మెగా హీరో సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తాజా బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని తెలిపింది. ఆయనకు వెంటిలేటర్ తొలగించినట్టు.. సాయితేజ్ ఆయనే స్వయంగా శ్వాస తీసుకుంటున్నారని తెలిపింది. అయితే.. ఆయన ఆరోగ్యం నిరంతర పర్యవేక్షణ కోసం మరికొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉంటారని స్పష్టం చేశాయి.
ఈనెల 10వ తేదీ రాత్రి సుప్రీం హీరో సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఆయన కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. సినీ పరిశ్రమ సెలబ్రిటీలు ఎందరో ఆసుపత్రిలో ఆయన్ను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో ఆయన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేవ్ కట్టా దర్వకత్వంలో సాయితేజ్ ‘రిపబ్లిక్’ అనే సినిమాలో నటించారు.