వావివరసలు మరచి సోదరిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడు.. చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో బుధవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై ఆమె సొంత అన్నతోపాటు పెద్దమ్మ కుమారుడు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆమె తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే లైంగిక వేధింపులు మొదలుపెట్టారు. బాధిత యువతి చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోగా.. అప్పటి నుంచే తల్లే కుటుంబ పోషణ చూసుకుంటున్నారు. తొలుత వీరి కుటుంబం మణుగూరులో ఉండేది. అయితే, యువతి 9వ తరగతి చదువుతున్న సమయంలో సొంత అన్నయ్యే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
దీంతో అతడి దుశ్చర్యలకు తాళలేక ఆమె ఇంటర్ చదివే సమయంలో కొత్తగూడెంలోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. అయితే, అక్కడ పెద్దమ్మ కుమారుడు అజయ్ కూడా ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానిన బెదిరించాడు. సోదరుల వ్యవహారం గురించి తల్లితోపాటు పెద్దమ్మ, పెదనాన్నలకు చెప్పినా పట్టించుకోకుండా సదరు యువతినే నీచంగా చూశారు. ఈ క్రమంలో ఆ యువతి అన్నయ్యకు కొన్నేళ్ల క్రితం అతడికి ఉద్యోగం రావడంతో కొత్తగూడేనికి మకాం మార్చారు. బాధిత యువతి పెద్దదైనా అతడు తన అకృత్యాలు మానలేదు. దీంతో వారి అఘాయిత్యాలకు విసిగిపోయిన యువతి మంగళవారం కొత్తగూడెం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు అన్నయ్యలతోపాటు తల్లి, పెద్దమ్మ, పెదనాన్న నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. దీంతో అజయ్ తీవ్ర భయాందోళనలకు గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
833639 477352Rattling clean internet web site , thanks for this post. 969450
590378 251891Wohh just what I was seeking for, thanks for putting up. 566802
727013 653911Not long noticed concerning your internet web site and are still already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Good blog. ill be bookmarking keep visiting this internet internet site genuinely typically. 50562