యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరస హిట్స్ ను కొడుతున్నాడు. పైగా ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో దుమ్మురేపబోతున్నాడు. కొమరం భీమ్ పాత్ర ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా అందరూ ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వీడియో రిలీజ్ ఉంటుందని ఊహించారు. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అల్లూరి సీతారామరాజు ఇంట్రడక్షన్ వీడియోను దించిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు కూడా అదే చేస్తారని అనుకున్నారు.
అయితే లాక్ డౌన్ గత 60 రోజుల నుండి అమల్లో ఉండడంతో ఎన్టీఆర్ పుట్టినరోజుకు స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం కుదరట్లేదని ఆర్ ఆర్ ఆర్ టీమ్ బహిర్గతం చేసింది. దీంతో పరిస్థితిని అర్ధం చేసుకున్నా కూడా ఫ్యాన్స్ అయితే బాగా నిరుత్సాహపడ్డారు. వీడియో కాకపోయినా పోస్టర్, లేక ఏదో ఒక మేకింగ్ వీడియోనో దింపుతారని ఆశించారు కానీ ఏ రకమైన అప్డేట్ ఉండదని తెలిసిపోవడంతో బాగా నీరుగారిపోయారు.
అయితే ఫ్యాన్స్ మరీ కలతచెందాల్సిన అవసరం లేదు. వారికోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ఎన్టీఆర్ బాడీని ట్రైన్ చేస్తున్న లాయిడ్ స్టీవెన్స్ అనే ట్రైనర్ ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉందని ట్వీట్ చేసాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ అది ఏమై ఉంటుందా అన్న ఆశ్చర్యంలో ఉండిపోయారు. మరికొంత మంది మా బాధను నువ్వైనా అర్ధం చేసుకున్నావ్.. థాంక్స్ అంటూ ట్వీట్ చేసారు.
So tomorrow being @tarak9999 ‘s Birthday, I have something special lined up for all his fans today… stay tuned and watch this space!! 😉@smkoneru
— Lloyd Stevens (@lloydstevenspt) May 19, 2020
348272 514440Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I believe I learned much more from this post. Im really glad to see such fantastic info being shared freely out there. 28997
773366 448282You should get involved in a contest first of the greatest blogs over the internet. Ill recommend this page! 339164
37475 938178hello i discovered your post and thought it was really informational likewise i suggest this site about repairing lap tops Click Here 447446
154230 366764Id forever want to be update on new articles on this site, bookmarked ! . 811325
130015 422221Some truly nice stuff on this web site , I like it. 394731