సంచలన నటిగా .. పలు వివాదాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీ రెడ్డి త్వరలోనే కొత్త యాపారం మొదలెట్టబోతోంది. ఇన్నాళ్లు నటిగా నిలదొక్కుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి పెద్దగా వర్కవుట్ కాలేదు .. దాంతో ఆమె సొంతంగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగేందుకు రెడీ అయింది.
శ్రీ రెడ్డి ప్రొడక్షన్స్ పేరుతొ ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్టు తెలిపింది శ్రీ రెడ్డి. సినిమా రంగంలో అవకాశాలు దొరక్కా .. కష్టపడుతున్న కొత్త వారికోసమే ఈ బ్యానర్ ని మొదలెట్టాను అని చెప్పిన శ్రీ రెడ్డి .. తన బ్యానర్ లో మొదటి సినిమా విషయంలో మాత్రం ముందు తమిళ నటీనటులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. ఆ తరువాత తెలుగువారి గురించి ఆలోచిస్తా .. అని చెప్పి షాక్ ఇచ్చింది.
మరి శ్రీ రెడ్డి సినిమాలో ఛాన్స్ దక్కించుకునే నటీనటులు ఎవరో ? అన్న ఆసక్తి ఇప్పుడు ఎక్కువైంది. మొత్తానికి మీ టూ వ్యవహారంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ రెడ్డి బ్యానర్ మొదలెట్టడంతో కొందరు నిర్మాతలు షాక్ కి గురయ్యారట. మరి ఈ బ్యానర్ లో ఈమె ఎలాంటి సినిమాలు తీస్తుందో అని ప్రశ్నించుకుంటున్నారు.
506329 186042Hey, you used to write amazing, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a little bit out of track! come on! 454958
303527 922230Sweet internet internet site , super style , genuinely clean and utilize genial . 809675