తెలుగు దర్శకులు బాలీవుడ్ లో సక్సెస్ అవ్వడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాని ఈమద్య కాలంలో వరుసగా మన దర్శకులు అక్కడ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ రూపొందిన సినిమాలు కూడా అక్కడ మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగ అక్కడ కబీర్ సింగ్ తో సూపర్ హిట్ దక్కించుకున్నాడు. అక్కడ మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఎనిమల్ అంటూ రణబీర్ కపూర్ తో సినిమాను చేసేందుకు సందీప్ రెడ్డి వంగా సిద్దం అయ్యాడు.
సినిమాకు సంబంధించిన ప్రకటన కొత్త సంవత్సరం కానుకగా చేయబోతున్నట్లుగా ప్రకటించిన సందీప్ వంగా అన్నట్లుగానే ప్రకటించాడు. అయితే సినిమా ప్రకటన చాలా విభిన్నంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీడియోలో సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ట్రైలర్ గా చూపించాడు. ఇక మరో సక్సెస్ ను సందీప్ వంగ దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది. సినిమాలో అనీల్ కపూర్, బాబీ డియోల్, పరిణితి చోప్రాలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
451858 160683Hello! Someone in my Facebook group shared this site with us so I came to look it over. Im certainly enjoying the data. Im book-marking and is going to be tweeting this to my followers! Outstanding blog and superb style and style. 526985
300519 904856I adore foregathering beneficial information, this post has got me even far more information! . 874361