పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం జల్సా సినిమా ప్రత్యేక షో లను ముందు రోజు అంటే నిన్న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున స్క్రీనింగ్ చేసిన విషయం తెల్సిందే. అభిమానుల హంగామా మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల అయితే ఎలా ఉంటుందో అంతకు మించి అన్నట్లుగా హడావుడి కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా జల్సా రీ రిలీజ్ ముచ్చట్లు మాట్లాడుకున్నారు.
కర్నూలు శ్రీరామ థియేటర్ లో కూడా జల్సా సినిమా ను ప్రత్యేక షో వేశారు. సినిమాను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. థియేటర్ కెపాసిటీ ని మించి టికెట్లు ఇవ్వడం జరిగింది. జల్సా సినిమా పాత ప్రింట్ అవ్వడంతో సౌండ్ విషయంలో కాస్త టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. సౌండ్ సరిగా రావడం లేదు అంటూ అభిమానుల హంగామా మొదలు అయ్యింది. అది కాస్త థియేటర్ లోని అద్దాలు బద్దలు కొట్టే వరకు వెళ్లింది. అభిమానులు థియేటర్ పై రాళ్ల దాడికి పాల్పడ్డట్లు యాజమాన్యం తెలియజేసింది.