Switch to English

రెడ్‌ జోన్లు సరే.. ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఎవరికి.?

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెడ్‌ జోన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదు జిల్లాలు, తెలంగాణ నుంచి ఆరు జిల్లాలు రెడ్‌ జోన్‌లో వున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ జిల్లాల లెక్క విషయంలోనే కొంత గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 23 జిల్లాలు అయితే, అందులో తెలంగాణ ప్రాంతానికి 10 జిల్లాలు, ఆంధ్ర ప్రాంతానికి 13 జిల్లాలుండేవి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 33కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పాత 13 జిల్లాలే వున్నాయి. ఆ జిల్లాల సంఖ్య పెరగలేదు. దాంతో, జిల్లాల ప్రాతిపదికన కాకుండా మండలాల ప్రాతిపదికన రెడ్‌ జోన్ల ఎంపిక వుండాలన్నది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాదన.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ మేరకు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది కూడా. ఏ జిల్లాలో ఏయే మండలాలు రెడ్‌ జోన్‌లో వున్నాయో పేర్కొంటూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి కొన్ని మినహాయింపుల్ని కేంద్రం ఇస్తూ వస్తోంది ‘లాక్‌డౌన్‌’ నిబంధనల్లో. మే 3 తర్వాత గ్రీన్‌ జోన్లలో కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఆరెంజ్‌ జోన్లలోనూ కొన్ని వెసులుబాట్లు వస్తాయి. రెడ్‌ జోన్లలో మాత్రం నిబంధనలు కొనసాగుతాయి. ఇదే అసలు సమస్య.

ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రెడ్‌ జోన్‌లో వున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్నే తీసుకుంటే.. కొన్ని మండలాల్లోనే తీవ్రత ఎక్కువగా వుందనీ, మిగతా చాలా మండలాలు అసలు కరోనా ప్రభానికి గురి కాలేదనీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. కానీ, కేంద్రం ‘రెడ్‌ జోన్లు ఇవీ.. ఆరెంజ్‌ జోన్లు ఇవీ.. గ్రీన్‌ జోన్లు ఇవీ..’ అని ప్రకటించాక, రాష్ట్ర ప్రభుత్వాల వాదన చెల్లుతుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారంపై రేపు సాయంత్రానికే ఓ క్లారిటీ వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు. నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా రన్ టైం: 86 నిముషాలు విడుదల తేదీ: మే 29,...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనా.?

పోలవరం ప్రాజెక్ట్‌.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆలోచనలు ముందడుగు వేశాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞం.....

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో, రారో అనే అనుమానాలు రోజురోజుకీ పెరుగుతూనే...

14 వేల సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన తారలు

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్...

పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్‌ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్‌ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు...