అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ పుట్టిన రోజు సందర్బంగా సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మొదటగా ఈ సినిమా కు వారసుడు అనే టైటిల్ అనుకున్నారట. కాని ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. కనుక సరైన టైటిల్ ఏజెంట్ అంటూ యూనిట్ సభ్యులు భావించారు. నాగార్జునతో పాటు అక్కినేని కాంపౌండ్ అంతా కూడా ఈ టైటిల్ కే మొగ్గు చూపడంతో ఏజెంట్ టైటిల్ ను నిర్మాత అనీల్ సుంకర రిజిస్ట్రర్ చేయించారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ లుక్ స్టైలిష్ గా ఉండటంతో పాటు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా పాత్ర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
20508 912224Last month, when i visited your weblog i got an error on the mysql server of yours. ~, 840723