Switch to English

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం. మొన్నామధ్య ‘వైఎస్ జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ అధికార వైసీపీ ప్రజా ప్రతినిథులే కొందరు సంచలన ఆరోపణలు చేశారు.

అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చుగానీ, మరీ ఇంతలా హత్యారోపణలు చేయడమేంటి.? హత్యకు కుట్ర.. అంటూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించడమేంటి.? రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా వైసీపీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. ఈ నేపథ్యంలో రఘురామ ఉనికిని వైసీపీ నేతలు కొందరు జీర్ణించుకోలేని పరిస్థితి.

కొన్నాళ్ళ క్రితం రఘురామపై రాజద్రోహం కేసు నమోదయ్యింది. ఆ సమయంలోనే తన హత్యకు కుట్ర జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు రఘురామ. రఘురామని అరెస్టు చేయడం, కస్టడీ సమయంలో ఆయన మీద కొందరు దాడి చేశారంటూ ఆరోపణలు రావడం, తన కాలిపై గాయాల్ని రఘురామ అప్పట్లో విచారణ సందర్భంగా న్యాయమూర్తికి చూపించడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే.

అసలు రఘురామపై దాడి జరిగిందా.? లేదా.? అన్నదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. కానీ, రఘురామకి గాయాలు అయ్యాయి.. ఆ గాయాలకు మిలిటరీ ఆసుపత్రిలో వైద్య చికిత్స కూడా జరిగింది. చాన్నాళ్ళపాటు ఆయన కాలు కింద పెట్టలేని పరిస్థితి కూడా వచ్చింది.

మళ్ళీ ఇప్పుడు, ఇంకోసారి రఘురామ.. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దరిమిలా, ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సి వుంది. సాక్షాత్తూ తమ ఎంపీ చేస్తున్న ఆరోపణలపై అధికార పార్టీ వివరణ ఇచ్చుకోవాలి. రెబల్ ఎంపీ గనుక దుష్ప్రచారమే చేస్తోంటే చర్యలు తీసుకోవాలి. కానీ, అలాంటివేమీ జరగడంలేదంటే.. కాస్త అనుమానించాల్సిన విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...

బంగార్రాజు మూవీ రివ్యూ

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన...

సూపర్ మచ్చి మూవీ రివ్యూ

విజేత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన రెండో చిత్రం సూపర్ మచ్చి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

రాజకీయం

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ...

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం....

‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జార్ఖండ్ కు చెందిన గ్యాంగ్ తో నా హత్యకు కుట్ర...

రాజకీయాలకు నేను పూర్తిగా దూరం: మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...

ఎక్కువ చదివినవి

2023లో సుక్కూతో ర్యాంప్ ఆడిస్తానంటోన్న విజయ్

రంగస్థలం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సుకుమార్, పుష్ప ది రైజ్ తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం అన్ని భాషల్లో కూడా మంచి విజయం...

రండి.. కోవిడ్ వైరస్ అంటించుకోండి.! ఇదెక్కడి బాధ్యతారాహిత్యం.?

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయ్.. ఐదు వేలకు దిగువకు దేశంలో రోజువారీ కేసులు దిగివస్తున్న వేళ, అనూహ్యంగా కేసుల తీవ్రత పెరిగిపోయి.. లక్షన్నరకి చేరుకుంది. నాలుగైదు లక్షలకు రోజువారీ కేసులు చేరడానికి జస్ట్...

డేంజర్ బెల్స్..! ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తంగా కరోనాతో 14,503 మంది మృతి...

రాఘవ, తల్లి, అక్క వల్లే ఆత్మహత్య..! రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో..!!

తన కుటుంబం ఆత్మహత్యకు ప్రధాన సూత్రధారుడు రాఘవ అని.. అతనికి తన తల్లి సూర్యావతి, అక్క మాధవి సహకరించారని బాధిత రామకృష్ణ తీసుకున్న మరో సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో..’ 20...

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం దృష్టి అంతా కూడా సినిమా టికెట్ల...