మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ లో మొదటి ప్రయత్నంగా బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమాను తెలుగులో రిమేక్ చేస్తున్నాడు పవన్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలెట్టకముందే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. అయన రెండో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు, ఏ ఎం రత్నం నిర్మాత.
అయితే రెండో ప్రాజెక్ట్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి కారణం ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఉంటుందని టాక్. ఇది మొఘలాయిల కాలానికి సంబందించిన కథ అని, మహమ్మదీయుల పరిపాలనా, అప్పటి పరిస్థితులతో ఈ సినిమా ఉంటుందని టాక్. అందుకోసం ప్రత్యేక సెట్స్ కూడా వేయించాలట. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర న్యూస్ వెలుగులోకి వచ్చింది .. అదేమిటంటే .. ఇందులో పవన్ కళ్యాణ్ దొంగ గా కనిపిస్తాడట ? అంటే ఆలీబాబా అరడజను దొంగలు తరహాలో .. పక్కా జానపద నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు భామల పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో రాసి ఖన్నా తో పాటు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తీ కావొచ్చాయని .. జనవరి చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారట. మరి ఈ సినిమా గురించి వినిపిస్తున్న టాక్ లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
227740 742173Its a shame you dont have a donate button! Id most surely donate to this outstanding internet internet site! I suppose inside the meantime ill be happy with bookmarking and putting your Rss feed to my Google account. I appear forward to fresh updates and will share this weblog with my Facebook group: ) 304806
608688 422128Paris Hilton: So lovely spending time with Manny and h 295208
681608 145467Well worded post will probably be sharing this with my readers this evening 674834
407824 872022Intriguing post. Positive that Ill come back here. Great function. 12107
189299 138465I like the way you conduct your posts. Hmm 594620