Switch to English

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత..
నిర్మాత: అనిల్ సుంకర – దిల్ రాజు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్
ఎడిటర్‌: తమ్మిరాజు
రన్ టైం: 2 గంటల 49 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 11, 2020

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు, వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చేసిన మొదటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. టీజర్, ట్రైలర్స్ తో సూపర్ హైప్ తో వరల్డ్ వైడ్ గా నేడు, అనగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి మళ్ళీ ఇందులో నటించడం, ప్రకాష్ రాజ్, రష్మిక, సంగీత, రాజేంద్ర ప్రసాద్ ఇలాగ చాలా మంది స్టార్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకొని ఈ సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

కాశ్మీర్ ఇండియన్ మిలిటరీ క్యాంపులో కథ మొదలవుతుంది. మేజర్ అజయ్ కృష్ణ(మహేష్ బాబు) అండ్ టీం అక్కడ టెర్రరిస్టులు చేసే కొన్ని అరాచకాల్ని అరికడుతూ ఉంటారు. కానీ ఓ మిషన్ లో భాగంగా తన టీం సోల్జర్ అయిన అజయ్(సత్యదేవ్) చనిపోతాడు. దాంతో ఆ విషయం తన ఫామిలీకి స్వయంగా చెప్పాలని అజయ్ కృష్ణ కర్నూల్ బయలు దేరుతాడు. అలా కర్నూల్ చేరిన అజయ్ కృష్ణ కి అజయ్ మదర్ ప్రొఫెసర్ భారతి(విజయశాంతి) పెద్ద సమస్యలో ఉందని తెలుస్తుంది. ఆ సమస్య పేరు మినిష్టర్ ప్రకాష్ రాజ్. ఇక అక్కడినుంచి మేజర్ అజయ్ కృష్ణ భారతికి సపోర్ట్ గా నిలబడి ఏం చేసాడు? అసలు ప్రకాష్ రాజ్ క్రియేట్ చేసిన సమస్య ఏమిటి? దానిని అజయ్ ఎలా సాల్వ్ చేసాడు.? అందుకోసం అజయ్ ఎదుర్కున్న సవాళ్లేమిటి? వీటన్నిటికంటే ముందు కర్నూల్ ప్రయాణంలో అజయ్, సంస్కృతి(రష్మిక మందన్న) అండ్ గ్యాంగ్ వలన ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? అనే కథని మీరు వెండితెరపైనే చూడాలి.

తెర మీద స్టార్స్..   

చాలా రోజులుగా మాస్ మహేష్ బాబు తెరపై కనిపించడం లేదని తెగ బాధపడుతున్న అభిమానులకి కన్నుల పండుగలాంటి సినిమా ఇచ్చేసాడు. మహేష్ బాబు మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఫుల్ ఫన్ చేశారు. ఓవరాల్ గా మహేష్ బాబు తన స్టైల్, మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, కాస్త లౌడ్ హీరోయిక్ డైలాగ్స్ ఇలా అన్నిటిలోనూ అదరగొట్టాడు. స్పెషల్ గా డాన్సులతో కూడా అందరినీ సర్ప్రైజ్ చేసి మెప్పించాడు. ఇక 13ఏళ్ళ తర్వాత స్క్రీన్ పైన కనిపించిన విజయశాంతి కూడా అదే టాలెంట్ ని రీ క్రియేట్ చేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లోని ఎమోషనల్ సీన్ లో అందరినీ ఏడిపించేలా నటించింది.  అలాగే ఎలివేషన్ సీన్స్ లో అద్భుతమైన హావభావాలను పలికించింది.

ఇక చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ పాత్ర గురించి. మహేష్ బాబు తర్వాత మనకు బాగా గుర్తుండిపోయే పాత్ర ఇది. మూడ్ స్వింగ్స్ పరంగా డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన పాత్ర మనల్ని అటు నవ్విస్తుంది, ఇటు వెరీ బాడ్ విలన్ అని ఫీలయ్యేలా చేస్తుంది. ప్రకాష్ రాజ్ సూపర్బ్ పెర్ఫార్మర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరోయిన్ గా చేసిన రష్మిక కొన్ని చోట్ల బాగానే చేసింది. కొన్ని చోట్ల చూడటానికి కూడా అంత బాలేదు. ‘నీకర్థమవుతుందా’ అనే మ్యానరిజం తప్ప, చెప్పుకోదగ్గ సీన్స్, పాత్ర అయితే రష్మికకి ఇందులో లేదు. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్, సంగీత, హరితేజ, అశ్వినిలు అక్కడక్కడా నవ్వించారు. అలాగే సెకండాఫ్ లో సుబ్బరాజు – వెన్నెల కిషోర్ కాసిన్ని నవ్వులు ఇస్తారు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో పరవాలేధనిపించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా చెప్పుకోవాల్సింది.. కృష్ణ గారి ఎపిసోడ్స్ ని వాడుకున్న విధానం ఘట్టమనేని అభిమానులందరికీ మంచి హై వోల్టేజ్ వీల్ ని ఇస్తుంది.

తెర వెనుక టాలెంట్.. 

ఆన్ స్క్రీన్ మహేష్ బాబుది వన్ మాన్ షో అయితే, ఆఫ్ స్క్రీన్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ వన్ మాన్ షో అని చెప్పాలి.. ప్రతి సీన్ ని తన నేపధ్య సంగీతంతో డైరెక్ట్ గా ప్రేక్షకులకి రీచ్ చేసాడు. ముఖాయమగా ఎలివేషన్ సీన్స్ లో అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసాడు. దేవీశ్రీ లేకపోతే సినిమాలేదనేలా మ్యూజిక్ చేసాడు. ఇక చెప్పుకోవాల్సింది రత్నవేలు సినిమాటోగ్రఫీ.. ఆయన విజువల్స్ కూడా సింప్లీ సూపర్బ్. మరోసారి మహేష్ ని మరియు సినిమాని విజువల్ గా ది బెస్ట్ అనేలా ప్రెజంట్ చేసాడు. ఇక స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ గురించి.. ఆయన వేసిన ప్రతి సెట్ ఓ ఆణిముత్యం లాంటిది. ముఖ్యంగా కొండారెడ్డి బురుజుని మైమరిచేలా వేసిన సెట్ వర్క్ అద్భుతం. ఇక రామ్ -లక్షణ్ మాస్టర్స్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఆడియన్స్ కి మంచి గూస్ బంప్స్ ఇచ్చాయి. స్పెషల్ గా శేఖర్ మాస్టర్ మొదటిసారి మహేష్ తో వేయించిన ఫుల్ జోష్ ఉన్న స్టెప్స్ కి ప్రేక్షకులు విజిల్స్ వేయకుండా ఉండలేరు. ఇక ఎడిటర్ తమ్మిరాజు గారు సినిమాని ఇంకాస్త కుదించి ఆ 20 నిముషాలు కట్ చేసి ఉంటే లెంగ్త్ తక్కువ చేసుంటే ఇప్పుడు బోరింగ్ అనుకున్న ఎలిమెంట్స్ అన్ని లేచిపోయి హిట్ టాక్ కాస్త సూపర్ హిట్ టాక్ అయ్యుండేది. కానీ మిస్సయ్యారు.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. రాను రాను ఈయన సినిమాల్లో కథ అనేది కొరవడుతోంది. అది ఈ ‘సరిలేరు నీకెవ్వరు’లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెరీ వెరీ సింపుల్ లైన్ ని కథగా తీసుకున్నారు. అందుకే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ ఏం లేక సినిమా తేలిపోయింది. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కథనంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో హీరోయికి రాసుకున్న ఎలివేషన్ సీన్స్ లో చాలా సక్సెస్ అయ్యాడు. కానీ అనిల్ రావిపూడి అంటే కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుందనే టాగ్ లైన్ ని తెచ్చేసుకున్నాడు, ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. కామెడీ లేదు అని కాదు ఉంది, కానీ తన గత సినిమాల రేంజ్ లో లేదు, అంతలా నవ్వించలేదు కూడాను. కానీ డైరెక్టర్ గా ఒక స్టార్ హీరోని కూడా డీల్ చెయ్యగలను అని మాత్రం డిస్టింక్షన్ లో పాసయ్యి మరీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ డిజైనింగ్ సింప్లీ సూపర్బ్.. ప్రతి ఫ్రేమ్ లోనూ వారు పెట్టిన రూపాయి కలర్ఫుల్ గా కనపడింది.

విజిల్ మోమెంట్స్: 

– మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ వన్ మాన్ షో
– సూపర్బ్ ఇంట్రడక్షన్ మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్
– ఇంటర్వల్ ఎపిసోడ్
– సెకండాఫ్ లో వచ్చే హీరో విలన్ ఎలివేషన్ సీన్స్
– పొలిటికల్ లీడర్స్ కి మహేష్ వార్నింగ్ సీన్
– రోమాలు నిక్కబొడుచుకునే రామ్ – లక్ష్మణ్ యాక్షన్ ఎపిసోడ్స్
– విజయశాంతి ఎమోషనల్ ఎపిసోడ్
– డాంగ్ డాంగ్ అండ్ మైండ్ బ్లాక్ సాంగ్స్ పిక్చరజేషన్ అండ్ డాన్స్

బోరింగ్ మోమెంట్స్: 

– వెరీ సింపుల్ లైన్ తో రాసిన కథ
– డిజాష్టర్ అనిపించే క్లైమాక్స్
– అనిల్ రావిపూడి మార్క్ కామెడీ లేకపోవడం
– హైప్ ఇచ్చిన ట్రైన్ అండ్ బండ్ల గణేష్ ఎపిసోడ్ అంతగా నవ్వించలేకపోవడం
– బోరింగ్ హీరోయిన్ ట్రాక్
– సినిమా లెంగ్త్

విశ్లేషణ:  

మహేష్ బాబు తన అభిమానులు ఓ పక్క మాస్ మసాలా మూవీ కోరుకుంటున్నారని చేసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అలా కోరుకున్న అభిమానులందరికీ ఓ ఫుల్ బాటిల్ ఇచ్చేంత కిక్ ఇచ్చేలానే ‘సరిలేరు నీకెవ్వరు’ ఉంది. మహేష్ బాబు మీద అభిమానంతో అభిమానులకైతే ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చచ్చు కానీ అనిల్ రావిపూడి  కాంబినేషన్ వలన కామన్ సినీ ప్రేక్షకులందరూ మంచి ఫన్ ఆశిస్తారు, టీం కూడా మస్త్ ఫన్ ఉందనే ప్రమోట్ చేశారు కానీ ఆ ఫన్ అంతగా వర్కౌట్ అవ్వకపోవడంతో ప్రేక్షకులు కొంతవరకూ నిరాశపడతారు. ఇక ఎప్పటిలానే అనిల్ మరోసారి వీక్ క్లైమాక్స్ తో చివర్లో బాగా డిజప్పాయింట్ చేయడం మరో బిగ్ మైనస్. ఓవరాల్ గా పెద్ద కథ కథనాలు ఆశించకుండా టైం పాసయ్యేలా ఈ సంక్రాంతి సీజన్ లో ఓ సారి చూడగలిగే సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.

ఇంటర్వల్ మోమెంట్: హమ్మయ్యా.. మళ్ళీ సినిమాని హై మోమెంట్ కి లేపాడు. సెకండాఫ్ మీద హోప్ ఇచ్చాడు..

ఎండ్ మోమెంట్: సెకండాఫ్ లో అన్ని మోమెంట్స్ బాగానే తీసాడు, క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏంటలా తేల్చేసాడు..

చూడాలా? వద్దా?: మహేష్ బాబు ఫ్యాన్స్ తప్పక చూడచ్చు.

బాక్స్ ఆఫీస్ రేంజ్: 

‘సంక్రాంతి 2020’ సీజన్ లో వచ్చిన మొదటి స్ట్రెయిట్ స్టార్ హీరో ఫిల్మ్ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మరియు సంక్రాంతి సీజన్ వలన మొదటి రోజు ఓపెనింగ్స్ అయితే భీభత్సంగా వస్తాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు.. రెండో రోజు మరో బిగ్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ ఉంది. ఒక వేళ ఈ సినిమా కంటే మించిన సూపర్ హిట్ టాక్ ఆ సినిమాకి వస్తే రెండవ రోజు నుంచి కొంతవరకూ కలెక్షన్స్ కి దెబ్బ ఉంటుంది. అలా అని డ్రాప్ అయిపోవడం ఉండదు. సీజన్ ఎఫెక్ట్ వలన డీసెంట్ గా ఆడేస్తుంది. ఒక వేళ ఆ సినిమా బాలేకపోతే మాత్రం మరోసారి అనిల్ రావిపూడికి సంక్రాంతి బరిలో సుడి తిరిగినట్టే.. ఎలా అయినా సంక్రాంతి సీజన్ కాబట్టి ఆంధ్ర – తెలంగాణ వరకూ ఈ సినిమాకి డోఖా లేదు, కానీ కామెడీ అనుకున్నంత వర్కౌట్ కాకపోవడం, మరీ రెగ్యులర్ మాస్ మసాలా మూవీలానే ఉండడం వలన ఓవర్సీస్ లో, ఓవరాల్ ఇండియాలో మాత్రం బిజినెస్ చేసిన టార్గెట్ ని రీచ్ అవ్వడం కష్టం అని పక్కాగా చెప్పగలం.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 3/5

 

<<<  మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్  >>>

సరిలేరు నీకెవ్వరూ మూవీ యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ప్రత్యేకం గా తెలుగు లో మీకోసం, తప్పక తెలుగు బులెటిన్ పేజీ ని విజిట్ చెయ్యండి..

03:45 AM: సరిలేరు నీకెవ్వరు ఫైనల్ రిపోర్ట్: వెరీ సింపుల్ స్టోరీ లైన్ తో మహేష్ బాబు ప్రెజంటేషన్, ఎలివేషన్ సీన్స్ మరియు కొంత కామెడీ మీద నడిచే సినిమా ఇది. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, స్పెషల్లీ డాన్సులలతో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ ఎలివేషన్స్ సినిమాకి హైలైట్ అయితే వెరీ సింపుల్ స్టోరీ లైన్, పెద్ద కిక్ ఇవ్వని క్లైమాక్స్, అనుకున్న స్థాయిలో కామెడీ వర్క్ అవ్వకపోవడం నిరాశ పరిచే అంశాలు.. అతి త్వరలో పూర్తి రివ్యూ ఇస్తాం..

03:25 AM: విలన్ కి మంచి మార్గాన్ని చూపి, సింపుల్ గా మాటల్తో మార్చి తనతో పాటు కాశ్మీర్ తీసుకెళ్లిపోయారు మన హీరో మహేష్ బాబు అలియాస్ మేజర్ అజయ్ కృష్ణ.. అంతటితో సినిమాకి శుభం కార్డ్..

03:23 AM:  ఫుల్ ఎమోషనల్ టచ్ తర్వాత రిలాక్స్ ఇవ్వడం కోసం మహేష్ బాబు విలన్ అండ్ హీరోయిన్ ఫామిలీ తో చేసే కామెడీ సీఎంస్ కాసింత నవ్విస్తాయి.

03:18 AM: ఆ సెల్యూట్ తో సరిలేరు నీకెవ్వరు యాంతం సాంగ్ మొదలయ్యింది.

03:15 AM: “బాధ్యతైనా, భయమైనా తట్టుకునేది ఒక్క మహిళ మాత్రమే” – విజయశాంతి డైలాగ్ కి ఒక మేజర్ గా సెల్యూట్ చేసే సీన్ అదిరింది.

03:11 AM: మంచి మాస్ సాంగ్ తర్వాత కథ కంప్లీట్ టర్న్ తీసుకొని ఎమోషనల్ జోన్ లోకి వెళ్ళింది. మహేష్ బాబు – విజయశాంతి మధ్య సీన్స్ ఎమోషనల్ గా బాగున్నాయి. ముఖ్యంగా విజయశాంతి గారి ఎక్స్ ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్..

03:08 AM: మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ బాబు లుక్, స్టైల్ అండ్ మ్యానరిజమ్స్ అన్ని ఊర మాస్ అండ్ అన్నిటికంటే మించి ఫాన్స్ పిచ్చ పిచ్చగా గోల చేసేలా డాన్సులు వేసాడు.

03:05 AM: బాబు నువ్వు చెప్పు .. ఏంటి.. వాణ్ణి కొట్టమని డప్పు.. మాస్ ఆడియన్స్ చేత వెర్రెక్కించేలా డాన్సులు చేయించే మైండ్ బ్లాక్ సాంగ్ మొదలైంది.

03:00 AM: పొలిటీషియన్స్ అందరి ముందు క్రైమ్స్ వివరించే సీన్ లో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ వేరియేషన్స్ సింప్లీ సూపర్బ్. థియేటర్ బయటకి వచ్చేసినా ఈ సీన్ లో మహేష్ వేరియేషన్స్ అలా గుర్తుండిపోతాయి.

02:55 AM:  కథలో ట్విస్ట్ లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ, హీరో – విలన్ మధ్య మంచి ఎలివేషన్ సీన్స్ తో, రెండు సూపర్బ్ యాక్షన్ బ్లాక్స్ తో సెకండాఫ్ ని ఆసక్తిగానే వెళ్తోంది.

02:50 AM:  విలన్ అండ్ మినిషార్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ వస్తున్నాయి.

02:45 AM:  విలన్ గ్యాంగ్ మరోసారి అటాక్ అండ్ యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్. నల్లమల ఫారెస్ట్ లో జరిగే ఈ అటాకింగ్ ఫైట్ ని రామ్ – లక్షణ్ మాస్టర్స్ సూపర్బ్ గా కంపోజ్ చేశారు. సినిమా హైలైట్స్ లో ఈ యాక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది.

02:40 AM: మంచి హీరోయిక్ మోడ్ లో కథ వెళ్తుండగా మళ్ళీ హీరోయిన్ రష్మిక ఎంట్రీ.. మళ్ళీ ఒక తరహా కామెడీ సీన్స్ మొదలయ్యాయి.

02:35 AM:  మహేష్ బాబు – ప్రకాష్ రాజ్ మధ్య కొన్ని చాలెంజింగ్ ఎలివేషన్స్ సీన్స్ జరుగుతున్నాయి. ఇవి ఫాన్స్ కి బాగా నచ్చి విజిల్స్ కొట్టిస్తాయి.

02:30 AM: మూవీలో మూడవ పాత ‘సూర్యుడివో చంద్రుడివో’ మొదలైంది.. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చాలా గ్రాండ్ గా షూట్ చేశారు.

02:25 AM: ప్రొఫెసర్ భారతికి మహేష్ బాబు సపోర్ట్ గా నిలబడి ఆమె సమస్యని పరిష్కరించడం మొదలు పెట్టాడు..

02:20 AM: ప్రేక్షకులకి ఓ మరోసారి హై ఇచ్చే సీన్.. విజయశాంతి తో పాటు మహేష్ బాబు విలన్ ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్. బాగుంది అలాగే ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా బాగా షూట్ చేశారు..

02:15 AM: సెకండాఫ్ మొదలు.. మిషన్ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లెమ్ ఏంటో తెలియాలిగా సో ఫ్లాష్ బ్యాక్ టైం.. ప్రొఫెసర్ భారతి అసలు ఏం జరిగింది అనేది మహేష్ బాబు కి నేరేట్ చేస్తోంది..

02:08 AM: సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఓ మంచి మిలిటరీ ఫీల్ తో స్టార్ట్ చేసిన సరిలేరు నీకెవ్వరు లో ట్రైన్ ఎపిసోడ్ రాను రాను కథని పాడుకోబెట్టేసినప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద సినిమాకి మళ్ళీ ఫుల్ హై తీసుకొచ్చి ఆడియన్స్ కి సెకండాఫ్ మీద హోప్ క్రియేట్ చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

హైలైట్స్:

మహేష్ బాబు మ్యానరిజమ్స్ అండ్ కామెడీ టైమింగ్
ఇంట్రడక్షన్ మిలిటరీ ఎపిసోడ్స్
బాగానే పేలిన కొన్ని ట్రైన్ ఎపిసోడ్ బిట్స్
ఇంటర్వల్ బ్లాక్

02:05 AM: చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది – మహేష్ బాబు డైలాగ్ తో యాక్షన్ బ్లాక్ పూర్తయ్యింది అండ్ ఇంటర్వల్.. మంచి హై ఇచ్చి బ్రేక్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

02:00 AM: ప్రకాష్ రాజ్ కి ఎదురు తిరిగిన భారతి అండ్ ఫామిలీని వేసెయ్యడానికి తన గ్యాంగ్ వెంటాడుతోంది.. దొరికారు అనే టైంలో మన హీరో అజయ్ కృష్ణ ఎంట్రీ అండ్ ఫస్ట్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ మొదలైంది. ‘సైరిలేరు నీకెవ్వరు’ టైటిల్ మ్యూజిక్ తో ఫైట్ అదిరిపోయింది.

01:54 AM: ప్రకాష్ రాజ్ విలన్ కానీ ఇతని పాత్ర ద్వారా కూడా కామెడీతో నవ్విస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి..

01:51 AM: హమ్మయ్యా.. ఆ ట్రైన్ ఎపిసోడ్ ముగిసింది. మహేష్ ఫైనల్లీ ప్రొఫెసర్ భారతి ఇంటికి రీచ్ అయ్యాడు.. కానీ ఆమెని చూడగానే ఆమె ఓ పెద్ద సమస్యలో ఉందని గెస్ చేసి సాల్వ్ చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు.

01:48 AM: ఫైనల్లీ సెకండ్ సాంగ్ ‘ హీస్ సో క్యూట్’ టైం.. రష్మిక తన స్టెప్స్ తో అందరినీ ఆకట్టుకుంది. పిక్చరైజేషన్ చాలా లైవ్లీ గా ఉంది.

01:45 AM: మంచి హై పిచ్ లో స్టార్ట్ అయిన ట్రైన్ ఎపిసోడ్ కామెడీ రాను రాను టెంపో తగ్గి బోరింగ్ కి స్టేజ్ కి వచ్చింది. ఇక దీనిని ఫినిష్ చేసే కథని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తే మళ్ళీ కథలో ఊపొచ్చే ఛాన్స్ ఉంది.

01:40 AM: అందరికీ హైప్ క్రియేట్ చేసిన సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ బండ్లన్న అదే మన బండ్ల గణేష్ ఒక దొంగగా తన గ్యాంగ్ తో ట్రైన్ లోకి ఎంట్రీ..

01:34 AM: మొదటి 30 నిమిషాలు చాలా ఇంటెన్స్ గా మహేష్ బాబు హై రేంజ్ ఇంట్రడక్షన్ అండ్ ఎమోషనల్ టచ్ తో ఆడియన్స్ కి ఫుల్ గూస్ బంప్స్ వచ్చాయి. ఆ తర్వాత అనిల్ రావిపూడి కామెడీ స్టార్ట్ అయ్యింది. ట్రైన్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి 30 నిమిషాలయ్యింది. ఫుల్ ఫన్ తో నవ్విస్తూనే ఉన్నారు.. ఇప్పటి వరకూ ట్రైన్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయ్యింది.

01:30 AM: రావు రమేష్ – మహేష్ బాబు సీన్ బాగుంది. అందులో ముఖ్యంగా తన కుమార్తెల ప్రాబ్లెమ్ ని వివరించే విధానం నవ్వులు పూయిస్తుంది.

01:27 AM: మహేష్ ని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని రష్మిక, సంగీత, హరితేజ గ్యాంగ్ చేస్తున్న కామెడీ ఫుల్ గా నవ్వులు పంచుతోంది. ముఖ్యంగా ‘నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ డైలాగ్ టైమింగ్ అయితే అదిరింది.

01:23 AM: రశ్మికతో పాటు ఫామిలీ కూడా మహేష్ బాబుకి ఫ్లాట్..
ఈ అబ్బాయి మన ఇంటి అల్లుడైతే మన ఫ్యూచర్ జెనరేషన్స్ అందంగా ఉంటాయి’ – సంగీత డైలాగ్

01:20 AM: అందరూ పొట్ట పగిలేలా నవ్వడానికి రెడీనా.. సూపర్ హైప్ ఇచ్చిన ఫన్ ట్రైన్ ఎపిసోడ్ టైం.. పెళ్లి నుంచి తప్పించుకొని పారిపోతున్న అమ్మాయి సంస్కృతి పాత్రలో రష్మిక మందన్న ఎంట్రీ.. ‘నీకర్థమవుతుందా’ డైలాగ్ టైమింగ్ మస్త్ చెప్పింది.

01:17 AM: నేను తప్పులే చేస్తాను రెడ్డి, దాన్ని ఎవ్వరైనా రైట్ కొట్టాల్సిందే.. – ప్రకాష్ రాజ్ డైలాగ్..
ఇక్కడ మ్యూజిక్ అదుర్స్..

01:15 AM: కథకి మెయిన్ విలన్ గా కర్నూల్ మినిష్టర్ గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు.. ఫస్ట్ సీన్ లో తనకి ఆపోజిట్ గా దీక్ష చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చే సీన్ అదిరింది. దానికంటే మించి దేవీశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు.

01:10 AM: సూపర్బ్ పంచ్ డైలాగ్స్ తో మిషన్ ఓవర్.. బట్ కథలో చిన్న ట్విస్ట్.. మహేష్ బాబు అండ్ రాజేంద్ర ప్రసాద్ కలిసి రాయలసీమలోని కర్నూల్ కి బయలుదేరారు..

01:07 AM: ఆర్మీలో మహేష్ బాబు అండ్ టీం కి మరో మిషన్.. కిడ్స్ ని రెస్క్యూ చేసే సీన్ సింప్లీ సూపర్బ్. మహేష్ టీంలో కొంతమందికి గాయాలు.. స్పెషల్ గా ఈ సీన్ లో దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. మరీ స్పెషల్ గా మహేష్ రన్నింగ్ షాట్స్ దగ్గర మ్యూజిక్ కి రోమాలు నిక్కబొడుచుకుంటాయి..

01:03 AM: విజయశాంతి వారసుడు పేరు అజయ్, తను కూడా మహేష్ బాబు ట్రూప్ లో వన్ అఫ్ ది సోల్జర్..

01:00 AM:  డాంగ్ డాంగ్ సాంగ్ లో తమన్నాతో కలిసి మహేష్ బాబు డాన్సులు ఇరగదీశాడు.. సింపుల్ స్టెప్స్ అయినప్పటికీ మహేష్ బాబు ఫుల్ గ్రేస్ తో వెయ్యడం ఆడియన్స్ కి మస్త్ ఫీలింగ్ ఇస్తుంది.

12:58 AM: అందరికీ సూపర్ కిక్ ఇచ్చిన ‘డాంగ్ డాంగ్’ సాంగ్ మొదలైంది.. తమన్నా రియల్ లైఫ్ క్యారెక్టర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

12.55 AM: రాజేంద్ర ప్రసాద్ తో మహేష్ బాబు ఫన్ మొదలైందిఅండ్ ఆ ఫన్ మోడ్ లోనే టెర్రరిస్ట్ ని ఎన్ కౌంటర్ చేయడం..

12.50 AM: మేజర్ అజయ్ కృష్ణ గా కాశ్మీర్ లో మహేష్ బాబు ఎంట్రీ అండ్ అజయ్ కృష్ణ టీంకి ఓ బొమ్మే డిఫ్యూజ్ చేయాల్సిన మిషన్.. ఫాన్స్ ఆగకుండా విజిల్స్ కొట్టేలా ఆ ఎపిసోడ్ ని షూట్ చేశారు..

12.45 AM: 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరపై కనిపించనున్న విజయశాంతియా ఇంట్రడక్షన్ తో సినిమా మొదలైంది.. ఓ రౌడీ బాయ్ కి బుద్ధిచెప్పే ప్రొఫెసర్ గా విజయశాంతి ఎంట్రీ..

12. 42 AM: సరికొత్త సూపర్ స్టార్ లోగో తో మహేష్ బాబు పేరు పడింది అండ్ ఫాలోగా టైటిల్ పడింది..

12.40 AM: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 169 నిమిషాల రన్ టైంతో మొదలైంది..

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...
నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత.. నిర్మాత: అనిల్ సుంకర - దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి సినిమాటోగ్రఫీ: రత్నవేలు మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్ ఎడిటర్‌: తమ్మిరాజు రన్ టైం: 2 గంటల 49 నిముషాలు విడుదల తేదీ: జనవరి 11, 2020 'భరత్ అనే నేను', 'మహర్షి' లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు, వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్...మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ