం తెలుస’ని అన్నారు.