Switch to English

మండలి రద్దుపై రఘురామ పోరాటం.. కేంద్రం ఏమంటుందో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంలేదు.. కానీ, కేంద్రం ఈ వ్యవహారంపై ఓ కన్నేసి వుంచిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. నిజానికి, రాష్ట్రానికి సంబంధించి కీలక విషయాల్లో కేంద్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఆ వ్యూహాత్మక మౌనాన్ని రాష్ట్రంలోని అధికార వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

రాజధాని విషయాన్నే తీసుకుంటే, ‘రాజధాని మార్పుతో మాకు సంబంధం లేదు.. అని కేంద్రమే చెప్పింది గనుక.. కేంద్రంతో మా సఖ్యతకు ఇదే నిదర్శనం.. మా నిర్ణయాలకు కేంద్రం మద్దతిస్తోంది..’ అని వైసీపీ ప్రచారం చేసుకుంటున్న విషయం విదితమే. మరి, శాసన మండలిని ఎందుకు రద్దు చేయలేదు.? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? రైల్వే జోన్ ఎందుకు ముందుకు నడవడంలేదు.? పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధుల్ని ఇంకా ఎందుకు పెండింగులో వుంచుతోంది.? కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు వ్యవహారాలేమిటి.? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తే మాత్రం.. అధికార వైసీపీ మౌనం దాల్చుతుంటుంది.

ఇదిలా వుంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకి మంచి పలుకుబడే వుంది. కానీ, అది భేటీల వరకే పరిమితం.. అని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. గడచిన ఏడాదిన్నర కాలంలో రఘురామ, కేంద్రానికి చాలా ఫిర్యాదులు చేశారు.. రాష్ట్ర ప్రభుత్వంపైన. వాటిల్లో ఒక్క విషయంలో అయినా రఘురామకి అనుకూలంగా పరిస్థితులు కనిపించాయా.? లేదే.! కానీ, శాసన మండలి రద్దు విషయంలో తాను పార్లమెంటు స్థాయిలో పోరాటం చేస్తానంటున్నరు రఘురామ.

అంతేనా, వైసీపీ తరఫున నిబద్ధత గలిగిన నాయకుడిగా, శాసన మండలి రద్దు కోసం నినదిస్తానన్నారు. గతంలో శాసన మండలి రద్దు దిశగా వైసీపీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. ఆ దిశగా అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. శాసన మండలి అంటే ఖర్చు దండగ వ్యవహారం అన్నదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే. అదే జగన్, శాసన మండలికి తమ పార్టీ నుంచి నేతల్ని పంపుతున్నారు.. ప్రత్యేకంగా నామినేట్ చేస్తూ. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానంటూ రఘురామ, ముఖ్యమంత్రికి రాసిన లేఖతో అధికార పార్టీలో చిన్నపాటి కుదుపు కనిపిస్తోంది.

‘మేం ఆ రద్దు విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాం..’ అని మాత్రమే వైసీపీ సెలవిచ్చింది. ఎవరి భయాలు వాళ్ళవి. రద్దు చేస్తే.. మండలి పదవులు పొందిన నేతల నుంచి వ్యతిరేకత రాకుండా వుంటుందా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...