Switch to English

రామ్ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్ విడుదలకు ముందు కరోనా సంక్షోభం కారణంగా ఆగిపోయిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కానీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు బంద్ అవ్వడంతో రిలీజ్ నిలిచిపోయింది. రెడ్ తో పాటు పలు తెలుగు సినిమాలు కూడా విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఓటిటి. థియేటర్లు మరో రెండు, మూడు నెలల వరకూ తెరుచుకునే వీలయితే లేదు. దీంతో చాలా మంది నిర్మాతలు అంతకాలం వడ్డీల భారం భరించలేక ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నారు.

ఇదే క్రమంలో రెడ్ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలవుతుందా అన్న అనుమానాలు కలిగాయి చాలా మందికి. ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ తో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని రెడ్ టీమ్ ఖండించింది. ఈ చిత్రాన్ని వెండితెర మీద చూసి ఆనందించాలని, ఈ సినిమా థియేటర్లో చూస్తేనే అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రామ్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా అనేది కొంత మందికి ప్యాషన్, చాలా మందికి వ్యాపారం, తక్కిన వారికి జూదం. ప్రతి ఒక్కరూ వారి వారి కోణం నుండి సినిమాను చూస్తున్నారని ట్వీట్ చేసాడు రామ్. అయితే ఈ ట్వీట్ లో ఇన్నర్ మీనింగ్ ఏమైనా ఉందా? ప్రస్తుతం జరుగుతున్న థియేటర్ వెర్సస్ ఓటిటి చర్చకు దీనికి ఏమైనా లింక్ ఉందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఏమో మరి అది రామ్ కే తెలియాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...

పవన్ తన మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడు. గత రెండేళ్లుగా సినిమాలు చేయకపోయినా తన ఇమేజ్, క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం తన పార్టీని ఆర్ధికంగా బలపరచడం కోసం...

యంగ్ హీరో కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం

ఏ సపోర్ట్ లేకుండా తన ప్రతిభతో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు సాధించిన ఈ కుర్రాడు సరైన సినిమాల ఎంపికలో...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...