Switch to English

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ రివ్యూ 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, సుశాంత్, నివేత పేతురాజ్, టబు..
నిర్మాత: రాధాకృష్ణ – అల్లు అరవింద్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్
మ్యూజిక్: ఎస్ థమన్
ఎడిటర్‌: నవీన్ నూలి
రన్ టైం: 2 గంటల 45 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 12, 2020

‘జులాయి’, ‘s/o  సత్యమూర్తి’ లతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల వైకుంఠపురములో’. థమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ తో భారీ అంచనాల నడుమ జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. కానీ యుఎస్ లో మొదటిసారి ఫుల్ డే ప్రీమియర్స్ తో ఈ సారి సెన్సేషన్ కి శ్రీకారం చుట్టిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏ రేంజ్ లో ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

వాల్మీకి(మురళి శర్మ) ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ కి పెద్ద పెద్ద కలలు కనే కొడుకు బంటు(అల్లు అర్జున్). వాల్మీకికి బంటు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ తన బాస్ కొడుకు సుశాంత్ అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉండగా, బంటు ఒక జాబ్ లో చేరడం, అక్కడ పూజ హెగ్డే ని చూడడం తనతో ప్రేమలో పడడం అలా అలా జరిగిపోతాయి. కానీ సుశాంత్ ఫాదర్ రామచంద్ర(జయరాం) రూపంలో బంటు ప్రేమకి ఓ సమస్య వస్తుంది. అప్పుడే మెయిన్ విలన్ సముద్రఖని ఎంటర్ అయ్యి కథని మలుపు తిప్పుతాడు. దాంతో కథ మొత్తం రామచంద్ర – టబుల ‘అల వైకుంఠపురములో’ అనే ఇంట్లోకి కథ షిఫ్ట్ అవుతుంది. ఇక ఇక్కడ అన్ని సమస్యలకి సమాధానాలు, అన్ని పాత్రలకి క్లారిటీ రావడం మొదలవుతుంది. అసలు వాల్మీకికి సొంత కొడుకు బంటు అంటే ఎందుకు ఇష్టం లేదు? పూజ బంటు ప్రేమ చివరికి గెలిచిందా? లేదా? అసలు బంటు అల వైకుంఠపురంలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఎంటర్ అయిన పని పూర్తి చేశాడా? లేదా? అన్నదే కథ.

తెర మీద స్టార్స్.. 

మెయిన్ అట్రాక్షన్ అయిన అల్లు అర్జున్ సరికొత్త లుక్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇకపోతే అల్లు అర్జున్ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ మరోసారి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. కానీ అన్నిటికంటే మించి ఇప్పటి వరకూ ఎమోషనల్ గా ఇంత హై ఉన్న పాత్ర చేయలేదు. సో ఎమోషనల్ గా అల్లు అర్జున్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. నెక్స్ట్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నటుడు మురళి శర్మ. తను కూడా ఇలాంటి పాత్ర ఇది వరకూ చేయలేదు. త్రివిక్రమ్ రాసిన పాత్రకి 100% జస్టిఫికేషన్ ఇచ్చాడు. హీరోయిన్ అయినా పూజ హెగ్డే పాత్ర చెప్పుకోదగినది ఏం కాదు. కానీ ఫస్ట్ హాఫ్ లో తన లవ్ ట్రాక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించి కుర్రకారుకి కావాల్సిన నేత్రానందాన్ని అయితే ఇచ్చింది.

ఇక కీలక పాత్రలు చేసిన జయరాం, టబు, సచిన్, రోహిణిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ వచ్చేది ఒక్క సన్నివేశమే అయినా బాగా నవ్విస్తాడు. అలాగే సుశాంత్ ది ముఖ్య పాత్రే అయినా పెద్దగా డైలాగ్స్, చెప్పుకోదగిన పెర్ఫార్మన్స్ ఉండదు. నివేత పేతురాజ్ చిన్న పాత్రలో బాగా చేసింది. నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్ లు అక్కడక్కడా నవ్వించారు. కానీ సునీల్ పాత్రే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఇక తెరమీద త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కామెడీ సీన్స్ అందరినీ నవ్విస్తాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా మనసుకు హత్తుకుంటాయి. సెకండాఫ్ లో వచ్చే స్టార్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఆఫీస్ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ సూపర్బ్.

తెర వెనుక టాలెంట్..  

అల వైకుంఠపురములో సినిమాని ఇద్దరే ఓ అందమైన దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు. వాళ్లే సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. పిఎస్ వినోద్ అయితే ప్రతి షాట్ ని ఓ పికాసో పెయింటింగ్ లా, అలా చూస్తూనే ఉండిపోవాలి అనేలా తీశారు. ఇక ఆ ప్రతి షాట్ కి ఓ అందమైన ఫ్రేమ్ కడితే ఎంత లుక్ వస్తదో అలా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసాడు. ఇక థమన్ పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదనుకుంటా, అంతే బాగా పిక్చరైజేషన్ కూడా ఉంది. రామ్ – లక్షణ్ మాస్టర్స్ ఊర మాస్ గానే కాదు సూపర్ స్టైలిష్ గా కూడా యాక్షన్ చేయిస్తారని ప్రూవ్ చేసే సినిమా ఇది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. మరీ 165 నిమిషాల రన్ టైం భరించడం కాస్త కష్టతరమే. ఇక ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్సెట్స్ అండ్ సెటప్స్ సూపర్బ్ ఉన్నాయి.

ఇక మాటల మాంత్రికుడు అలియాస్ గురూజీ అలియాస్ త్రివిక్రమ్ గారి దగ్గరికి వస్తే.. కథ కోసం ఎంచుకున్న పాయింట్ ని అండర్ కరెంట్ గా చెప్పడానికి ప్రయత్నించాడు, అందుకే చెప్పాలనుకున్న పాయింట్ పర్ఫెక్ట్ గా రీచ్ కాలేదు. కథగా డెవలప్ చేసినప్పుడు కూడా ఆయన పాత చిత్రాలలానే రాసుకున్నారు. చాలా సీన్స్ ఆయన గత సినిమాలలోని సీన్స్ ని గుర్తు చేస్తాయి. ఇక కథనం కూడా అంత వేగంగా లేకుండా స్లోగా ఉండడం వలన కొన్ని సార్లు బోరింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అసలు కథలోకి వెళ్ళకపోవడం వలన స్లో అనిపిస్తుంది. దానికి తోడు మూవీ లెంగ్త్ కూడా సమస్య అయ్యింది. డైరెక్టర్ గా ఆయన స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకొని ఒక డీసెంట్ ఫామిలీ ఎంటర్టైనర్ అయితే తీశారు. కానీ ఇది ఈయన ది బెస్ట్ వర్క్ లో కాదు గుడ్ వర్క్ లో చెప్పుకునే సినిమా. హారిక హాసిని క్రియేషన్స్ – గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ డిజైనింగ్ సూపర్బ్.

విజిల్ మోమెంట్స్:  

– త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కామెడీ
– మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్
– అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్
– స్టార్ హీరోస్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ లో చేసే ఆఫీస్ సీన్ ఫుల్ గా నవ్విస్తుంది.
– ఎంగేజింగ్ గా సాగే సెకండాఫ్
– థమన్ మ్యూజిక్ అండ్ పిఎస్ వినోద్ విజువల్స్

బోరింగ్ మోమెంట్స్:  

– స్లోగా అండ్ ఊహాజనితంగా సాగే కథనం
– ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం
– కొన్ని సీన్స్ ఆయన గత సినిమాని గుర్తు చేయడం – సినిమా లెంగ్త్

విశ్లేషణ: 

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘అల వైకుంఠపురములో’ అనగానే భారీ అంచనాలు లున్నాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో లేదు, అలాగని బ్యాడ్ గానూ లేదు. కాస్త లాగ్ తట్టుకోగలిగితే ఓ మంచి సినిమా. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా రావడం, అది కూడా క్లాస్ గా సాగే హ్యాపీ ఫామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సంక్రాంతికి అందరు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి ఇష్టపడతారు. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేసేసాడు. ఓ లౌడ్ కామెడీ, ధనా ధన్ అనే ఫైట్స్ కాకుండా సింపుల్ క్లాస్ గా ఉండే సినిమా చూడాలనుకునే వారు ఫ్యామిలీతో సహా చూడచ్చు.

ఇంటర్వల్ మోమెంట్: నవ్వులున్నాయి, కథేది.. సెకండాఫ్ లో అన్నా చెప్పండి..

ఎండ్ మోమెంట్: ఫీల్ గుడ్ ఎమోషన్ తో నవ్వించి పంపడం త్రివిక్రమ్ గారికే సాధ్యం.

చూడాలా? వద్దా?: ఫామిలీతో చూడచ్చు..

బాక్స్ ఆఫీస్ రేంజ్:  

‘అల వైకుంఠపురములో’ సినిమా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి సంక్రాంతికి ఇంటిల్లిపాది నవ్వుకుంటూ, మన బాంధవ్యాలని గుర్తు చేసుకుంటూ, ఓ ఎమోషనల్ కనెక్ట్ తో సాగే సినిమాలు చూడాలనుకుంటారు. అలాంటి వారికి సంక్రాంతి సీజన్ లో ఇది పర్ఫెక్ట్ కావున వసూళ్లు కూడా స్ట్రాంగ్ గానే వస్తాయి. ఇప్పటికే అల్లు అర్జున్ మొదటి రోజు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సీజన్ కారణంగా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 3/5

 

<<<<   అల వైకుంఠపురములో యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్   >>>>

 

‘అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ 8:30 నిమిషాలకి మొదలు కానున్నాయి. ప్రత్యేకంగా తెలుగులో మీకోసం.. తప్పక తెలుగు బుల్లెటిన్ పేజీని విజిట్ చెయ్యండి..

11:30 PM: ‘అల వైకుంఠపురములో’ ఫైనల్ రిపోర్ట్:

త్రివిక్రమ్ మరోసారి తను బాగా స్ట్రాంగ్ అయిన ఎమోషనల్ కామెడీ పంథాలో చేసిన సినిమానే ‘అల వైకుంఠపురములో’. అల్లు ర్జున్ పెర్ఫార్మన్స్, త్రివిక్రమ్ మార్క్ కామెడీ అండ్ ఎమోషన్, అలాగే క్లాసికల్ పిక్చరైజేషన్ అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ సినిమాకి స్పెషల్ హైలైట్స్. కామెడీ బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా లేకపోవడం వలన కాస్త స్లో అనిపిస్తుంది కానీ అసలు కథ, మేజర్ ఎలిమెంట్స్, యాక్షన్ అండ్ ఎమోషన్స్ అన్ని కలిపి సెకండాఫ్ ని ఆసక్తికరంగా నడిపించాడు. సో సినిమా అయ్యేటప్పటికి పెదవుల మీద నవ్వులతో, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తాం.

11:24 PM: మనసుకు హత్తుకునే మంచి ఎమోషనల్ క్లైమాక్స్ తర్వాత, ఎప్పటిలానే అందరి పెదవులపై నవ్వులతో ఒక చిన్న కామెడీ సీన్ తో సినిమాని ముగించారు. శుభం..

11:20 PM: త్రివిక్రమ్ మార్క్ ఎమోషనల్ క్లైమాక్స్ స్టార్ అయ్యింది.

11:15 PM: సచిన్ పాత్ర ద్వారా కథలో దాచిపెట్టిన ట్విస్ట్ ని రివీల్ చేశారు. కొంచం ఎమోషనల్ టచింగ్ సీన్స్ జరుగుతున్నాయి.

11:10 PM: హీరోయిజం టైం.. స్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ తో త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా ట్రై చేసిన ఫైట్ ఎపిసోడ్ జరుగుతోంది.

11:07 PM: మరోసారి విలన్ తనకి కావాల్సిన దానికి కోసం నివేత పేరురాజ్ ని కిడ్నాప్ చేసి జయరాం ని బెదిరించే సీన్స్ జరుగుతున్నాయి.

11:03 PM: ఫుల్ జోష్ అండ్ కలర్ఫుల్ సాంగ్ తర్వాత కథ ఎమోషనల్ మోడ్ లోకి వెళ్ళింది. మురళి శర్మ – అల్లు అర్జున్ మధ్య ఊహించని మలుపు. దాంతో కథ ప్రీ క్లైమాక్స్ లోకి ఎంటర్ అయ్యింది.

11:00 PM: ఫ్యామిలీ లోని అందరి బ్యాక్ డ్రాప్ లో సాగే రాములో రాముల పాట పిక్చరైజేషన్ బాగుంది. అల్లు అర్జున్ గ్రేస్ఫుల్ స్టెప్స్ విజిల్స్ కొట్టిస్తాయి.

10:55 PM: ఆల్బమ్ లోని మరో 100మిలియన్ సాంగ్ ‘రాములో రాముల’ టైం.. థియేటర్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

10:50 PM: బాహుబలి, గబ్బర్ సింగ్ లోని పిల్లా మొదలైన సాంగ్స్ ని వాడుకుంటూ అల్లు అర్జున్ ఆఫీస్ లో చేసిన సీన్స్ కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది.

10:45 PM: జయరాం – టబు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కథకి చాలా వసరం కానీ కొంత భాగం సాగదీసినట్టు ఉంది. అలాగే సచిన్ యాక్టింగ్ ఈ సీన్ లో చాలా బాగుంది.

10:40 PM: హౌస్ సీన్స్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది.

10:35 PM: సెకండాఫ్ లో స్టోరీ లోకి అందుకొని స్పీడ్ గా వెళ్తోంది. కథ మొత్తం అల వైకుంఠపురములో హౌస్ మరియు ఆఫీస్ లో జరుగుతోంది. ఆ సీన్స్ అన్ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశారు.

10:28 PM: టబు మామగారు విలన్ పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యే టైంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు.

10:22 PM: స్టార్ కమెడియన్ సునీల్ నివేత పేతురేజ్ మేనమామగా కథలోకి ఎంట్రీ..

10:18 PM: ఫైనల్ గా మన హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.. ఫుల్ హైప్ వచ్చిన ‘అల వైకుంఠపురములో’ టైటిల్ సాంగ్ మొదలైంది.

10:15 PM: డాక్టర్ గా వెన్నెల కిషోర్ ఎంట్రీ.. పక్కాగా వెన్నెల కిషోర్ సీన్స్ కి పడి పడి నవ్వుకుంటారు.

10:13 PM:సెకండాఫ్ త్రివిక్రమ్ మార్క్ కామెడీ సీన్స్ తో మొదలైంది. కానీ అండర్ కరెంట్ గా అల్లు అర్జున్ – మురళి శర్మ మధ్య ఓ సమస్య నడుస్తోంది.

10:05 PM: అల వైకుంఠపురములో ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: కంప్లీట్ త్రివిక్రమ్ స్టైల్ లో సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా సాగింది. ఫస్ట్ హాఫ్ లో కథ పరంగా చాలా సింపుల్ కానీ కామెడీ, నటీనటుల పెర్ఫార్మన్స్, పిక్చరజేషన్ మరియు బ్యూటిఫుల్ సాంగ్ తో చాలా ఫ్రెష్ గా ఉంది. హాయిగా అనిపించిన ఫస్ట్ హాఫ్ కి సెకండాఫ్ లో రివీల్ అయ్యే అసలు కథే కీలకం కానుంది.

హైలైట్స్ :

  • అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్
  • కామెడీ సీన్స్
  • త్రివిక్రమ్ క్లాస్ టేకింగ్
  • ఎమోషనల్ ప్రీ ఇంటర్వల్ బ్లాక్

10:02 PM: ఒక హై ఎమోషనల్ మోమెంట్ తో ‘అల వైకుంఠపురములో’కి కాసేపు విరామం.

09:59 PM:  ఓ మేజర్ రహస్యం గురించి తెలుగుకున్నాక అల్లు అర్జున్ ఎమోషనల్ అవుతూ చేసిన పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఆ సీన్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది.

09:54 PM: ఆ టైంలో సముద్రఖని నుంచి అల్లు అర్జున్ – పూజ అహెగ్దే జయరాం ని సేవ్ చేస్తారు. కథలోని ఒక మేజర్ ట్విస్ట్ రివీల్ అయ్యింది.

09:52 PM: కథలో మెయిన్ విలన్ సముద్రఖని ఎంట్రీ.. కథలోకి రావడమే జయరాం కంపెనీలో వాటా కోసం పెద్ద గొడవ. ఒక్కసారిగా కథ సీరియస్ అయ్యింది.

09:49 PM: టీజర్ సాంపిల్ తో హైప్ పెంచిన బుట్ట బొమ్మ సాంగ్ టైం. అల్లు అర్జున్ మరోసారి తన స్టైలిష్ స్టెప్స్ తో మేజిక్ చేస్తున్నాడు.

09:45 PM: రాజేంద్ర ప్రసాద్ గారి సెటిల్ మెంట్ సీన్ అందరినీ చాలా బాగా నవ్వించింది.

09:40 PM: సుశాంత్ మరదలిగా నివేత పేరురాజ్ ఎంట్రీ.. సుశాంత్ – పూజ హెగ్డే ఎంగేజ్ మెంట్ లో నివేత చాలా వర్రీ అవుతున్న సీన్స్ జరుగుతున్నాయి.

09:36 PM: పూజ హెగ్డే ని ఒక బిజినెస్ డీల్ లో చూసిన జయరాం తన కుమారుడు సుశాంత్ కి తనతో పెళ్లి జరిపించాలని అనుకుంటాడు.

09:33 PM: దాదాపు గంట సినిమా పూర్తయ్యింది.. ఇప్పటి వరకు స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంది, కానీ త్రివిక్రమ్ తన కామెడీ అండ్ స్క్రీన్ ప్లే మేజిక్ తో అలా తీసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకూ గ్రేట్ అనేలా లేకపోయినా, బోరింగ్ లేకుండా గుడ్ అనేలా వెళ్తోంది.

09:30 PM: సాంగ్ తర్వాత అల్లు అర్జున్ – పూజ కలిసి చేసే బిజినెస్ డీలింగ్ సీన్స్ చాలా బాగున్నాయి.

09:26 PM: ఆడియో లానే ‘సామజవరగమన’ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఓ మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. పూజ హెగ్డే చాలా బ్యూటిఫుల్ గా, ముద్దుగా ఉంది. అల్లు అర్జున్ సింపుల్ స్టెప్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఓవరాల్ గా పారిస్ లో షూట్ చేసిన ఈ సాంగ్ పాట లానే విజువల్ గా కూడా వావ్ అనిపించుకుంది.

09:22 PM: అల్లు అర్జున్ అండ్ గ్యాంగ్ చేసిన కొన్ని కామెడీ సీన్స్ సందర్భం నుంచి ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ సాంగ్ మొదలైంది.

09:18 PM: మొదట పూజ ఎవరని తెలియక జోక్స్ వేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత బాస్ అని తెలిసి షాక్ అవుతాడు. నవదీప్, రాహుల్ రామకృష్ణ అండ్ అల్లు అర్జున్ పనిచేసే కంపెనీకి పూజ హెగ్డే బాస్..

09:14 PM: నవదీప్ ట్రావెల్ కంపెనీలో అల్లు అర్జున్ జాబ్ లో జాయిన్ అయ్యాడు.. అక్కడ పూజ హెగ్డే ఎంట్రీ.. పూజ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

09:10 PM: ఓ మై గాడ్ డాడీ – వెరీ స్టైలిష్ సాంగ్. సింపుల్ డాన్స్ మూవ్స్ తో అల్లు అర్జున్, పిక్చరైజేషన్ తో త్రివిక్రమ్ అదరగొట్టారు.

09:07 PM: మురళి శర్మ అల్లు అర్జున్ తన కొడుకు కాదు అన్నట్లు బిహేవ్ చేసే సీన్స్ లో ఇద్దరి మధ్యా ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. దాంతో సినిమాలో మొదటి సాంగ్ ‘ఓ మై గాడ్ డాడీ’ మొదలైంది..

09:05 PM: త్రివిక్రమ్ గారి సూపర్ స్టైలిష్ అండ్ క్లాస్ మేకింగ్ మరియు సూపర్బ్ ఫన్ టైమింగ్ ఉన్న డైలాగ్స్ అదిరిపోయాయి. హీరో ఎంట్రీ నుంచి అన్ని సీన్స్ అందరినీ బాగా నవ్విస్తున్నాయి.

09:02 PM: మొదట బంటు పేరుతో అల్లు అర్జున్ ఎంట్రీ చాలా సింపుల్ గా జరిగింది.. ఇప్పుడు హీరోకి ఎలివేషన్.. నవదీప్ అండ్ గ్యాంగ్ తన చెల్లిని ఏడిపించడంతో స్టైలిష్ ఫైట్ తో అల్లు అర్జున్ మరోసారి ఎంట్రీ ఇచ్చాడు.

08:58 PM: మురళీశర్మకి తన సొంత కుమారుడు అల్లు అర్జున్ కంటే తాను పనిచేసే చోట పెరుగుతున్న రామచంద్ర కొడుకు సుశాంత్ అంటే ప్రేమ ఎక్కువ.

08:54 PM: 20 ఏళ్ళ తర్వాత కథ ఓపెన్ అయ్యింది.. పుట్టిన పిల్లలు హీరోలుగా ఇంట్రడ్యూస్ అయ్యే టైం..

08:52 PM: మురళీశర్మ వైఫ్ గ రోహిణి, టబు భర్తగా జయరాం మరియు జయరాం మామయ్యాగా సచిన్ ఎంట్రీలు జరిగాయి.

08:49 PM: మురళీశర్మ వైఫ్ అండ్ టబు ఒకేసారి డెలివరీ కోసం హాస్పిటల్ లో చేరారు.. కానీ బిగ్గెస్ట్ బాడ్ న్యూస్ ఫర్ టబు. ఇక్కడ మురళి శర్మ టబు – రామచంద్రల కోసం ఎవరూ ఊహించని త్యాగం చేస్తారు.

08:45 PM: ఫైనల్లీ 165 నిమిషాల రన్ టైంతో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ వరల్డ్ వైడ్ ఫస్ట్ ప్రీమియర్ మొదలైంది. ఓపెన్ చేస్తే.. మురళి శర్మ హాస్పిటల్ కి కంగారుగా పరిగెత్తుకొచ్చే సీన్ మీద ఓపెన్ అయ్యింది..

08:43 PM: నితిన్ ‘భీష్మ’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ మరియు శర్వా – సమంతల ‘జాను’ టీజర్స్ ని ఆలా వైకుంఠపురములో యుఎస్ ప్రీమియర్స్ కి యాడ్ చేశారు.

08:40 PM: గురూజీ సినిమాకి యుఎస్ ఫాన్స్ అంటా వెయిటింగ్.. థియేటర్ మొత్తం హౌస్ ఫుల్ అండ్ ఫాన్స్ ఆల్రెడీ రచ్చ చేయడం మొదలు పెట్టేసారు.

‘యు/ఏ’ సర్టిఫికేట్ తో 2 గంటల 45 నిమిషాల నిడివితో కూడిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్..

లైవ్ అప్ డేట్స్ : అల వైకుంఠపురములో యుఎస్ ప్రీమియర్ షో

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...
నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, సుశాంత్, నివేత పేతురాజ్, టబు.. నిర్మాత: రాధాకృష్ణ - అల్లు అరవింద్ దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్ మ్యూజిక్: ఎస్ థమన్ ఎడిటర్‌: నవీన్ నూలి రన్ టైం: 2 గంటల 45 నిముషాలు విడుదల తేదీ: జనవరి 12, 2020 'జులాయి', 's/o  సత్యమూర్తి' లతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన...అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ