Switch to English

రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి..
నిర్మాత: ఎన్వీ ప్రసాద్ అండ్ లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
మ్యూజిక్: అనిరుధ్
ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్
రన్ టైం: 2 గంటల 39 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 09, 2020

ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మొదటి కాంబినేషన్ లో రూపొందిన ‘దర్బార్’ సినిమా నేడు 5 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. ‘ఐ యామ్ ఎ బాడ్ కాప్’ అంటూ ట్రైలర్ తోనే అందరినీ ఆకర్షించిన దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ 7,000 స్క్రీన్స్ లో రిలీజయింది. రజినీ ఫాన్స్ అంతా చాలా రోజుల నుంచి ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్. మరి ఆ కోరికని తీర్చే రేంజ్ లో ఉందో? లేదో? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ముంబై లోని మాఫియా, డ్రగ్స్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్న అన్ని గ్యాంగ్స్ ని క్లీన్ స్వీప్ చేసే పనిలో ఉంటాడు మన బ్యాడ్ కాప్ ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్). ఈ విషయంలో పై అధికారులు ఎలాంటి నిబంధనలు పెట్టినా వారినే ఎదిరించింది కేసులు ఫినిష్ చేస్తుంటాడు. అలా ఓ డ్రగ్ మాఫియాకి చెందిన విక్కీ మల్హోత్రా(ప్రతీక్ బబ్బర్)ని అరెస్ట్ చేస్తాడు. అక్కడ ఆదిత్య అరుణాచలంకి అనుకోని అతిథిలా విలన్ సునీల్ శెట్టి ని ఢీ కొట్టే సందర్భం వస్తుంది. ఇక వారిద్దరి మధ్యా జరిగిన నువ్వా – నేనా అనే పోరులో విజయం పోలీసులదా? లేక విలన్ దా? అసలు రజినీకాంత్ అంత బాడ్ కాప్ గా మారడానికి కారణం ఏంటి? సునీల్ శెట్టిని ఢీ కొట్టడంలో రజినీకాంత్ ఏమేమి కోల్పోయాడు? ఎలా కౌంటర్ అటాక్ చేసాడు? అనేదే ‘దర్బార్’ కథ.

తెర మీద స్టార్స్..

ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ బొమ్మ.. అనుకున్నట్టుగానే రజినీకాంత్ తెరపై అదరగొట్టాడు. సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకూ ఆయనదే మానియా అంతా.. అలాగే సీన్ టు సీన్ ఎలివేషన్ లాగే ప్లాన్ చేశారు. ప్రతి సీన్ లో రజినీకాంత్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మెయిన్ గా ఒక 25 ఇయర్స్ బ్యాక్ మంచి ఏజ్ లో ఉన్నప్పుడు చూసిన వింటేజ్ రజినీని చూస్తున్నాం అనే ఫీల్ లో ఉంటాం. రజినీకాంత్ తప్ప వేరెవ్వరూ చెయ్యలేరు అనిపించేలా పాత్రలో జీవించారు. రజినీ తర్వాత నివేత థామస్ నటనకి మంచి మార్కులు కొట్టేసింది. ఎమోషనల్ సీన్స్ లో తన నటన సూపర్బ్. ఇక నయనతారకి ఇందులో చేయడానికి పెద్ద రోల్ లేదు, కానీ ఉన్నంతలో బాగా చేసింది, అలాగే బ్యూటిఫుల్ గా ఉంది.

విలన్ గా సౌత్ కి పరిచయం అయినా సునీల్ శెట్టి రియల్ అండ్ క్రూయల్ డాన్ ని మరిపించేలా చేసాడు. అలాగే ప్రతీక్ బబ్బర్ కూడా చాలా బాగా చేసాడు. యోగిబాబు – నయనతార – రజినీకాంత్ ట్రాక్ ప్రేక్షకులని నవ్విస్తుంది.

తెర వెనుక టాలెంట్..

సినిమా అవ్వగానే మనతో ట్రావెల్ అయ్యే వాటి పరంగా చూసుకుంటే.. అనిరుధ్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాలి.. సినిమా మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని హుక్ చేస్తుంది. ప్రతి ఎలివేషన్ సీన్ లోనూ రోమాలు నిక్కబొడుచుకునేలా మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ మొదట్లో డిఫరెంట్ గా ఉండడం కోసం రాప్ స్టైల్ లో చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సింప్లీ సూపర్బ్. సౌండ్ డిజైనింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అలాగే సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ మేజిక్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఫ్రేమ్స్ ని చాలా డిఫరెంట్ గా, సూపర్బ్ గా డిజైన్ చేసారు. అలాగే రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ అండ్ పీటర్ హెయిన్ డిజైన్ చేసి కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ అన్నీ ప్రేక్షకులకి ఫుల్ హై ఫీలింగ్ ఇస్తాయి. స్పెషల్ గా ఇంట్రడక్షన్, రైల్వే స్టేషన్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అదిరిపోయాయని చెప్పాలి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఎంగేజింగ్ గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ గా ఉంటుంది, సెకండాఫ్ అక్కడక్కడా స్పీడ్ తగ్గినట్లు ఉంటుంది.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ ఏఆర్ మురుగదాస్ విషయానికి వస్తే.. స్టోరీ లైన్ చాలా సింపుల్ గా తీసుకున్నారు, రజినీకాంత్ చరిష్మా అండ్ పోలీస్ పాత్ర డిజైనింగ్ మీదే సినిమాని తీసుకెళ్లిపోయారు. అందుకే ఓవరాల్ గా చూస్తే కథలో పెద్ద కంటెంట్ ఉండదు. అందులో ఒక ‘ఇండియాలో జరుగుతున్న సెక్స్ క్రైమ్స్’ అనే సోషల్ పాయింట్ మీద కథ స్టార్ట్ చేసి సెకండాఫ్ ని రివెంజ్ గా మార్చేయడం వలన కథ అంతగా మెప్పించదు. అందుకే ఆయన స్క్రీన్ ప్లే లో చాలా జాగ్రత్తలు తీసుకొని సూపర్ స్పీడ్ తో ఉండేలా చూసుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లో అది బాగా హెల్ప్ అయ్యింది కానీ సెకండాఫ్ లో అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే సెకండాఫ్ లో రజినీ – నివేత థామస్ మధ్య ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వలేదు. తమిళ్ వారికి బెటర్ అనిపించవచ్చు, డబ్బింగ్ మహత్యం వల్ల తెలుగులో బాగా బోరింగ్ గా అనిపిస్తాయి. ఇక డైరెక్టర్ గా రజినీ ఫాన్స్ ని 100% సంతృప్తి పరుస్తాడు కానీ మిగతా ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయాడు. లైకా ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ రిచ్ వాల్యూస్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి.

విజిల్ మోమెంట్స్:

– వింటేజ్ ఫీల్ తో సాగే రజినీకాంత్ వన్ మాన్ షో
– ఫ్లాష్ బ్యాక్ మొదటి 20 నిముషాలు
– ఆడియన్స్ ని థ్రిల్ చేసే ప్రీ ఇంటర్వల్ అండ్ ఇంటర్వల్ బ్లాక్
– సెకండాఫ్ లో ట్రాన్స్ జెండర్ సాంగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్
– రామ్ – లక్షణ్ యాక్షన్ కొరియోగ్రఫీ
– అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– విజిల్ కొట్టించే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్

బోరింగ్ మోమెంట్స్:

– కథలో పెద్దగా కిక్ లేకపోవడం
– ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొంత బోరింగ్ గా సాగడం
– దర్బార్ కి కీ ఎలిమెంట్ అయిన రజినీ – నివేత ఎమోషనల్ ఎపిసోడ్స్ కనెక్ట్ కాకపోవడం.
– సెకండాఫ్ స్లో అవ్వడం
– రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

విశ్లేషణ:

రజినీకాంత్ – ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్, అందులోనూ ఇదొక కాప్ థ్రిల్లర్ అనగా అటు ఫాన్స్ లో ఇటు సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. దర్బార్ చూసాక అభిమానుల అంచనాలైతే నిజమయ్యాయి, వాళ్ళు హ్యాపీ కూడాను, కానీ తెలుగు సినీ అభిమానులకి మాత్రం ఇన్ని రోజులుగా రజినీ సినిమాల్లో మిస్ అవుతున్న కథ, స్ట్రాంగ్ సెకండాఫ్ కొరత మళ్ళీ దర్బార్ లో కనిపించిందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం కీలకమైన ఎమోషనల్ పాయింట్ ని రియలిస్టిక్ గా చూపించడం వలన తమిళ్ వాళ్ళకి నచ్చే అవకాశముంది, కానీ తెలుగు వారికి పెద్దగా నచ్చదు. అలాగే తీసుకున్న పాయింట్ ని పక్కన పెట్టేసి సెకండాఫ్ లో కంప్లీట్ రివెంజ్ మీదకి వెళ్లినట్టు చూపించడం అనేది కూడా కథకి కాస్త డిస్కనెక్ట్ లా అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి రజినీకాంత్ అభిమానులు బాగా ఎంజాయ్ చేసే సినిమా ‘దర్బార్’, అలాగే మాంచి రోమాలు నిక్కబొడుచుకునే ఎలివేషన్స్ తో కూడిన కమర్షియల్ సినిమా చూడాలనుకునే కామన్ ఆడియన్స్ కూడా ఒకసారి చూడచ్చు.

ఇంటర్వల్ మోమెంట్: సూపర్ హ్యాపీ.. పరిగెత్తి పాప్ కార్న్ తెచ్చుకొని, వెయ్యండి సెకండాఫ్, వెయిటింగ్.!

శుభం కార్డ్ మోమెంట్: అబ్బా.. రజినీ మళ్ళీ అదరగొట్టాడు కానీ కథలోనే మళ్ళీ ఎదో మిస్సింగ్.

చూడాలా? వద్దా?: రజినీకాంత్ ఫ్యాన్స్ డోంట్ మిస్ ‘దర్బార్’.

బాక్స్ ఆఫీస్ రేంజ్:

సంక్రాంతి బరిలో నిలిచిన మొదటి సినిమా ‘దర్బార్’. ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపించుకుని సెకండాఫ్ యావరేజ్ అనిపించుకుంది. ఓవరాల్ ఆబో యావరేజ్ టు హిట్ టాక్ మధ్యలో ఉంటుంది. దీనికి పండుగ సీజన్, అలాగే పెద్ద సినెమాలకేనట ముందు రెండు రోజులు సోలో రిలీజ్ కాబట్టి కలెక్షన్స్ కి మాత్రం ఏం డోఖా ఉండదు. 14.5 కోట్లకి తెలుగు రైట్స్ అమ్ముడు పోయాయి. మొదటి రోజు భారీ రిలీజ్ వలన 7-8 కోట్ల షేర్ ని అంచనా వేస్తున్నారు. రెండవ రోజు తగ్గినా 60% హోల్డ్ అయితే ఉంటుంది. దీని ప్రకారం ఈ సంకరుణాతి రేసులో పక్కాగా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం 80% ఉంది. రాబోయే సినిమాలు భీభత్సముగా ఉంటే ఆ 20% పఎఫెక్ట్ ఉంటుంది. అవి అటు ఇటు అయితే మళ్ళీ ఈసినిమాకి హెల్ప్ అయ్యే అవకాశము ఉంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

 

<<—— రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ——>>

 

రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ స్పెషల్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా తెలుగులో జనవరి 9న ఉదయం 8 గంటలకి ప్రారంభం అవుతాయి. తెలుగుబుల్లెటిన్.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

సెకండాఫ్ రిపోర్ట్:

గుడ్:

-రజినీకాంత్ కిల్లర్ ఛాలెంజింగ్ సీన్స్
-మాస్ ని మెప్పించే రెండు ఫైట్ సీక్వెన్స్ లు
-ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్

బ్యాడ్:

అనుకున్న ఎమోషనల్ సీన్స్ పెద్దగా మెప్పించలేకపోవడం వలన సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది.

ఓవరాల్ గా అక్కడక్కడా తగ్గినా రజినీకాంత ఫాన్స్ కి మాత్రం ఈ సంక్రాంతి మరింత మాస్ గా జరుపుకునేలా చేసిన సినిమా ‘దర్బార్’

10.50 AM: మూవీ చివరి అంకానికి చేరుకుంది.. రజినీకాంత్ – సునీల్ శెట్టి మధ్య మాన్ టు మాన్ ఫైట్.. చాలా హీరోయిక్ గా యాక్షన్ బ్లాక్ కంపోజ్ చేశారు.

10.40 AM: రజినీకాంత్ – సునీల్ శెట్టి మధ్య జరిగిన ప్రీ క్లైమాక్స్ చాలఎంజింగ్ సీన్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది.

10.35 AM: సునీల్ శెట్టి రజినీ అండ్ పోలీస్ లకి భయం పుట్టేలా చేయాలని బౌంటీ హంటర్స్ కి పోలీసుల బ్యాడ్జ్ తీసుకొచ్చిన వాళ్ళకి భారీ అమౌంట్ అని ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు అటాక్ ఎటు నుంచి వస్తుందో తెలియదు.. రజినీ ఇంటరెస్టింగ్ ప్లాన్ తో క్లైమాక్స్ కి దగ్గరవుతోంది.

10.25 AM: ఎమోషనల్ కంటెంట్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వకపోవడం వలన సెకండాఫ్ కాస్త డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ ఉంది.

10.20 AM: నివేత – రజినీకాంత్ మధ్య ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి. ఈ సీన్స్ లో నివేత ఇచ్చిన క్లూస్ ఆధారంగా రజినీకాంత్ మెయిన్ విలన్ ని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాడు.

10.15 AM: మెయిన్ విలన్ సునీల్ శెట్టి అండ్ గ్యాంగ్ రజినీకాంత్ మీద అటాక్ చేసే సీన్స్ జరుగుతున్నాయి. ఇక రజినీ రివెంజ్ మిగిలి ఉంది.

10.05 AM: ఆ మెంటల్ డిస్టర్బన్స్ వలన రజినీకాంత్ ఓ మాడ్ అండ్ బ్యాడ్ కాప్ లా మారి జాలి లేకుండా ఎం కౌంటర్లు చేస్తుంటాడు. దీనితో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.

10.00 AM: రజినీకి ఎమోషనల్ గా తగిలిన దెబ్బ వలన మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిన సీన్స్ జరుగుతున్నాయి.

09.55 AM: రజినీకాంత్ – నివేత థామస్ మీద కొన్ని ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి. అనుకున్నది సరిగా చెప్పలేదు. ఇంకాస్త బెటర్ గా సీన్స్ డిజైన్ చేసుకోవాల్సింది.

09.50 AM: ట్రాన్స్ జెండర్ మీద వచ్చే ఓ సాంగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎపిసోడ్ జరుగుతోంది.. మాస్ ఫాన్స్ అంతా విజిల్స్ కొట్టేలా ఈ ఫైట్ ని పిక్చరైజ్ చేశారు.

09.44 AM: తనకి కౌంటర్ ఇచ్చిన ఆ బ్యాడ్ కాప్ అంతం చూడడం కోసం ఇంటర్నేషనల్ డాన్ సునీల్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు.

09.40 AM: ఓ వెడ్డింగ్ పార్టీ సాంగ్ తో సెకండాఫ్ మొదలైంది. కపుల్ కోసం చెప్పిన రజినీ మార్క్ డైలాగ్స్ బాగున్నాయి.

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: రజినీకాంత్ వన్ మాన్ షో అండ్ ఏఆర్ మురుగదాస్ మార్క్ ఇంటెలిజెంట్ సీన్స్ ఆడియన్స్ ని హుక్ చేస్తాయి.

హైలైట్స్ :

– రజినీకాంత్ కిల్లర్ పెర్ఫార్మన్స్
– ఏఆర్ మురుగదాస్ ఇంటెలిజెంట్ సీన్స్
– అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– రజినీ క్యారెక్టర్ డిజైనింగ్
– యాక్షన్ బ్లాక్స్
– ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్స్

సెకండాఫ్ లో మేజర్ స్టోరీ రివీల్ కానుంది..

09.35 AM: రజిని – సునీల్ శెట్టి మధ్య చాలెంజింగ్ సీక్వెన్స్ తో, ట్రైలర్ లోని కిల్లర్ డైలాగ్ ‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్’ తో ఇంటర్వెల్ బ్లాక్..

09.30 AM: మరో అదిరిపోయే ట్విస్ట్ తర్వాత సినిమా హీరో – విలన్ ఫైట్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యింది.. కథలోకి మెయిన్ విలన్ సునీన్ శెట్టి ఎంట్రీ..

09.23 AM: ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏఆర్ మురుగదాస్ రైటింగ్ టాలెంట్ మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ఉంది. అజయ్ మల్హోత్రాని బయటకి రప్పించడానికి రజినీ వేసిన ఇంటెలిజెంట్ ప్లాన్ అదుర్స్..

09.15 AM: అజయ్ మల్హోత్రా కేసు సాల్వ్ చేసే టైం లో అదిరిపోయే ట్విస్ట్.. రజినీకి షాక్.. ఈ సీన్ తర్వాత రజినీ కేసుని మరింత సీరియస్ అండ్ చాలెంజింగ్ గా తీసుకుంటాడు.. ఇప్పుడే టీజర్ డైలాగ్ ‘ పోలీసోడికి లెఫ్ట్ లో రావచ్చు.. రైట్ లో రావచ్చు.. కానీ స్ట్రైట్ గా రాకూడదు’.. ఈ సీన్స్ అండ్ డైలాగ్స్ మీకు గూస్ బంప్స్ ఇస్తాయి..

09.07 AM: రజినీకాంత్ స్టైల్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలా తీసిన నికార్సయిన బ్రహ్మచారిని సాంగ్ బాగుంది. నయనతార – రజినీకాంత్ మధ్య సీన్స్ ప్రేక్షకులని నవ్విస్తాయి.

08.58 AM: స్టోరీలో ఇప్పుడే హీరోకి విలన్ ఎదురయ్యే టైం.. ముంబై డాన్ అయిన విక్కీ మల్హోత్రా కొడుకుని రజినీకాంత్ డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేసాడు.

08.56 AM: రజినీకాంత్ – నయనతార మధ్య కామెడీ సీన్స్ ఓకే అనేలా ఉన్నాయి. లవ్ ట్రాక్ లో రజినీకాంత్ వింటేజ్ పెర్ఫార్మన్స్ నవ్విస్తుంది.

08.54 AM: నివేథ థామస్ రజినీ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చింది.. అలాగే హీరోయిన్ నయనతార ఎంట్రీ క్లాస్ గా ఉంది.

08.52 AM:   సూపర్ స్పీడ్ స్క్రీన్ ప్లే తో దూసుకెళ్తున్న సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అదరగొట్టారు.. ప్రతి సీన్ లో తన మ్యూజిక్ తో భీభత్సమైన ఎలివేషన్ ఇస్తున్నాడు.

08.50 AM: రజినీకాంత్ ఇంటెలిజెంట్ ప్లాన్ తో డిప్యూటీ సీఎం కుమార్తెను పట్టుకున్నాడు.. ప్లాన్ పిక్చరైజేషన్ అదిరింది.

08.45 AM: రజినీ ఫుల్ బిజీగా డ్రగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ కేసెస్ ని సాల్వ్ చేస్తున్నాడు. అది కూడా డిప్యూటీ కమీషనర్ కుమార్తెని ఉపయోగించుకొని..

08.40 AM: మొదటగా రజినీకాంత్ ని ముంబై డ్రగ్ మాఫియా ని క్లోజ్ చేయమని కేసు అప్పగించారు. తన మొదటి కేసు డిప్యూటీ సిఎం డాటర్ కేసుని సాల్వ్ చేయడం..

08:30 AM: సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. రజినీకాంత్ ముంబై కమీషనర్ గా అప్పాయింట్ అయ్యాడు.. రజినీకాంత్ యంగ్ లుక్ లో అదిరిపోయాడు. ఈ ఏజ్ లో కూడా గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు.

08:25 AM: మూవీ లో ఫస్ట్ సాంగ్ ‘దుమ్ము ధూళి’.. రజినీకాంత్ గారి స్టైల్ లో సింపుల్ స్టెప్స్ అండ్ యాటిట్యూడ్ తో అదరగొట్టారు.

08:18 AM: ఆదిత్య అరుణాచలం ఓక రౌడీ కాప్.. రౌడీలకి మాత్రమే కాదు, హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ కి అదిరిపోయే ధమ్కీ ఇచ్చి తనకి పేవర్ గా రిపోర్ట్ తీసుకునే సీన్ అదరగొట్టారు.. ఎవరైనా విజిల్స్ వేయకుండా ఉండలేరు..

08:10 AM: ఆదిత్య అరుణాచలం గా రజినీకాంత్ ఎంట్రీ అదిరింది.. వింటేజ్ స్టైల్ టచ్ తో ఫాన్స్ అందరూ పిచ్చెక్కిపోయేలా ఎంట్రీ సీన్ తీశారు..

08:05 AM: ఓ మాడ్ పోలీస్ గా రౌడీస్ ని ఎన్ కౌంటర్ చేసే సీన్ లో ఊర మాస్ గా రజినీకాంత్ ఎంట్రీ..

08:00 AM: ప్రీమియర్ షో థియేటర్ హౌస్ ఫుల్ అండ్ మాఫియా బ్యాక్ డ్రాప్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ టైటిల్స్ మొదలయ్యాయి.

రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ ప్రీమియర్ షో మరికొద్ది సేపట్లో మొదలు కానుంది. దర్బార్ రన్ టైం 2 గంటల 39 నిమిషాల 28 సెకన్లు..

లైవ్ అప్ డేట్స్: రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ ప్రీమియర్ షో

దర్బార్ మూవీ హైదరాబాద్ అండ్ నైజాం కంప్లీట్ థియేటర్ లిస్ట్

లైవ్ అప్ డేట్స్: రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ ప్రీమియర్ షో

ఇప్పటికే హైదరాబాద్ లో రజినీకాంత్ రికార్డ్స్ ఊచకోత మొదలైంది. రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా హైదరాబాద్ లో మొదటి రోజు 771 షోస్ ప్రదర్శించనున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ మొదటి రోజు 749 షోస్ రికార్డ్ ని బ్రేక్ చేయనుంది.

ట్రేడ్ రిపోర్ట్స్ బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్ ప్రకారం దర్బార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 50 కోట్ల పైనే షేర్ సాధించనుంది. అలాగే ఒక్క తమిళంలో 25 కోట్ల షేర్ ని, తెలుగులో సుమారు 8 కోట్ల షేర్ ని రిజిష్టర్ చేయనుంది.

ఏఆర్ మురుగదాస్ ఫస్ట్ టైం రజినీకాంత్ తో చేస్తున్న సినిమాకి ‘ఇండియా లో జరుగుతున్న సెక్స్ క్రైమ్స్’ పాయింట్ తో కథని సిద్ధం చేశారు. అందుకే ఇందులో రజినీకాంత్ కుమార్తెగా చేసిన నివేథ థామస్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

రజినీకాంత్ – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన దర్బార్ నేడు వరల్డ్ వైడ్ గా 7,000 థియేటర్స్ లో విడుదలవుతోంది. అందులో ఒక్క ఇండియా లోనే 5000 థియేటర్స్ రిలీజ్ అవుతుండగా, అందులో తమిళనాడు నుంచి 1500 థియేటర్స్, ఆంధ్ర – తెలంగాణ నుంచి 800 థియేటర్స్ ఉన్నాయి.

బెంగుళూరులోని కావేరీ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన అత్యంత భారీ రజినీకాంత్ కటౌట్..

లైవ్ అప్ డేట్స్: రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ ప్రీమియర్ షో

2 COMMENTS

  1. 448352 670335This design is spectacular! You certainly know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (nicely, almostHaHa!) Amazing job. I actually enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 776793

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి.. నిర్మాత: ఎన్వీ ప్రసాద్ అండ్ లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్: అనిరుధ్ ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్ రన్ టైం: 2 గంటల 39 నిముషాలు విడుదల తేదీ: జనవరి 09, 2020 ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మొదటి కాంబినేషన్ లో రూపొందిన 'దర్బార్' సినిమా నేడు...రజినీకాంత్ 'దర్బార్' మూవీ రివ్యూ