ఇప్పటి వరకు రెస్టారెంట్లు మరియు హోటల్స్ నుండి మాత్రమే ఫుడ్ ను వినియోగదారులకు సరఫరా చేసిన స్విగ్గీ త్వరలో స్ట్రీట్ ఫుడ్ ను కూడా వినియోగదారుల ఇంటి వద్దకు తీసుకు వెళ్లబోతుంది. కరోనా కారణంగా జనాలు స్ట్రీట్ ఫుడ్ ను మిస్ అవుతున్నారు.
పెద్ద పెద్ద హోటల్స్ లో తిన్న వాటి కంటే కొన్ని సార్లు స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ రుచిగా ఉంటుంది. అందుకే కార్లల్లో వచ్చి మరీ మా వద్ద ఫుడ్ తీసుకుంటారు అంటూ కొందరు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు అంటూ ఉంటారు. అయితే ఇన్నాళ్లు వారికి ఆన్ లైన్ తో అనుసంధానం లేదు. ఇకపై స్ట్రీట్ ఫుడ్ ను కూడా స్విగ్గీ డోర్ డెలవరీ చేసేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకుంది.
సరైన ఫుడ్ సెఫ్టీ మరియు శుభ్రత విషయాలను పరిగణలోకి తీసుకుని ఫుడ్ ను అందించే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల నుండి స్విగ్గీ వినియోగదారులకు ఫుడ్ ను సరఫరా చేయబోతుంది. కేంద్రం ఈ విధానంను ప్రయోగాత్మకంగా దేశ వ్యాప్తంగా ఐదు పట్టణాల్లో నిర్వహించి 250 మంది వీధి వ్యాపారులను ఆన్ లైన్ ద్వారా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.
అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ఇండోర్, వారణాసిల్లోల వీధి వ్యాపారులను స్విగ్గీ మొదట ఆన్ లైన్ ద్వారా అనుసంధానం చేయబోతుంది. 250 మంది వ్యాపారులను ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఆన్ లైన్ ద్వారా ఎలా ఆర్డర్లు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా ట్రైనింగ్ లో వారికి తెలియజేయనున్నారు. మొదట అయిదు నగరాల్లో ఈ విధానం సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.
274860 652005I also recommend HubPages itself, and Squidoo, which is similar. 440955
425714 169039This internet page is often a walk-through its the internet you wanted about this and didnt know who to question. Glimpse here, and youll completely discover it. 711687