వ్యాపార రంగంలో అంచలంచెలుగా ఎదిగినవాళ్ళు, తాము సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. అలా సేవా కార్యక్రమాలు చేయడంలో ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెబుతుంటుంటారు.
రాజకీయం అంటేనే సేవ.! కానీ, దాన్ని వ్యాపారంగా మార్చేశారు కొందరు రాజకీయ నాయకులు. వ్యపార రంగంలో రాణించి, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకనేవారూ కొందరుంటారు.
చాలా తక్కువమంది మాత్రమే. మాతృభూమి మీద మమకారంతో, తమకు జన్మనిచ్చిన ప్రాంతం, అక్కడి ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తుంటారు. హైద్రాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రముఖ బిల్డర్‌గా ఎదిగిన యల్లటూరు శ్రీనివాస రాజు, వీలు చిక్కినప్పుడల్లా ప్రజా సేవ గురించి ఆలోచన చేస్తుంటారు.
నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా వుంటూనే, సాయం కోసం ఎదురుచూసేవారికి తనవంతు సాయం చేస్తుంటారాయన. వికలాంగులకు వీల్ ఛెయిర్స్ అందించడం దగ్గర్నుంచి, ఉన్నత విద్య చదవాలనుకునే పేదవారికి ఆర్థిక సాయం చేయడం వరకూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యల్లటూరు శ్రీనివాసరాజు.
యల్లటూరు శ్రీనివాసరాజు స్వస్థలం రాజంపేట నియోజకవర్గంలో వుంది. ఆయన సాయం పొందిన చాలామంది, ‘ఇలాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే.. రాజకీయమంటే సేవ అన్నమాటకు గౌరవం పెరుగుతుంది’ అని చెబుతుంటారు.
నాయకత్వం అంటే, ప్రజల మెప్పు ద్వారా లభించాలి.. అలాంటి నాయకత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. యల్లటూరు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలకు మరింత వన్నె తెస్తే మంచిదేగా.!