Switch to English

ఇంగ్లీష్‌ మీడియం: జగన్‌ కోరుకున్నదే జరుగుతోందా.?

ఇంగ్లీషు మీడియం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏదయితే అనుకుంటున్నారో అదే జరుగుతోందా.? అంటే, ప్రభుత్వం మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తోంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా. తెలుగు మీడియంని పూర్తిగా అటకెక్కించేసి, ఇంగ్లీషు మీడియంని ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురావాలన్నది వైఎస్‌ జగన్‌ సంకల్పం.

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తాజాగా వచ్చిన అభిప్రాయాల్ని బట్టి, ఆంధ్రప్రదేశ్‌లో 95 శాతానికి పైగానే ఇంగ్లీషు మీడియంని కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైపోయింది. దాంతో, ప్రభుత్వం తన కార్యాచరణను మరింత వేగంగా కొనసాగించబోతోంది రానున్న రోజుల్లో. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియంతో ప్రభుత్వ స్కూళ్ళను నింపేయాలన్నద ఇవైఎస్‌ జగన్‌ ఆలోచన.

కోర్టు మొట్టికాయలతో ఈ వ్యవహారానికి కాస్త బ్రేక్‌ పడగా, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల నేపథ్యంలో.. మరోసారి ప్రభుత్వం, ఇంగ్లీషు మీడియంపై కోర్టుకి వెళ్ళి, అట్నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తెప్పించుకునేందుకు ప్రయత్నించనుంది. నిజానికి, ‘ఇంగ్లీష్‌ మీడియం వద్దు.. తెలుగు మీడియం మాత్రమే ముద్దు..’ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అనగలరా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, ఇంగ్లీషు మీడియంకి పెరిగిన ప్రాధాన్యత అలాంటిది.

కూలి పనులు చేసుకునేవాళ్ళూ ఎలాగైనా కష్టపడి తమ పిల్లల్ని ఇంగ్లీష్‌ కాన్వెంట్‌లో చదివించాలనుకుంటున్న రోజులివి. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మీడియంని ప్రభుత్వ పాఠశాలకు విస్తరిస్తే తద్వారా పేదలకు మేలు జరుగుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. గత ప్రభుత్వాలూ ఈ విషయమై తమవంతు కృషి చేశాయన్నది నిర్వివాదాంశం. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, తెలుగుని కేవలం ఓ సబ్జెక్ట్‌గా వుంచి, పూర్తిగా ఇంగ్లీషు మీడియం చేసెయ్యాలనే ఆలోచనతో వుంది.

కోర్టు వివాదాలు, ఇతరత్రా ఆందోళనల నేపథ్యంలో మధ్యే మార్గంగా మండలానికి ఓ తెలుగు మీడియం స్కూల్‌ అనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర వుంది గనుక.. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంపై పెద్దగా అభ్యంతరం చెప్పడానికేమీ లేదు. మరి, జగన్‌ ప్రభుత్వం తాజా ఆలోచనలపై కోర్టు ఏమంటుందో.. కొత్త విద్యా సంవత్సరం ఇంగ్లీషు మీడియంతోనే ప్రారంభమవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...

క్రైమ్ న్యూస్: పెళ్లి చేసుకుంటానంటూ వివాహితపై అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఒక మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరి జీవితంను గడుపుతుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురుతో ఒంటరిగా జీవితాన్ని...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....