Switch to English

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

Critic Rating
( 2.25 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

Movie రౌడీ బాయ్స్
Star Cast ఆశిష్, అనుపమ పరమేశ్వరన్,
Director హర్ష కొనుగంటి
Producer దిల్ రాజు, శిరీష్
Music దేవి శ్రీ ప్రసాద్
Run Time 2 Hr 25 Min
Release జనవరి 14, 2022

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

ఇంజనీరింగ్ విద్యార్థి అక్షయ్ (ఆశిష్), మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయిన కావ్య (అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు. ఇంజనీరింగ్, మెడికల్ స్టూడెంట్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని తెలిసినా కూడా అక్షయ్ రిస్క్ చేసి వెళ్లి కావ్యకు ప్రపోజ్ చేస్తాడు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన అక్షయ్, కావ్య విడిపోవాల్సి వస్తుంది. దాని తర్వాత అక్షయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రేమికులు తిరిగి ఒకటవుతారా? అసలు ఏం జరుగుతుంది?

నటీనటులు:

రౌడీ బాయ్స్ ద్వారా ఆశిష్ డెబ్యూ చేసాడు. తన డ్యాన్స్ మూవ్స్, యాక్షన్ లో ఈజ్ తో ఆశిష్ ఇంప్రెస్ చేస్తాడు. నటన పరంగా ఆశిష్ కాలేజ్ విద్యార్థిగా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే నటన పరంగా ఇంకా ఆశిష్ మెరుగవ్వాల్సి ఉంది. కొన్ని క్లోజప్ షాట్స్ లో ఆశిష్ కెమెరా ఫియర్ తెలుస్తోంది. అది అధిగమించాలి.

అనుపమ పరమేశ్వరన్ చూడటానికి బాగుంది. ఆశిష్ తో అనుపమ కెమిస్ట్రీ బాగుంది. లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సీన్స్ యూత్ ను అట్రాక్ట్ చేస్తాయి. గ్యాంగ్ లీడర్ గా సాహిదేవ్ విక్రమ్ నటన బాగుంది. కార్తీక్ రత్నం, ఇంకా సహాయ పాత్రల్లో నటించిన వారు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

సాంకేతిక నిపుణులు:

శ్రీ హర్ష కొనుగంటి, హుషారుతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఇక హర్ష ఈసారి రౌడీ బాయ్స్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను ఎంచుకోవడాన్ని మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో మరింతగా వర్కౌట్ చేసి ఉంటే ఔట్పుట్ మరింత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశముంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. కొన్ని పాటలు ఇంప్రెస్ చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో, ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ లో దేవి వర్క్ స్టాండౌట్ గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ నీట్ గా సాగింది. ఎడిటింగ్ కూడా అంతే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గ స్థాయిలో ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • ఆశిష్, అనుపమ మధ్య కెమిస్ట్రీ
  • అనుపమ పరమేశ్వరన్

నెగటివ్ పాయింట్స్:

  • స్లో నరేషన్
  • సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం

విశ్లేషణ:

రౌడీ బాయ్స్ కొన్ని ప్లస్ పాయింట్స్ తో సాగే ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా. అయితే రొటీన్ ట్రీట్మెంట్, గ్రిప్పింగ్ మూమెంట్స్ లేకపోవడం చిత్రాన్ని బిలో యావరేజ్ గా చేసాయి.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

హీరో మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అరంగేట్రం చేసిన మొదటి చిత్రం హీరో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి స్పెషల్ గా...

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...

బంగార్రాజు మూవీ రివ్యూ

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన...

సూపర్ మచ్చి మూవీ రివ్యూ

విజేత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన రెండో చిత్రం సూపర్ మచ్చి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

రాజకీయం

కోడి పందాలు – దొంగ నోట్లు.. ఈ దోపిడీ అదిరింది.!

ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల బరుల వద్ద సరికొత్త దోపిడీ. లక్షల్లో పందాలు కాస్తున్నారు ఔత్సాహికులైన పందెం రాయుళ్ళు. వాళ్ళని మోసం చేస్తున్నారు పందాల నిర్వాహకులు. కొన్ని చోట్ల అంతా సజావుగానే.....

ఔను, చెత్త రాతలే బులుగు పచ్చ జర్నలిజం.!

‘మేం చెత్త రాతలే రాస్తాం.. పబ్లిక్ లైఫ్‌లో వుంటే ఏమన్నా అంటాం. ఇద్దరి కలిసి కూర్చుని చర్చించుకుంటే, అక్కడేదో జరగకూడనిది జరిగిందనే భావిస్తాం. మేం బురద చల్లుతాం, మీరు కడుక్కోవాల్సిందే. మేం చెత్త...

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ...

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం....

‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జార్ఖండ్ కు చెందిన గ్యాంగ్ తో నా హత్యకు కుట్ర...

ఎక్కువ చదివినవి

కొత్త హీరోతో సినిమా చేస్తానంటున్న శ్రీకాంత్ అడ్డాల

లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ కు పెట్టింది పేరుగా నిలిచాడు శ్రీకాంత్ అడ్డాల. ముఖ్యంగా కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. అయితే...

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

హీరో సిద్దార్ధ బూతు పైత్యం వెనుక.!

పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన...

చిరంజీవి ప్రజారాజ్యంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే...

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా ఉధృతి..! కొత్తగా కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు...