Switch to English

సామాన్యుడు మూవీ రివ్యూ

Critic Rating
( 1.50 )
User Rating
( 1.50 )

No votes so far! Be the first to rate this post.

Movie సామాన్యుడు
Star Cast విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు
Director తు ప శరవణన్
Producer విశాల్
Music యువన్ శంకర్ రాజా
Run Time 2 hr 46 Mins
Release ఫిబ్రవరి 04, 2022

హీరో విశాల్ నటించిన కొత్త చిత్రం సామాన్యుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

ఈ సినిమా ప్రధానంగా మిడిల్ క్లాస్ జనాల మీద కేంద్రీకరించబడింది. పోలీస్ కాబోతోన్న పోరస్ (విశాల్) తన చెల్లెలి మరణం వెనుకాల ఉన్న మిస్టరీని చేధించే ప్రయత్నం మొదలుపెడతాడు. ఇందులో భాగంగా నీలకంఠం అనే బిజినెస్ మ్యాన్ తో పోరస్ ఎదురుపడాల్సి వస్తుంది.

అసలు ఈ నీలకంఠం ఎవరు? పోరస్ చెల్లెలి హత్యతో నీలకంఠంకు ఉన్న సంబంధం ఏంటి?

నటీనటులు:

విశాల్ తన పరిణితిని మరోసారి ఈ చిత్రం ద్వారా చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో విశాల్ నటన చాలా బాగుంది. ఇక యాక్షన్ పార్ట్ లో విశాల్ రియలిస్టిక్ అప్రోచ్ తో అదరకొట్టాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేసారని చెప్పాలి.

స్క్రీన్ టైమ్ పరంగా డింపుల్ హయతికు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. అయితే ఆమె పాత్రను సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. హీరో పక్కనే ఉండే పాత్రలో యోగి బాబు కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో తన పాత్ర రిలీఫ్ గా అనిపిస్తుంది. హీరో తల్లిగా తులసి పర్వాలేదు. నెగటివ్ పాత్రలో నటించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు రాజా బాగానే చేసాడు. ఇక నీలకంఠంగా నటించిన వ్యక్తి కూడా బాగా చేసాడు.

సాంకేతిక వర్గం:

తు. ప. శరవణన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. కామన్ మిడిల్ క్లాస్ జనాల కష్టాలు చూపించాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవచ్చు. అయితే చిత్రాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. రెగ్యులర్ టెంప్లేట్ మోడ్ లోకి వెళ్లిపోవడం కూడా చిత్రాన్ని దెబ్బతీసింది.

యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది. కెవిన్ రాజ్ ఛాయాగ్రహణం ఇంప్రెసివ్ గా ఉంది. శ్రీకాంత్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. విశాల్ సొంత సినిమా కాబట్టి నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

పాజిటివ్ పాయింట్స్:

  • విశాల్
  • సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్

నెగటివ్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • రొటీన్ స్క్రీన్ ప్లే

చివరిగా:

మొత్తంగా, సామాన్యుడు ఒక రెగ్యులర్ యాక్షన్ డ్రామా, అయితే సరైన ప్రెజంటేషన్, టైట్ స్క్రీన్ ప్లే ఉండుంటే చిత్ర తీరు వేరేగా ఉండుండేది. విశాల్ నటన ఒక్కటే ప్రధాన ప్లస్ పాయింట్ గా ఉన్న ఈ చిత్రం రొటీన్ ట్రీట్మెంట్ కారణంగా దెబ్బతింది.

రేటింగ్ 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి

అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ రెండు నిర్మాణ సంస్థలు నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఆఫ్ట్రాల్ రోజా.! శతకోటి లింగాల్లో బోడి లింగం: రాయపాటి అరుణ

రోజా రెడ్డి అలియాస్ రోజా సెల్వమణి.. సినీ నటి మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. పైగా, ఆమె మంత్రి కూడా. కానీ, ‘ఆఫ్ట్రాల్ రోజా.. శతకోటి లింగాల్లో బోడి లింగం..’...

రాశి ఫలాలు: సోమవారం 08 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ఏకాదశి సా.5:22 వరకు తదుపరి ద్వాదశి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: జ్యేష్ఠ ఉ.11:57 వరకు తదుపరి...

రాశి ఫలాలు: ఆదివారం 14 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ బహుళ తదియ రా.2:00 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాభాద్ర రా.2:05 వరకు తదుపరి...