Samantha: ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి పూర్తి సమయం ఆరోగ్య సంరక్షణకే కేటాయించారు స్టార్ హీరోయిన్ సమంత (Samantha). అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాయామాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటివలే ఆమె ‘ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నటులపై పలు అభిప్రాయాలు పంచుకున్నారు. తనకు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై క్రష్ ఉందని పేర్కొన్నారు.
‘ప్రభాస్ పై గౌరవం.. షారుఖ్ ఖాన్ పై అభిమానం ఉన్నాయి. అనారోగ్యం కారణాలతో కెరీర్లో సాధించిన విజయాలను కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోయా. రోజుకు 5-6 గంటలే నిద్రపోయాను. కెరీర్ 14ఏళ్లు పూర్తి చేసేకోవడం సంతోషంగా ఉంది. పుష్ప తరహా పాటల్లో ఎప్పుడూ నటించలేదు. నేనేంటో చెప్పుకునేందుకే చేశా. మయోసైటిస్ తో బాధపడిన రెండేళ్లు నా ఆలోచనల్ని మార్చుకున్నా. చుట్టూ ఉన్న భయాన్ని జయించాలని నిర్ణయించుకున్నాన’ని అన్నారు.